బైరెడ్డి బావురుమంటోంది అందుకేనా?
రాజకీయాల్లోకి ఒక్కసారంటూ అడుగు పెట్టిన తర్వాత అందులో ఉండే మజానే వేరు. తండ్రీకొడుకులైనా, అన్నాచెల్లెళ్లయినా, భార్యా భర్తలైనా, అన్నదమ్ములైనా రాజకీయాల విషయంలో పైచేయి సాధించేందు కు ప్రయత్నిస్తూనే [more]
రాజకీయాల్లోకి ఒక్కసారంటూ అడుగు పెట్టిన తర్వాత అందులో ఉండే మజానే వేరు. తండ్రీకొడుకులైనా, అన్నాచెల్లెళ్లయినా, భార్యా భర్తలైనా, అన్నదమ్ములైనా రాజకీయాల విషయంలో పైచేయి సాధించేందు కు ప్రయత్నిస్తూనే [more]
రాజకీయాల్లోకి ఒక్కసారంటూ అడుగు పెట్టిన తర్వాత అందులో ఉండే మజానే వేరు. తండ్రీకొడుకులైనా, అన్నాచెల్లెళ్లయినా, భార్యా భర్తలైనా, అన్నదమ్ములైనా రాజకీయాల విషయంలో పైచేయి సాధించేందు కు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎక్కడైనా బావే కానీ.. అన్న సామెత రాజకీయాల్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య స్పష్టంగా వినిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా కుటుంబమే కానీ, రాజకీయాల్లో మాత్రం కాదనే విషయం ఇప్పటికే చాలా జిల్లాల్లో చాలా పార్టీల్లో మనకు కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కర్నూలులో తెరమీదికి వచ్చింది.
బీజేపీలో చేరి…..
కర్నూలు జిల్లా రాజకీయాలు అంటేనే ఎప్పుడూ హాట్ హాట్‌గా సాగుతాయి. అలాంటి రాజకీయాల్లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన విమర్శలు, తనదైన చాతుర్యంతో ఆయన మంచి ముద్ర వేసుకున్నారు. అయితే, ఇప్పుడు ఈయన ఇంట్లోనే రాజకీయ దుమారం చెలరే గిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబును తీవ్రంగా విమర్శించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన బైరెడ్డి ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమం చేసి ప్రత్యేకంగా పార్టీ కూడా పెట్టుకున్నారు. అయితే, ఈ ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన సొంత పార్టీని పక్కన పెట్టి తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఈ క్రమంలోనే ఆయన తన కుమార్తె శబరిని రంగంలోకి తెచ్చారు.
అక్కా తమ్ముళ్లయినా…..
ఇక, దీనికి ముందు బైరెడ్డి తన తమ్ముడి కొడుకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని రాజకీయంగా తెరమీదికి తెచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలోనే పల్స్ పట్టుకున్న సిద్ధార్థ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. నందికొట్కూరులో రాజకీయ జోరు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన గత ఎన్నికలకు యేడాది ముందు వరకు టీడీపీలోనే ఉన్నా ఆ తర్వాత పెదనాన్న బైరెడ్డికి చెప్పకుండానే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో హతాశులైన రాజశేఖరెడ్డి సిద్ధార్థకు పోటీగా తన కుమార్తె శబరిని తీసుకువచ్చారన్న ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. దీంతో అటు సిద్ధార్థ ఇటు శబరిలు వరుసకు అక్కా తమ్ముళ్లు. అయినా కూడా రాజకీయంగా మాత్రం కత్తులు దూసుకుంటున్నారు.
మొదటి నుంచి…..
ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు మొదట్నుంచీ జగన్ అంటేనే బైరెడ్డి ఫ్యామిలీకి అస్సలు పడదు. జగన్ పేరు చెబితేనే అంతెత్తున ఎగిసిపడే పెదనాన్న కు చెప్పకుం డానే సిద్ధార్ద రెడ్డి వైసీపీ కండువా కప్పేసుకున్నాడు. కానీ ఈ విషయంపై బైరెడ్డి బహిరంగంగా పెద్దగా విమర్శించకపోయినా లోకల్ గా సిద్ధార్ధకు వ్యతిరేకంగా పనిచేసుకుంటూ పోతున్నారన్నట. ఈ నేపథ్యంలో ఆయన తన ఎలాగైనా కూతుర్ని రాజకీయాల్లో రాణించేలా ప్రత్యర్ధిని దెబ్బకొట్టేలా చేయాలని యోచిస్తున్నారని అంటున్నారు. ఈ పరిణామాలతో నందికొట్కూరు రాజకీయాలు వేడెక్కాయని తెలుస్తోంది.