ఇంకేమి లేదట …. తేలిపోతున్న వ్యూహం
భారతీయ జనతాపార్టీ తెలుగురాష్ట్రాల్లో బలపడాలనే మాటలే తప్ప అందుకు ఉన్న అవకాశాలను ఏ మాత్రం వినియోగించుకోవడం లేదు. దీనికి కారణం ఏమిటన్నది కమలం పార్టీ నేతలకే అర్ధం [more]
భారతీయ జనతాపార్టీ తెలుగురాష్ట్రాల్లో బలపడాలనే మాటలే తప్ప అందుకు ఉన్న అవకాశాలను ఏ మాత్రం వినియోగించుకోవడం లేదు. దీనికి కారణం ఏమిటన్నది కమలం పార్టీ నేతలకే అర్ధం [more]
భారతీయ జనతాపార్టీ తెలుగురాష్ట్రాల్లో బలపడాలనే మాటలే తప్ప అందుకు ఉన్న అవకాశాలను ఏ మాత్రం వినియోగించుకోవడం లేదు. దీనికి కారణం ఏమిటన్నది కమలం పార్టీ నేతలకే అర్ధం కావడం లేదు. కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్ వంటివి తెలుగు రాష్ట్రాలపై మోడీ సర్కార్ కు వున్న ప్రేమ ఏపాటిదో దర్పణం పడతాయి. అటువంటి అంశాల్లో తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్న కాషాయదళం చక్కగా వినియోగించుకోవొచ్చు. కానీ ఆ వైపుగా ఆరేళ్లుగా అనుకున్న రీతిలో బీజేపీ అడుగులు పడటమే లేదు. దాంతో కేంద్రం వైఖరి అటు తెలంగాణ లో, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న ప్రాంతీయ పార్టీలకు పరోక్షంగా వరం అవుతుంది.
ప్రాంతీయ పార్టీలకు పరోక్ష వరాలు …
టీఆర్ఎస్, వైసిపి ప్రభుత్వాలు కేంద్రం తీరుపై నిప్పులు చెరుగుతున్నాయి. అయితే వీరి విమర్శలు చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లుగా మారింది. ముఖ్యంగా గుజరాత్, యుపి వంటి బీజేపీ అధికారంలో వున్న ప్రాంతాలకే వరాలు అందుతున్నాయి తప్ప మిగిలిన రాష్ట్రాలకు కేంద్రం మొండి చెయ్యి చూపిస్తూ వస్తుంది. దీనికి తోడు గతానికి భిన్నంగా వచ్చే నిధుల్లో కూడా కోత పెట్టి, ఇచ్చింది తీసుకుని పొండి అనే స్థాయిలో బీజేపీ సర్కార్ తీరు సాగుతుంది. మరీ ముఖ్యంగా దక్షిణ భారతానికి వివక్ష కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా కొనసాగిస్తూనే వున్నాయి.
అంతా అయిపోయిందా ….?
ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం. ఇక ప్రత్యేక ప్యాకేజీ ఎప్పుడో ఇచ్చేశాం. మరి పోలవరం పై ఇచ్చిన నిధులకు ఇప్పటిదాకా లెక్కలు సక్రమంగా ఇచ్చిందే లేదు. అవి వచ్చాకా దాని సంగతి చూస్తాం. కేంద్రం బడ్జెట్ అంటే రాష్ట్రాలను దృష్టి లో పెట్టుకుని చేసేది కాదు. దేశాన్ని దృష్టి లో పెట్టుకుని చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నేతలు పలుకుతున్న చిలక పలుకులు. అంటే దీన్నిబట్టి తెలుగు రాష్ట్రాలకు మరీ ముఖ్యంగా ఎపి ప్రజలు కేంద్ర బడ్జెట్ పై ఎలాంటి ఆశలు పెట్టుకోవాలిసిన అవసరమే లేదని వారు స్పష్టం చేసేసారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల అధినేతలు, ఎంపీలు మంత్రులు ఇప్పటికే విమర్శల వర్షం కురిపిస్తూ వివక్ష ను ప్రశ్నిస్తున్నారు. కానీ వీరి డిమాండ్ లు గతంలోలాగే అరణ్య రోదనే కానుందా లేక కేంద్రం కొంతైనా కరుణించి తెలుగు రాష్ట్రాల్లో పట్టుకోసం బీజేపీ ప్రయత్నం చేస్తుందా? లేదా? అన్నది చూడాలి.