థాక్రేతో కొంత తగ్గైనా… దెబ్బకొట్టాలనేనా?
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. రాజస్థాన్ లోనూ అదే పరిస్థితి కన్పిస్తుంది. కానీ తమకు అందివచ్చినట్లే వచ్చి చేజారి పోయిన మహారాష్ట్రలో తిరిగి [more]
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. రాజస్థాన్ లోనూ అదే పరిస్థితి కన్పిస్తుంది. కానీ తమకు అందివచ్చినట్లే వచ్చి చేజారి పోయిన మహారాష్ట్రలో తిరిగి [more]
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. రాజస్థాన్ లోనూ అదే పరిస్థితి కన్పిస్తుంది. కానీ తమకు అందివచ్చినట్లే వచ్చి చేజారి పోయిన మహారాష్ట్రలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ కసరత్తులు పూర్తిచేస్తుంది. మహారాష్ట్రలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంపై ఇప్పుడు కమలం కన్నేసింది. వీలయినంత త్వరలో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు కన్పిస్తుంది.
ఒక అడుగు వెనక్కు వేసైనా…
ఒక అడుగు వెనక్కు వేసైనా మహారాష్ట్రలో మళ్లీ కాషాయ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో కమలనాధులు పావులు కదుపుతున్నారు. నిజానికి మహారాష్ట్రలో బీజేపీ సర్కార్ ఏర్పడాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపును పోటీ చేసిన బీజేపీ, శివసేనలు పూర్తి స్థాయి మెజారిటీని సాధించాయి. అయితే శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టడం, చెరి రెండున్నరేళ్ల ఫార్ములాను ముందుకు తేవడంతో బీజేపీ అంగీకరించలేదు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా….
పైగా ఎన్సీపీని చీల్చేందుకు ప్రయత్నించింది. దీంతో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలు కలసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మూడు పార్టీల మధ్య స్వల్ప విభేదాలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా ఎన్సీపీ వ్యవహార శైలి పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సయితం కొంత అసహనంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అండ లేకపోవడం, కరోనా వైరస్ తో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల పాలు కావడంతో ఉద్ధవ్ థాక్రే సయితం పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు.
సీఎం పదవిని కూడా…..
సహజంగానే బీజేపీ, శివసేనలది ఒకే పంథా కావడంతో రెండు పార్టీల మధ్య మళ్లీ అవగాహన కుదిరే అవకాశముందంటున్నారు. ఈ మేరకు బీజేపీ సంకేతాలను ఉద్ధవ్ థాక్రేకు పంపింది. అవసరమైతే ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్ల పాటు ఇచ్చేందుకు కూడా బీజేపీ సిద్ధమయిందంటున్నారు. అందుకే బీజేపీ మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారంటున్నారు. శివసేన అంగీకరిస్తే మహారాష్ట్రలో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందని ప్రకటించడం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయంటున్నారు.