కన్నాకు ముప్పు తప్పదా…?
రెండేళ్ళ క్రితం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన మాజీ కాంగ్రెస్ వాది కన్నా లక్ష్మీనారాయణ వల్ల బీజేపీ లాభపడిన మాట పక్కన పెడితే నోటా కంటే కూడా [more]
రెండేళ్ళ క్రితం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన మాజీ కాంగ్రెస్ వాది కన్నా లక్ష్మీనారాయణ వల్ల బీజేపీ లాభపడిన మాట పక్కన పెడితే నోటా కంటే కూడా [more]
రెండేళ్ళ క్రితం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన మాజీ కాంగ్రెస్ వాది కన్నా లక్ష్మీనారాయణ వల్ల బీజేపీ లాభపడిన మాట పక్కన పెడితే నోటా కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చాయి. ఇక కన్నా కోస్తాలో బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన వారు, కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పాటు మంత్రిగా పనిచేసిన అనుభవం ఇవన్నీ కలసి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి ఏదో కొత్త బలం తెస్తారనుకున్నారు. కానీ కన్నా లక్ష్మీనారాయణ రాకతో పరిస్థితి మరింత దిగనారిందన్నది నిజమేనని బీజేపీ నాయకులే అంటున్నారు. ఏపీలో కునారిల్లిపోయినా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ పొలిటికల్ గ్లామర్ ఏపీ బీజేపీకి కూడా కొంత ఉంది. ఇక రాజకీయ శరణార్ధులు బీజేపీలో చేరుతున్న సందడి కనిపిస్తున్నా సొంతంగా బీజేపీ బలపడిందా అంటే లేదు అన్న సమాధానమే వస్తుంది. ఈ క్రమంలో కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్ష పీఠం మీద నీలి నీడలు ముసురుకుంటున్నాయి.
టీడీపీ హ్యాండ్ ఉంటుందా..?
ఏపీలో బీజేపీ అధ్యక్షున్ని మార్చాలన్నది బీజేపీ పార్టీ విధానంలో ఓ భాగం. తెలంగాణాలో కూడా అధ్యక్షుడు లక్ష్మణ్ ని మారుస్తారని అంటున్నారు. ఇలా బీజేపీ తన సొంత పార్టీ రిపేర్లు ఏవో తాను చేసుకుంటోంది. అయితే ఇందులో వేలూ కాలూ పెట్టేందుకు టీడీపీ ఉబలాటపడుతోందన్నదే ఇపుడు హాట్ టాపిక్. ఏపీలో ఆరేళ్ల పాటు బీజేపీ ప్రెసిడెంట్ గా కె హరిబాబు ఉండేవారు. ఆయన చంద్రబాబుకు బాగా అనుకూలురు అన్న పేరు సంపాదించుకున్నారు. ఆ రోజుల్లో హరిబాబు నోటివెంట బాబుని విమర్శిస్తూ ఒక్క మాట కూడా వచ్చేది కాదు. బాబుకు, బీజేపీ చెడిన తరువాత కన్నా లక్ష్మీనారాయణ ఎంట్రీ ఇచ్చారు. మధ్యలో వారధిగా ఉన్న పెద్దాయన వెంకయ్యనాయుడు రాజ్యాంగ పదవిలోకి వెళ్ళాక బీజేపీ మీద బాబు పట్టు కూడా తగ్గిపోయింది. మళ్ళీ ఇపుడు తన కుడిభుజం సుజనాచౌదరి, సీఎం రమేష్ వంటి వారు వెళ్లాక బాబుకు ఏపీ బీజేపీ కూడా తన దోస్త్ అనిపిస్తోందట. దాంతో ఏ మాత్రం వీలు చిక్కినా తన మనిషిని, లేక తనకు అనుకూలురైన వారిని ఏపీ బీజేపీ అధ్యక్షుడిని చేయాలని బాబు తెర వెనక మంత్రాంగం నడుపుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
సుజనాకు చాన్స్…?
నిన్న కాక మొన్న బీజేపీలోకి చేరిన సుజనా చౌదరికి చాన్స్ ఉంటుందా అన్నది ఇపుడు అటు టీడీపీలోనూ, ఇటు బీజేపీలోనూ చర్చగా ఉంది. సుజనాచౌదరి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆర్ధికంగా బలంగా ఉన్నారు. బలమైన సామాజికవర్గానికి చెందినవారు. కన్నా లక్ష్మీనారాయణ కు కిరీటం పెట్టేందుకు ఏ కారణాలు ఉన్నాయో అవే కారణాలు ఇపుడు సుజనా విషయంలోనూ ఉన్నాయి. ఆయన ఏపీ బీజేపీ సారధి అయితే బాబు రొట్టె విరిగి నేతిలో పడినట్లే. అయితే కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు 2014 ఎన్నికల ముందు బీజేపీలో చేరి మూడేళ్ళు సావాసం చేసిన తరువాత పదవి ఇస్తేనే ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజు లాంటి వారు గోల పెట్టేశారు, మరి ఇలా వచ్చి అలా పదవి పట్టుకుపోతామంటే బీజేపీ వీర్రాజులు వూరుకుంటారా అన్న చర్చ కూడా వస్తోంది. అయితే ఎవరేమనుకున్నా ఏపీలో బీజేపీ బలోపేతం అన్న ఒక్క మాటతో నోరు మూయించే సామర్ధ్యం హై కమాండ్ కి వుంది. అయితే కోరి కోరి బాబు కుడిభుజమని పేరున్న సుజనాకు ఈ పదవి అప్పగిస్తారా అన్నదే డౌట్. సుజనా కాకపోతే బీజేపీలో బాబుకు అనుకూలమని పేరున్న ఎవరికైనా పదవి ఇచ్చినా కధ నడిపించుకోవచ్చున్న ఆలోచనలో పసుపు శిబిరం ఉందిట. మొత్తానికి ఈ మధ్య బాబు గొంతుని ఎంతలా తన గొంతు ద్వారా కన్నా లక్ష్మీనారాయణ వినిపిస్తున్నా కూడా టీడీపీ మాత్రం కన్నాని కదిపేసేందుకే తన నిన్నటి తమ్ముళ్ళ ద్వారా పావులు కదుపుతోందని అంటున్నారు.