ఆ లీడర్ ఏ పార్టీలో ఉన్నాడో… వైసీపీతో ఫ్రెండ్షిప్ మాత్రమేనా ?
బొడ్డు భాస్కర రామారావు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ విఫ్… పైగా ఫైర్ బ్రాండ్ పొలిటికల్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో [more]
బొడ్డు భాస్కర రామారావు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ విఫ్… పైగా ఫైర్ బ్రాండ్ పొలిటికల్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో [more]
బొడ్డు భాస్కర రామారావు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ విఫ్… పైగా ఫైర్ బ్రాండ్ పొలిటికల్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో రెండు దశాబ్దాలుగా ఆయన లేకుండా రాజకీయం లేదు. 2004లో పెద్దాపురం నుంచి ఎమ్మెల్యేగా ఓడిన ఆయన 2009లో అదే నియోజకవర్గంలో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. మారిన రాజకీయాల నేపథ్యంలో బొడ్డు భాస్కర రామారావుకు మళ్లీ పొలిటికల్ లైఫ్ ఉంటుందా ? అన్న సందేహాల వేళ 2011లో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించారు. చంద్రబాబు ఇచ్చిన ఈ ఛాన్స్ ఉపయోగించుని ఎమ్మెల్సీ అయిన భాస్కర రామారావు 2014 ఎన్నికలకు ముందు తన తనయుడితో కలిసి వైసీపీలోకి జంప్ చేసేశారు.
వైసీపీలో చేరి….
ఆ ఎన్నికల్లో రాజమహేంద్రవరం ఎంపీగా పోటీ చేసిన బొడ్డు తనయుడు బొడ్డు వెంకట రమణ చౌదరి మురళీ మోహన్ చేతిలో 1.57 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో బొడ్డు భాస్కర రామారావు ప్రతిపక్షంలో రాజకీయం చేయలేక చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆయన పార్టీలో ఉన్నప్పటి నుంచే గత ఎన్నికల్లో పెద్దాపురం సీటు కావాలని అప్పట హోం మంత్రి చినరాజప్పతో కయ్యానికి కాలు దువ్వుతూ ఉండేవాడు.
పార్టీ మారి రావడంతో…..
సహజంగానే చంద్రబాబు పార్టీ మారి తిరిగి వచ్చిన బొడ్డు భాస్కర రామారావును పట్టించుకోలేదు. ఒకానొక దశలో రాజప్ప వర్సెస్ బొడ్డు మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. చివరకు ఎన్నికలకు ముందు బొడ్డు చినరాజప్పను ఓడించేందుకు నాటి వైసీపీ అభ్యర్థి తోట వాణికి లోపాయికారిగా సహకరించారన్నది ఓపెన్ సీక్రెట్. ఎన్నికల్లో వైసీపీ గెలిచినా పెద్దాపురంలో బొడ్డు భాస్కర రామారావు పంతం నెగ్గలేదు… సరికదా రాజప్ప మళ్లీ గెలిచి.. పెద్దాపురాన్ని తన కంచుకోటగా మార్చేసుకున్నారు. అప్పటి నుంచి బొడ్డుకు ఏం చేయాలో తెలియని పరిస్థితి.
ఏ పార్టీలో ఉన్నానని చెప్పుకునే…?
ఇటు టీడీపీలో ఉన్నానని చెప్పుకునే పరిస్థితి లేదు… చంద్రబాబు, లోకేష్ బొడ్డు భాస్కర రామారావును దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు టీడీపీలోకి వెళ్లి చేసేదేం కూడా లేదని డిసైడ్ అయిన ఆయన అధికారికంగా వైసీపీలో లేకపోయినా.. వైసీపీ వాళ్లతో ఫ్రెండ్షిఫ్లు చేసుకుంటూ తన పనులు చేయించుకుంటున్నారన్న టాక్ స్థానికంగా ఉంది. పోనీ అటు వైసీపీ అయినా ఆయన్ను నమ్మే పరిస్థితి ఉందా ? అంటే ఖచ్చితంగా లేదు. ఇక బొడ్డు భాస్కర రామారావు తనయుడు తిరిగి సాఫ్ట్వేర్ కంపెనీ వ్యవహారాల్లో బిజీ అయిపోయాడు. ఏదేమైనా బొడ్డు రెండిటికి చెడ్డ రేవడిలా ఎవ్వరూ నమ్మక…. వైసీపీకే సపోర్ట్ అంటూ వైసీపీ వాళ్లను నమ్మిస్తూ తన పనులు చక్క పెట్టుకుంటున్నాడని తూర్పులో వినిపిస్తోన్న గుసగుసలు ?