బొల్లినేనికి ఇక బై చెప్పేసినట్లేనట
ఆయన ఎమ్మెల్యేగా ఉంటేనే కనపడరు. అలాంటిది మాజీ అయితే అసలు దొరుకుతారా? ఉదయగిరి నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పరిస్థితి. 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత [more]
ఆయన ఎమ్మెల్యేగా ఉంటేనే కనపడరు. అలాంటిది మాజీ అయితే అసలు దొరుకుతారా? ఉదయగిరి నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పరిస్థితి. 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత [more]
ఆయన ఎమ్మెల్యేగా ఉంటేనే కనపడరు. అలాంటిది మాజీ అయితే అసలు దొరుకుతారా? ఉదయగిరి నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పరిస్థితి. 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన వ్యాపారాలపైనే దృష్టి పెట్టడంతో ఇక్కడ క్యాడర్ గగ్గోలు మంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బొల్లినేని రామారావు పార్టీ క్యాడర్ కు ఏమాత్రం సహకరించలేదని ఇప్పటికే పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు అందాయి.
కీలకమైన నియోజకవర్గం….
నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గం కీలకమైనది. ఇక్కడ వెంకయ్యనాయుడు జనతా పార్టీ నుంచి ఒకసారి, బీజేపీ నుంచి మరోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ కు గట్టి పట్టున్న ఈ నియోజకవర్గంలో టీడీపీ రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. 1999లో కంభం విజయరామిరెడ్డి విజయం సాధించారు. తర్వాత 2014లో బొల్లినేని రామారావు టీడీపీ నుంచి గెలిచారు. ఇక్కడ ఎక్కువగా రెడ్డి సామాజికవర్గం వారే గెలుస్తుండటం విశేషం.
క్యాడర్ ఎప్పటినుంచో…?
బొల్లినేని రామారావును ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించాలని ఎప్పటి నుంచో పార్టీ క్యాడర్ కోరుతుంది. అయితే ఆర్థిక వనరుల దృష్ట్యా చంద్రబాబు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పై అసంతృప్తి ఉన్నా దానిని టడీపీ క్యాష్ చేసుకోలేకపోతుంది. దీంతో చంద్రబాబు ఈ నియోజకవర్గం ఇన్ ఛార్జిని మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బిొల్లినేని రామారావును పక్కకు తప్పించాలని నిర్ణయించుకున్నారు.
కావ్యకు అప్పగించాలని…
అయితే ప్రముఖ పారిశ్రామిక వేత్త కావ్య కృష్ణారెడ్డికి ఉదయగిరి పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలోనే ఈయన పేరు విన్పించినా కమ్మ సామాజికవర్గానికి జిల్లాలో ఆత్మకూరు, ఉదయగిరి మినహా ఎక్కడా అవకాశం లేకపోవడతో బొల్లినేని రామారావుకే టిక్కెట్ కేటాయించారు. అయితే ఈసారి ప్రజల్లో పట్టున్న కావ్య కృష్ణారెడ్డిని ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. కలిగిరి, కొండాపురం, వింజమూరు, జలదంకి మండలాల్లో పట్టుండటం, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే అశోక్ బాబు పేరు కూడా పరిశీలనలో ఉందంటున్నారు. మొత్తం మీద బొల్లినేని రామారావుకు ఈసారి చంద్రబాబు ఝలక్ ఇస్తారనే చెబుతున్నారు.