బంగీ జంప్ రేంజ్ పెరిగిందా?
టీడీపీలో ఆయన కీలక నేత. మంత్రి పదవిని ఆశించి భంగ పడ్డారు. టీటీడీ సభ్యత్వంతో సరిపెట్టుకున్నారు. అయితే, ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో ఓటమి తర్వాత [more]
టీడీపీలో ఆయన కీలక నేత. మంత్రి పదవిని ఆశించి భంగ పడ్డారు. టీటీడీ సభ్యత్వంతో సరిపెట్టుకున్నారు. అయితే, ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో ఓటమి తర్వాత [more]
టీడీపీలో ఆయన కీలక నేత. మంత్రి పదవిని ఆశించి భంగ పడ్డారు. టీటీడీ సభ్యత్వంతో సరిపెట్టుకున్నారు. అయితే, ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో ఓటమి తర్వాత ఇక, ఈ పార్టీలో ఉండడం ఎందుకు అని దాదాపు నిర్ణయానికి వచ్చేశారు. అయితే, అనూహ్యంగా మళ్లీ పార్టీ జెండానే మోస్తున్నారు. ఆయనే టీడీపీ నాయకుడు, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. కాపు నాయకుడిగా పేరు తెచ్చుకున్న బొండా ఉమామహేశ్వరరావు ఇప్పడు టీడీపీలో మొదటి ఐదు నెంబర్లలో ఒకరుగా మారిపోయారని అంటున్నారు పరిశీలకులు. నిన్న చంద్రబాబు చేపట్టిన ఇసుక దీక్షలో అన్నీ తానై వ్యవహరించారు. చంద్రబాబు దాదాపు గంటన్నరకు పైగా ప్రసంగించినప్పుడు ఆయన వెనకాలే ఉన్న ఇద్దరు నాయకుల్లో ఒకరు బొండా ఉమామహేశ్వరరావు.
మొన్నటి వరకూ దూరం….
అక్కడ దీక్ష కోసం దగ్గరుండి మరీ ఏర్పాట్లు పరిశీలించిన ఒకరిద్దరు కాపు నేతల్లో బొండా ఉమామహేశ్వరరావు కూడా ఉన్నారు. దీంతో ఆయన రేంజ్ టీడీపీలో పెరిగిందా? అనే చర్చ తెరమీదికి వచ్చింది. వాస్తవంగా టీడీపీలో నిన్న మొన్నటి వరకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నాయకుల్లో బొండా ఉమామహేశ్వరరావు ఒకరు. తాను గతంలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీని చీల్చి చెండాడినా కూడా గుర్తింపు లేదని, కాపు వర్గం తనపై వత్తిళ్లు తెచ్చినా భరించానని, అయినా కూడా చంద్రబాబు తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని సృష్టించిన బొండా ఉమామహేశ్వరరావు ఒక్కసారిగా బాబుకు అత్యంత సన్నిహితుడుగా మారిపోయారు.
తోట వెళ్లిపోవడంతో….
అసలు మంత్రి పదవి రాలేదని బొండా ఉమామహేశ్వరరావు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కాపుల గొంతు కోశారంటూ బొండా ఏ రేంజులో రచ్చ చేశారో చూశాం. ఇక ఎన్నికలు ముగిసి స్వల్ప తేడాతో ఓడిపోయాక కూడా బొండా ఉమామహేశ్వరరావు పార్టీ మారిపోతున్నాడంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. ఇక బాబు కూడా కాపు నేతల్లో చాలా మందిని పక్కన పెట్టి మరీ.. చంద్రబాబు బొండా ఉమామహేశ్వరరావుకు ప్రాధాన్యం ఇచ్చారనే చర్చ కూడా టీడీపీ వర్గాల్లో సాగుతోంది. అయితే, దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. కాపు వర్గంలో కీలకమైన నాయకులుగా ఉన్న తోట త్రిమూర్తులు ఇప్పటికే పార్టీ మారిపోయారు.
ఎందుకంత ప్రయారటీ అంటే..?
ఇక, చిన్నరాజప్ప తూర్పు గోదావరి జిల్లాకు మాత్రమే పరిమితమైన నాయకుడు. పైగా ఆయన ఇటీవల ముట్టనట్టు ఉన్నారు. ఆయనకు హోం శాఖ మంత్రి గా పదవి ఇచ్చినా.. రాష్ట్ర నాయకుడిగా ఎదగలేక పోయారు. అదే సమయంలో మరో నాయకుడు, రాష్ట్ర స్తాయిలో గుర్తింపు ఉన్న కాపు నేత గంటా శ్రీనివాసరావు రెండు పడవల మీద కాలేసిన చందంగా వ్యవహరిస్తున్నారు. గంటాను బాబు కూడా పూర్తిగా నమ్మరన్నది నిజం. ఈ పరిస్థితిలో ఉన్నవారిలో ఒకింత దూకుడుగా వ్యవహరించే కాపు నేతగా ఉన్న బొండా ఉమామహేశ్వరరావుకు చంద్రబాబు ఎక్కువ ప్రయార్టీ ఇస్తున్నారనే చర్చ సాగుతోంది. రేపటి రోజున పార్టీ పుంజుకుంటే బొండాకు తిరుగులేని ప్రయార్టీ ఉంటుందన్నది నిజం.