వైసీపీ-జనసేన మిలాఖత్.. ఏం జరిగిందంటే?
ఎప్పుడూ.. ఉప్పు-నిప్పుగా ఉండే.. జనసేన-ఏపీ అధికార పార్టీ వైసీపీలు ఒక్కటి కావడం.. ఒకకీలక పదవి విషయంలో గప్‌చుప్‌గా సర్దుబాటు చేసుకోవడం.. రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. [more]
ఎప్పుడూ.. ఉప్పు-నిప్పుగా ఉండే.. జనసేన-ఏపీ అధికార పార్టీ వైసీపీలు ఒక్కటి కావడం.. ఒకకీలక పదవి విషయంలో గప్‌చుప్‌గా సర్దుబాటు చేసుకోవడం.. రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. [more]
ఎప్పుడూ.. ఉప్పు-నిప్పుగా ఉండే.. జనసేన-ఏపీ అధికార పార్టీ వైసీపీలు ఒక్కటి కావడం.. ఒకకీలక పదవి విషయంలో గప్‌చుప్‌గా సర్దుబాటు చేసుకోవడం.. రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఏపీ సర్కారుపై ఎప్పుడూ విమర్శలు గుప్పించడమే పనిగా జనసేన అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. స్థానిక ఎన్నికల సమయంలోనూ.. టీడీపీతో అంతర్గత లాలూచీ చేసుకుని.. జనసేన నాయకులు కొందరు జిల్లాల్లో మంత్రాంగం నడిపారు. ఈ క్రమంలోనే కొందరు గెలిచారు కూడా. ఇప్పుడు గుంటూరులో కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ పదవి కోసం.. జనసేనకు వైసీపీ నేతలు సహకరించారని స్పష్టంగా తెలుస్తోంది.
గతంలో నామినేషన్ …
గుంటూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్‌గా ఇటీవల జనసేనకు చెందిన బోనబోయిన శ్రీనివాసయాదవ్నే మరోసారి ఎన్నుకున్నారు. అయితే.. వాస్తవానికి ఇది వైసీపీకి దక్కాల్సిన పదవి. అయినప్పటికీ.. వైసీపీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ.. ఈ విషయంలో ఎలాంటి అడ్డు చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. విషయంలోకి వెళ్తే.. ఐదేళ్ల క్రితం అర్బన్ బ్యాంకు చైర్మన్ ఎన్నిక జరిగినప్పుడు వైసీపీకి చెందిన కీలక నాయకులు పోటీకి ప్రయత్నించారు. నామినేషన్ కూడా దాఖలు చేసేందుకు రాగా అప్పట్లో వారిని కొంతమంది అడ్డుకొన్నారు. అప్పట్లో వైసీపీ ప్రతిపక్షంలో ఉండడం.. జనసేన అప్పటి అధికార పార్టీ టీడీపీకి అనుకూలంగా ఉండడం తెలిసిందే.
ఇప్పుడు అవకాశం ఉన్నా…?
దీంతో జనసేన గుంటూరు లోక్‌సభ ఇంచార్జ్.. బోనబోయిన శ్రీనివాసయాదవ్ అప్పట్లో గుంటూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కానీ, ఇప్పుడు కూడా ఆయనే రెండోసారి ఎన్నిక కావడం గమనార్హం. వాస్తవానికి ఇప్పుడు అధికారం మొత్తం వైసీపీ చేతుల్లో ఉంది. అధికారులు కూడా వారి మాట జవదాటరు. అయినాసరే అర్బన్ బ్యాంకు చైర్మన్ ఎన్నికకి ఆ పార్టీ నాయకులు కనీసం బరిలోకి కూడా దిగలేదు. దీంతో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో జనసేన-వైసీపీ నేతల మధ్య అసలు ఏం జరిగింది? అనేది చర్చనీయాంశంగా మారింది.
నాదెండ్ల మంత్రాంగంతో…?
అయితే.. ఈవిషయంలో మాజీ స్పీకర్, జనసేన రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్.. నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకున్నారని.. జనసేన అధినేత.. పవన్ సూచనల మేరకు నాదెండ్ల మంత్రాంగం జరిపారని అంటున్నారు. అయితే.. ఇదొక్కటేనా.. ఇంకేమైనా జరిగిందా? అనేది ఆసక్తిగా మారింది మరి చూడాలి.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.