బొత్స గుగ్లీ తో తికమక
ఏపీ రాజధాని అమరావతి పై మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ విసురుతున్న గుగ్లీ లకు టిడిపి లో గందరగోళం ఆగడం లేదు. అమరావతిలో నిర్మాణాలు కొనసాగిస్తున్నట్లు ఒక [more]
ఏపీ రాజధాని అమరావతి పై మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ విసురుతున్న గుగ్లీ లకు టిడిపి లో గందరగోళం ఆగడం లేదు. అమరావతిలో నిర్మాణాలు కొనసాగిస్తున్నట్లు ఒక [more]
ఏపీ రాజధాని అమరావతి పై మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ విసురుతున్న గుగ్లీ లకు టిడిపి లో గందరగోళం ఆగడం లేదు. అమరావతిలో నిర్మాణాలు కొనసాగిస్తున్నట్లు ఒక పక్క జగన్ ఆదేశాలు జారీ చేసినా బొత్స సత్యనారాయణ రోజుకో రకంగా చేస్తున్న ప్రకటనలతో మరింత అయోమయం లో పడిపోతుంది తెలుగుదేశం. తన గందరగోళాన్ని సొంత మీడియా లో ఆందోళన రూపంలో పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తూ ఆ విధంగా తమ ఆక్రోశాన్ని ఆవేదనను వ్యక్తం చేస్తుంది. అమరావతిని నమ్ముకుని గత సర్కార్ లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్యెల్యేలు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఉండటం వారి తీవ్ర ఆందోళనకు అసలు కారణమన్న ప్రచారం ఒక పక్క నడుస్తున్న నేపథ్యంలో వైసిపి తన మైండ్ గేమ్ తో రియల్ ధరలను ఇప్పటికే నేలకు దించేంసింది. చంద్రబాబు సర్కార్ ఉన్న సమయంలో చుక్కలు అంటిన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు కుదేలయిపోయింది. అమ్మేవాడు వున్నా కొనేవాడే లేకుండా పోయాడు.
మండలి వేదికగా బొత్స …
గతంలో శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రాజధాని అమరావతి లోనే ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పారు. తాజాగా మరోసారి మండలిలో ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబు చెప్పి అమరావతి రాజధాని గా ఉంటుందో? ఉండదో? అన్నది దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ ఫైనల్ గా నిర్ణయిస్తుందని మరోసారి వివాదానికి తెరతీశారు. ప్రస్తుతం నిర్మాణంలో వున్న వాటిని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే రైతులకు ప్లాట్ లు అభివృద్ధి పరిచి ఇస్తారని తేల్చి చెప్పారు. రాజధాని పేరు చెప్పి లక్ష కోట్ల రూపాయలకు పైబడి నిధులు వున్నా కేవలం ఐదేళ్లల్లో ఐదువేలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను బాబు మోసం చేశారంటూ బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలే సంధించారు.
వారే డిసైడ్ చేస్తారుట …
అయితే రాజధానిపై ఏర్పాటు చేసిన కమిటీ 13 జిల్లాల్లో పర్యటించి ఎక్కడ ఏది ఉండాలో డిసైడ్ చేస్తుందంటూ అభివృద్ధి వికేంద్రీకరణ తోనే వైసిపి సర్కార్ అడుగులు వేస్తుందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేసేసారు. ఈ విధానం అమలు చేస్తే రాజధాని అమరావతి అంశంలో ఎపి లో ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం లేదు. ఇదే ఫార్ములా అనుసరించాలన్నదే జగన్ సర్కార్ ఆలోచనగా బొత్స సత్యనారాయణ కామెంట్స్ చెప్పకనే చెప్పేస్తున్నాయి. ఇక అమరావతి లో రాజధాని వున్నా అన్ని ఒకేచోట వుండే చంద్రబాబు విధానానికి భిన్నంగానే తమ ప్రభుత్వ ఆలోచన వుండనుందన్నది సత్తిబాబు పేల్చిన బాంబులో బయటపడిన అంశం అని విశ్లేషకులు లెక్కేస్తున్నారు. ఇదే ఇప్పుడు రాజధాని లో ఇన్ సైడ్ ట్రేడింగ్ కి పాల్పడి కోట్ల రూపాయలు కృష్ణా తీరంలో పోసిన బడాబాబుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తుంది.