జగన్ మీద సత్తిబాబుకు నమ్మకం లేదా?
రెండున్నరేళ్లు కాదు… పార్టీ ఎన్నేళ్లు అధికారంలో ఉంటే అన్నేళ్లు తాను మంత్రిగా ఉండాల్సిందే. తన జిల్లాలో తాను చెప్పినట్లు పార్టీ వినాల్సిందే. తనను కాదంటే జిల్లాలోనే పార్టీ [more]
రెండున్నరేళ్లు కాదు… పార్టీ ఎన్నేళ్లు అధికారంలో ఉంటే అన్నేళ్లు తాను మంత్రిగా ఉండాల్సిందే. తన జిల్లాలో తాను చెప్పినట్లు పార్టీ వినాల్సిందే. తనను కాదంటే జిల్లాలోనే పార్టీ [more]
రెండున్నరేళ్లు కాదు… పార్టీ ఎన్నేళ్లు అధికారంలో ఉంటే అన్నేళ్లు తాను మంత్రిగా ఉండాల్సిందే. తన జిల్లాలో తాను చెప్పినట్లు పార్టీ వినాల్సిందే. తనను కాదంటే జిల్లాలోనే పార్టీ పూర్తిగా పతనమయిపోతుంది. ఇది వైసీపీ అధినాయకత్వానికి మంత్రి బొత్స సత్యనారాయణ ఇస్తున్న పరోక్ష హెచ్చరికలు. బొత్స సత్యనారాయణ సీనియర్ నేత. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పీసీసీ చీఫ్ గా పనిచేశారు. పదేళ్ల పాటు మంత్రి పదవిని చేపట్టారు. అలాంటి బొత్స సత్యనారాయణకు జగన్ మీద మాత్రం నమ్మకం లేనట్లుంది.
పట్టు పెంచుకునేందుకు….
జగన్ అందరి లాంటి నేత కాదు. తనను, తన కుటుంబానికి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎప్పుడైనా జగన్ ప్రాధాన్యత తగ్గించే అవకాశముంది. అందుకే బొత్స సత్యనారాయణ జిల్లాలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో తనకు ఎదురులేదని వైసీపీ అధినేత జగన్ కు చెప్పడమే దీనికి కారణమన్న కామెంట్స్ పార్టీలోనే వినపడుతున్నాయి. తాజాగా నెలిమర్ల నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ తన సోదరుడి ద్వారా వేలెట్టడానికి కూడా కారణమదే.
ఎక్కువ స్థానాలు…..
గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఇందుకు బొత్స నాయకత్వంతో పాటు జగన్ చరిష్మా కారణమని చెప్పాలి. తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువ స్థానాలు బొత్స సత్యనారాయణ అనుచరులే ఉన్నారు. జగన్ ను ఎన్నికల ముందే లొంగదీసుకుని తన వారికే ఎక్కువ టిక్కెట్లను ఇప్పించుకోవడంలో బొత్స సత్యనారాయణ సక్సెస్ అయ్యారని చెప్పాలి. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సోదరుడు అప్పలనరసయ్య గజపతినగరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
అధినాయకత్వాన్ని దారికి తెచ్చుకునేందుకేనా?
విజయనగరం పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన చంద్రశేఖర్ సయితం బొత్స సమీప బంధువు. బొబ్బిలి ఎమ్మెల్యేశంబంగి చినఅప్పలనాయడుు, పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు, నెలిమర్ల ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడు కూడా బొత్స సత్యానారాయణ అనుచరులే. అయితే నెలిమర్లలో అప్పలనాయుడుకు వ్యతిరేకంగా బొత్స సత్యనారాయణ పావులు కదుపుతున్నారంటున్నారు. ఇది అధినాయకత్వానికి చికాకు కల్గించే విషయమే. దీనిని బొత్స సత్యనారాయణ మాత్రమే పరిష్కరించగలరు. అలా అధినాయకత్వాన్ని తన దారికి తెచ్చుకోవాలన్నది బొత్స సత్యనారాయణ వ్యూహంగా కన్పిస్తుంది.