ఆ యవ్వారం ఇక కుదరదట
ఆయన సీనియర్ మంత్రి, వైసీపీ పాలనలో ఆయన బాగానే చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్‌కు కొంచెం తక్కువే అయినా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు సంచలనాలు రేపుతున్నాయి. [more]
ఆయన సీనియర్ మంత్రి, వైసీపీ పాలనలో ఆయన బాగానే చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్‌కు కొంచెం తక్కువే అయినా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు సంచలనాలు రేపుతున్నాయి. [more]
ఆయన సీనియర్ మంత్రి, వైసీపీ పాలనలో ఆయన బాగానే చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్‌కు కొంచెం తక్కువే అయినా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు సంచలనాలు రేపుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్.. ఆపార్టీ నేతలపై విమర్శలు చేయడంలోనూ ఆయన దూకుడుగానే ఉన్నారు. ఇక, సీఎం జగన్ దగ్గర కూడా మంచి మార్కులు పొందారు. అయితే.. ఇంతగా మంచిమార్కులు కొట్టేసి.. ప్రభుత్వ వాదనను బలంగా వినిపిస్తున్నా బొత్స సత్యనారాయణకు రావాల్సిన పేరు రావడం లేదు.. ఆయనకు దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదు. ఇక ఆయన కుటుంబం మాత్రం నిర్వదంలో ఉంది. మా పరిస్థితి ఏంటి ? మాఫ్యూచర్ ఏంటి ? అని వారు తల పట్టుకుంటున్నారు.
ఒకనాడు చక్రం తిప్పి…..
జగన్ కేబినెట్లో బొత్స సత్యనారాయణ కీలకంగా ఉన్నారు. విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలోనూ ఆయనకు మంచి పలుకుబడి ఉన్న విషయం తెలిసిందే. గతంలో వైఎస్ హయాంలోనూ మంత్రిగా వ్యవహరించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ ఆయన చక్రం తిప్పారు. ఇక, తర్వాత వైసీపీలో చేరారు. ఇక, కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తనకు, తన కుటుంబానికి కూడా టికెట్లు ఇప్పించుకున్నారు. తన సతీమణి ఝాన్సీకి ఎంపీ టికెట్ ఇప్పించుకుని బొత్స సత్యనారాయణ గెలిపించుకున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి పదవి కోసం కూడా ట్రై చేశారు. అయితే.. అది రాకపోయినా.. ఎంపీగా మాత్రం మంచి గుర్తింపు సాధించారు.
కుటుం సభ్యులు…..
ప్రస్తుతం బొత్స సత్యనారాయణ సోదరుడు.. ఇతరత్రా వ్యక్తులను తీసేసినా బొత్స సత్యనారాయణ సతీమణి, ఆయన కుమారుడు రాజకీయాల్లో మళ్లీ రీ యాక్టివ్ అయ్యేందుకు రెడీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బొత్స ఝాన్సీ.. మళ్లీ ఎంపీగా పోటీ చేసేం దుకు రెడీ అవుతున్నారు. అదే సమయంలో బొత్స సత్యనారాయణ కుమారుడు కూడా తాను పోటీకి రెడీగా ఉన్నానని సంకేతాలు పంపుతున్నారు. ఒకప్పుడు రాష్ట్ర స్థాయిలో బొత్స మంత్రిగా ఉన్నా విజయనగరం జిల్లాలో చీమ చిటుక్కుమన్నా ఆయనకు తెలియాల్సిందే. అలాంటిది ఇప్పుడు వైసీపీ అధిష్టానం బొత్స సత్యనారాయణను అన్ని విధాలా వాడుకుంటున్నా ఆయనకు సీన్ లేకుండా చేసిందట.
విలువ లేకుండా చేస్తున్నారా?
విజయనగరం సిటీలో ఎమ్మెల్యే కోలగట్ల మాటే చెల్లుబాటు అని జగన్ చెప్పేశారట. అటు రాజన్నదొర, పుష్ప శ్రీ వాణి నియోజకవర్గాల్లో బొత్స సత్యనారాయణ మాట చెల్లడం లేదు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో మళ్లీ చక్రం తిప్పి తనకు కావాల్సిన వాళ్లకే జిల్లా అంతటా టిక్కెట్లు ఇప్పించుకోవాలని చూస్తోన్న బొత్స సత్యనారాయణకు ఈ సారి అంత సీన్ ఉండదనే అంటున్నారు. ఇప్పుడే బొత్స మాటకు విలువలేదు.. ఇక ఎన్నికల వేళ ఆయన చెప్పినట్టు చేయడం కల్లే అంటున్నారు. అందులోనూ జగన్ దగ్గర ఇలాంటి యవ్వారాలు కుదరవ్..! ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణ భార్య ఎంపీ సీటు ఆశలు, బొత్స కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఆశలు నెరవేరవేమోనన్న గాబారా అయితే ఆ కుటుంబానికి ఉందన్నదే ఇప్పుడు స్థానికంగా వినిపించే టాక్ ?