ఒకప్పుడు శాసించి.. నేడు యాచిస్తూ…?
బ్రిటన్. . . శక్తివంతమైన దేశం, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని తన కనుసైగలతో శాసించినదేశం, ప్రపంచ రాజకీయలను ప్రభావితం చేసిన దేశం. అయితే అదంతా ఇప్పుడు చరిత్ర. [more]
బ్రిటన్. . . శక్తివంతమైన దేశం, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని తన కనుసైగలతో శాసించినదేశం, ప్రపంచ రాజకీయలను ప్రభావితం చేసిన దేశం. అయితే అదంతా ఇప్పుడు చరిత్ర. [more]
బ్రిటన్. . . శక్తివంతమైన దేశం, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని తన కనుసైగలతో శాసించినదేశం, ప్రపంచ రాజకీయలను ప్రభావితం చేసిన దేశం. అయితే అదంతా ఇప్పుడు చరిత్ర. గతవైభవానికి గుర్తులు. వర్తమానం లో బ్రిటన్ పరిస్ధితి విచారకరంగా ఉంది. ఐరాస భద్రతామండలి లోని అయిదు శాశ్వత సభ్యత్వ దేశల్లో ఒకటైన బ్రిటన్ నేడు ఎంత మాత్రం అగ్రదేశం కాదు. ఓ సాధారణ దేశం. ప్రపంచ రాజకీయాలను కాదు కాది, కనీసం, సొంత ఇంటిని సైతం చక్కదిద్దుకోలేని దయనీయ స్ధితిలో ఉంది. అమెరికా, రష్యా, చైనా వంటి శక్తివంతమైన దేశాలు అంతర్జాతీయ వేదిక పైకి రావడంతో సహజంగానే బ్రిటన్ ప్రాభవం క్షీణించింది. ఫలితంగా అంతర్జాతీయ యవనికపై అది నామమాత్రంగా మిగిలిపోయింది.
గాడిన పడే అవకాశం లేదని….
తాజాగా ‘ కరోనా ‘ మహమ్మారి బ్రిటన్ ను కుదిపేసింది. ఈ నెల 3 నాటికి 1,80,599 కేసులు నమెాదుయ్యాయి. 28,446 మంది కన్నుముాశారు. ఏకంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా నుంచి తృటిలో బయటపడ్డారు. కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్ధ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆర్ధిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికాపుడు లేదా సమీపభవిషత్తులో పరిస్ధితి గాడినపడే అవకాశం లేదన్న అభిప్రాయం నిపుణుల నుంచి వ్యక్తమవుతుంది. ఏకంగా దేశప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా కారణంగా మరణం అంచుకు వెళ్ళడంతో దేశప్రజలను ఆందోళన పరిచింది. అదృష్టవశాత్తూ ఆయన కోలుకోవడంతో యావద్దేశం ఊపిరి పీల్చుకుంది. ఒకదశలో మరణం అనివార్యమన్న భావన తనకు కలిగిందని, వైద్యుల కృషివల్ల బతికి బట్టకట్టానని, వారి సేవలకు కృతజతగా, రెండో భార్యకు జన్మించిన కుమారుడికి వైద్యుల పేరు పెట్టనట్లు బోరిస్ జాన్సన్ చెప్పడం పరిస్ధితి తీవ్రతకు దర్పణం పడుతోంది.
నాలుగో వంతు మంది….
కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్ధ రోజురోజుకు కుదేలవుతోంది. దేశంలో పేదరికం నానాటికి విస్తరిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు వందేళ్ళ క్రితంనాటి ఆర్ధిక మాంద్యం పరిస్ధితులు ఇప్పుడు నెలకొన్నాయని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. మెుత్తం దేశ జనాభా, ఆరుకోట్లకు పైమాటే. వీరిలో సుమారు నాలుగో వంతు మంది పేదరికంలోకి జారిపోయారని అధికారిక గణాంకాలే ఘోషిస్తున్నాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకునే ప్రక్రియలో భాగంగా విధించిన లాక్ డౌన్ తో ప్రజలు పెద్దమెుత్తంలో ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఆతిధ్యం, సేవా, రిటైల్ రవాణా రంగాల్లో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కనుమరుగవుతుండటంతో పేదరికం ముప్ప ప్రమాదం పొంచి ఉంది. సామాజిక, స్వచ్ఛంద సంస్ధ అయిన జోసెఫ్ రౌన్ ట్రీ ఫౌడేషన్ ఆర్ధికం విభాగం అధినేత ద వే ఇన్స్ ఈ విషయాన్ని వెల్లడించారు.
నెల రోజులుగా….
గతనెల రోజులుగా దాదాపు కోటిమంది ప్రజలు ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కరోనా యే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి దరఖాస్తులు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకింత గౌరవప్రమైన ఆదాయం పొందుతున్నవారు సైతం ప్రభుత్వ సాయం కోసం ఎదురు చుాస్తున్నారు. మున్ముందు పరిస్ధితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనే ఇందుకు కారణమని చైల్డ్ పావర్టీ యాక్షన్ డైరెక్టర్ ‘లుాయిస్ మెక్ నీహాన్’ విశ్లేషించారు. లాక్ డౌన్ కారణంగా పలు విద్యాసంస్ధలు ఆన్ లైన్ బోధనను ప్రారంభించాయి. అయితే విద్యార్ధుల ఇళ్ళలో సరైన ఇంటర్నట్ సౌకర్యం లేక, కొత్త కంప్యూటర్లను కొనుగోలు చేసే శక్తిలేక విధ్యాబోధన సక్రమంగా జరగడం లేదు. ప్రభుత్వం కుాడా ఇలాంటి వారికి చేయుాతనిచ్చే పరిస్ధితిలేదు. మారిన పరిస్ధితుల్లోప్రజలు ఆకలిబాధలు తీర్చడంమే ప్రభుత్వప్రాధాన్యంగా మారింది.
వ్యాపార అవకాశాలు లేక….
తల్లిదండ్రులకు పోషించేశక్తిలేక పిల్లలు పేదరికంలోకి జారిపోతున్నారు. మెుత్తం పిల్లల్లో 4.2 మిలియన్తు లేదా 30 శాతం మంది భావిపౌరులు పేదరికం అంచుల్లో ఉన్నారని ప్రభుత్వ గణాంకాలే పేర్కొంటున్నాయి. ఈ పరిస్ధితి మున్ముందు ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన రాజకీయ, అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.ఐరోపాలోని శక్తివంతమైన దేశాల్లో బ్రిటన్ ఒకటి. ముఖ్యంగా ఐరోపాసంఘం ( యుారోపియన్ యుానియన్)దేశాలు చాలావరకు గతంలో బ్రిటన్ నుంచి ప్రయెాజనం పొందేవి. ఐరోపా సంఘం నుంచి గత ఏడాది డిసెండరులో బ్రిటన్ వైదొలగడం తో బ్రిటన్ ఒంటరిది అయింది. ఫలితంగా వ్యాపార, వాణిజ్య అవకాశాలు గతంలో మాదిరిగా లేవు. ప్రజల ఆకలిబాధలు తీర్చేందుకు దేశవ్యాప్తంగా సుమారు 1200 ఆహారబ్యాంకులు పనిచేస్తున్నాయి. వీటిని మున్ముందు పెంచాల్సిన అవసరం కనపడుతోంది. జాతియంగా, అంతర్జాతీయంగా మారుతున్న పరిస్ధితులు, కరోనా బ్రిటన్ పై తీవ్రప్రభావాన్ని చుాపుతున్నాయి. ఒకప్పటి ప్రపంచశక్త నేడు గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్న మాట చేదునిజం. ఓడలు బండ్లు కావడం, బండ్లు ఓడలు కావడం అంటే ఇదేనేమో.
-ఎడిటోరియల్ డెస్క్