మూడోసారి జరుగుతున్నా?
బ్రిటన్.. దీనిని ఆంగ్లంలో యూకే అని, యునైటెడ్ కింగ్ డమ్ అని వ్యవహరిస్తారు. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని తన కనుసైగలతో శాసించిన, భద్రతమండలిలోని ఐదు శాశ్వత [more]
బ్రిటన్.. దీనిని ఆంగ్లంలో యూకే అని, యునైటెడ్ కింగ్ డమ్ అని వ్యవహరిస్తారు. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని తన కనుసైగలతో శాసించిన, భద్రతమండలిలోని ఐదు శాశ్వత [more]
బ్రిటన్.. దీనిని ఆంగ్లంలో యూకే అని, యునైటెడ్ కింగ్ డమ్ అని వ్యవహరిస్తారు. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని తన కనుసైగలతో శాసించిన, భద్రతమండలిలోని ఐదు శాశ్వత సభ్యత్వ దేశాల్లో ఒకటైన బ్రిటన్ ప్రాభవం నేడు చరిత్రగానే మిగిలిపోయింది. నేడు అంతర్జాతీయ వ్యవహారాల్లో దాని ప్రభావం శూన్యం. కేవలం అమెరికా తోక దేశంగా, దానికి వంతపాడే, భళా అనే దేేశంగా మిగిలిపోయింది. కనీసం ఐరోపా వ్యవహారాల్లోనూ ప్రభావం చూపలేక చతికల పడి పోయింది. కానీ, “ఇంగువ కట్టిన వస్త్రం వాసన పోదు” అన్న సామెత మాదిరిగా బ్రిటన్ ఎన్నికలు ఆ దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఆసక్తికిని కలిగిస్తాయి.
మూడోసారి జరుగుతున్న…..
బ్రెగ్జిట్ కారణంగా నాలుగేళ్లలో మూడోసారి జరుగుతున్న ఈ ఎన్నికలు ఆసక్తిని కలగచేస్తున్నాయి. 2015, 2017లో రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 12న జరిగేవి మూడోసారి కావడం గమనార్హం. ఇతర చిన్న పార్టీలు బరిలో ఉన్నప్పటికీ, అధికార కన్సర్వేటివ్, విపక్ష లేబర్ పార్టీ ల మధ్య ప్రధాన పోటీ జరగనుంది. ప్రధాని బోరిస్ జాన్సన్ కన్సర్వేటివ్ పార్టీ తరుపున విపక్ష లేబర్ పార్టీ తరుపున జెర్మీ కోర్బిన్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బ్రిటన్ లో రెండు పార్టీల వ్యవస్థ బాగా పాతుకుపోయింది. లేబర్ పార్టీకి ఉదార పార్టీగా, భారత్ అనుకూల పార్టీగా పేరుంది. మొత్తం 650 స్థానాలు గల దిగువ సభలో అధికార సాధనకు కనీసం 326 స్థానాలు అవసరం. బ్రిటన్ రాజకీయాల్లో ఇంగ్లండ్ పాత్ర చాలా కీలకం. మొత్తం నాలుగు రాష్ట్రాలున్నప్పటికీ ఒక్క ఇంగ్లండ్ లోనే అత్యధికంగా 533 స్థానాలు ఉండటం విశేషం. దీంతో అన్ని పార్టీల దృష్ఠి దీనిమీద ఉంటుంది. స్కాట్లాండ్ లో 9, వేల్స్ లో 40, ఉత్తర ఐర్లాండ్ లో 18 స్థానాలు ఉన్నాయి.
గుర్తింపు కార్డులు లేవు…..
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా పేరుగాంచిన బ్రిటన్ లో ఓటు హక్కు వినియోగానికి ఎలాంటి గుర్తింపు కార్డులు అక్కరలేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ లేదు. నచ్చిన అభ్యర్థి పేరుకు ఎదురుగా పెన్సిల్ తో టిక్ చేస్తే చాలు. భారత్ లో మాదిరిగా ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ కు అక్కడ ప్రధాని నిర్ణయిస్తారు. తాజా ఎన్నికల తేదీని ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయించారు. బ్రిటన్ చరిత్రలో అత్యధికంగా 1950లో 83.9 శాతం పోలింగ్ నమోదయింది. 2001లో అతి తక్కువగా 59.4 శఆతం నమోదయింది. చివరగా 2017లో జరిగిన ఎన్నికల్లో 68.7 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ దఫా ఎన్నికల పట్ల ఓటర్లు అంతగా ఆసక్తి చూపడం లేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. వలసలను నియంత్రించేందుకు ఆస్ట్రేలియా తరహా వలస విధానాన్ని తీసుకువస్తామని కన్సర్వేటివ్ పార్టీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. వృద్ధుల సంక్షేమానికి పాటుపడతామని లేబర్ పార్టీ నాయకుడు జెర్మి కోర్బిస్ వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సమతుల్యత సాధనకు 50 బిలియన్ పౌండ్లను లండన్ ఏతర ప్రాంతాల్లో పెట్టుబడి పెడతామని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు జోస్విసన్ పేర్కొన్నారు. స్కాట్లాండ్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని స్కాటిస నేషనల్ పార్టీ అధినేత నికొలస్పర్జన్ చెబుతున్నారు. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజల మొగ్గు కన్సర్వేటివ్ పార్టీ వైపే ఉందని వివిధ సర్వేలు చెబుతున్నాయి. లేబర్ పార్టీ ప్రజాదరణలో కొంత వెనుకబడి ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ దఫా ఎన్నికల పట్ల ఓటర్లు అంతగా ఆసక్తి లేదన్న అభిప్రాయం ఉంది. 2015లో తొలిసారి, 2017 మేలో రెండోసారి ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నవి మూడోదఫా ఎన్నికలు.
భారత సంతతికి చెందిన…..
2017లో జరిగిన ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ 318, లేబర్ పార్టీ 262 స్థానాలు సాధించాయి. ఇతరుల మద్దతుతో కన్సర్వేటివ్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. ఆర్థిక వ్యవస్థ, రక్షణ, వలసలకు సంబంధించిన అంశాలు ప్రచారంలో కీలకంగా మారాయి. బ్రిటన్ ప్రధాని అధికార నివాసం “10 డౌనింగ్ స్ట్రీట్” లో ప్రవేశించాలంటే ప్రజా మద్దతు తప్పనిసరి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ, ఏ నాయకుడు పదవి చేపట్టినా అది ముళ్ల కిరీటం వంటిదేనన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ముందుగా బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయడం కత్తమీద సాములాంటిదే. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడమూ ఒక సవాలే. బ్రిటన్ చట్టసభలో భారత సంతతి వారి ప్రాధాన్యం ఎక్కువ. 2017 ఎన్నికల్లో 12 మంది భారత సంతతికి చెందిన వారు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఈ దఫా వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇక బ్రిటన్ లో బ్రిటనేతర ఎంపీల సంఖ్య కూడా పెరగనుంది. దశాబ్దం క్రితం ప్రతి 40 మంది ఎంపీల్లో ఒక బ్రిటనేతర సంతతి వ్యక్తి ఎంపీగా ఉండేవారు. ఇప్పుడు ప్రతి పదిమందిలో ఒకరు ఉండే అవకాశం ఉంది. మొత్తానికి బ్రిటన్ ఎన్నికలు భారత్ తో సహా అంతర్జాతీయంగా అమితాసక్తిని కలిగిస్తున్నాయి.
-ఎడిటోరియల్ డెస్క్