డిట్టో మునుగోడు స్టైల్..
ఉప ఎన్నికకు పోవాలి అనుకున్న రాజ్‌గోపాల్ రెడ్డి.. అంతకుముందు నుంచే తమ అనుచరగణంతో సంప్రదింపులు
కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మునుగోడులో ఉప ఎన్నికకు తెరలేపిన తర్వాత.. తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు దశాబ్దాల కాలంగా విస్మరించబడ్డ ఓ చిన్న నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా సంచలనాల కేంద్రబిందువైంది. మునుగోడు పేరు లేకుండా వార్తలు సాగలేదు. బిజేపి, బీఆర్ఎస్ల నడుమ జరిగిన పోటీలో ఎన్నో తంత్రాలూ, కుతంత్రాలూ వెలుగుచూశాయి. చిన్న నియోజకవర్గంలో స్ట్రేటజీలు ఏం పనిచేస్తాయి.. చివరికి ఓటుకు నోటే దిక్కు అని అన్ని పార్టీలూ భావించాయి. బిజేపి, బీఆర్ఎస్ల నడుమ ఇరుక్కున్న కాంగ్రెస్.. ఎంతో ఒత్తిడిని ఎదురుకుంది. ప్రతిరోజూ ట్రెండింగ్‌లో ఉండేందుకు శతవిధాలా పోరాడింది. ఉప ఎన్నిక ప్రకటించిన తొలినాళ్ళలో ముముగోడులో మూడుపార్టీల నడుమ త్రికోణ పోటీ నెలకొన్నట్టు కనిపించింది. అ తర్వాత కాంగ్రెస్ పార్టీ క్రమేణా బలహీనపడింది. అప్పటివరకూ ఓపికగా ఎదురుచూసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర సీఎం అలాగే మునుగోడు ఎన్నికల వ్యూహకర్త కేసీఆర్ రంగంలోకి దిగారు. Vis