అందుకోసమేనా….?
మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన కూతురు ఓటమికి కారణమయిన వారిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు రెడీ అయిపోతున్నట్లుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి [more]
మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన కూతురు ఓటమికి కారణమయిన వారిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు రెడీ అయిపోతున్నట్లుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి [more]
మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన కూతురు ఓటమికి కారణమయిన వారిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు రెడీ అయిపోతున్నట్లుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జలీల్ ఖాన్ కుమార్తె తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. తాను పోటీ చేయకుండా కుమార్తెకు అవకాశమిచ్చిన జలీల్ ఖాన్ ఎన్నికల ప్రక్రియను మొత్తం అంతా తానే అయి చూసుకున్నారు. కానీ ఎన్నికల్లో జలీల్ ఖాన్ కుమార్తె ఓటమి పాలయ్యారు.
సొంత పార్టీ నేతలే…..
జలీల్ ఖాన్ కుమార్తె ఓటమికి ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీ నేతలే కారణమని ఆయన బహిరంగంగానే చెబుతున్నారు. తనను ఓడించాలని తెలుగుదేశం పార్టీలోని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేశారంటున్నారు జలీల్ ఖాన్. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి తెలుగుదేశం లోకి రావడానికి కొందరికి ఇష్టం లేకపోవడం, ఎన్నికల్లో టిక్కెట్ కూడా తన కుటుంబానికే ఇవ్వడం కొందరికి గిట్టలేదని ఆయన ఆరోపిస్తున్నారు.
వెంకన్నపైనే గురి….
ముఖ్యంగా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడైన బుద్దా వెంకన్న పై ఆయన గురి పెట్టినట్లు తెలిసింది. బుద్దా వెంకన్న ఎన్నికల్లో తనకు మద్దతుగా ఇవ్వలేదన్నది ఆయన ఆరోపణ. అలాగే తెలుగుదేశం పార్టీ మరో నేత నాగుల్ మీరా సయితం ఎన్నికల్లో తన కుమార్తె గెలుపునకు సహకరించలేదని ఆయన ఇప్పటికే పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరాపై ఎటువంటి చర్యలు అధిష్టానం తీసుకోలేదు.
నానితో కలిసి….
ఈ నేపథ్యంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని, బుద్దా వెంకన్నల మధ్య ట్వీట్ల వార్ జరిగిన సంగతి తెలిసిందే. బుద్దా వెంకన్నపై కేశినేని నాని మండిపడుతున్నారు. చంద్రబాబునాయుడుకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితుల్లో జలీల్ ఖాన్ బుద్ధా వెంకన్నపై రగిలిపోతున్న కేశినేని నానిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన కుమార్తె ఓటమికి కారకులైన బుద్దా వెంకన్న. నాగులు మీరాలకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేయాలన్నది జలీల్ ఖాన్ ఆలోచన. అందుకే ఆయన కేశినేని నానితో చేతులు కలిపారు. మరి ఇది సాధ్యమవుతుందా?