క్లారిటీ ఉన్న లీడర్…కామ్ గా ఉన్నారేంటి?
ఆయన వైసీపీలోనే కీలక మంత్రి. జగన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. ఆయన మాట్లాడితే.. ఒక్కటంటే ఒక్కటి ఎక్స్ ట్రా పదం అనేది కనిపించదు. ఆయన ఎవరిని విమర్శించినా..కూడా [more]
ఆయన వైసీపీలోనే కీలక మంత్రి. జగన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. ఆయన మాట్లాడితే.. ఒక్కటంటే ఒక్కటి ఎక్స్ ట్రా పదం అనేది కనిపించదు. ఆయన ఎవరిని విమర్శించినా..కూడా [more]
ఆయన వైసీపీలోనే కీలక మంత్రి. జగన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. ఆయన మాట్లాడితే.. ఒక్కటంటే ఒక్కటి ఎక్స్ ట్రా పదం అనేది కనిపించదు. ఆయన ఎవరిని విమర్శించినా..కూడా ఎక్కడా నొప్పి కూడా అనిపించదు. అలా అంత నిర్మాణాత్మకంగా మాట్లాడి, ప్రభుత్వం పక్షాన నిలిచే నాయకుడు సరైన సమయంలో ఎందుకో కనిపించడం లేదు. దీంతో ఆయన ఎందుకు కనిపించడం లేదు. ఆయన వాణి ఎందుకు వినిపిం చడం లేదు? అనే ఆసక్తికర ప్రశ్న తెరమీదికి వచ్చింది. ఇంతకీ ఆయన ఎవరు? అంటే.. కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.
రెండుసార్లు వరస గెలుపులతో…..
రెండు సార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన నాయకుడుగా ఆయన పేరు తెచ్చుకున్నారు. జగన్‌కు అత్యంత సానుకూల వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అలాంటి నాయకుడు కాబట్టే.. జగన్ ఆయనకు గతంలోనూ ఇప్పుడు కూడా కీలక పదవులు ఇచ్చారు. గతంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు. ఇక ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ఆర్ధిక మంత్రిగా అవకాశం కల్పించారు. నిజానికి జగన్ ప్రభుత్వంలో ఉన్న 24 మంది మంత్రుల్లో ఎవరైనా మాట్లాడినా.. ఒకటో రెండో పదాలు తప్పులు దొర్లడమో.. పొరపాటు దొర్లడమో.. జరుగుతుంది.
కరోనా సమయంలో….
కానీ బుగ్గన మాత్రం చాలా నిర్మాణాత్మకంగా మాట్లాడతారనే పేరు తెచ్చుకున్నారు. అటు అసెంబ్లీలోను, ఇటు బయట కూడా ఆయన మాట్లాడే తీరు చాలా క్లారిటీగా ఉంటుంది. లెక్కలు, గణాంకాలతో ఆయన విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును ఇరుకున పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే, ఇప్పుడు కరోనా సమయంలో ఆయన మీడియా ముందుకు అస్సలు రావడంలేదు. కరోనా ప్రారంభంలో ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికలను వాయిదా వేసినప్పుడు మాత్రమే ప్రెస్‌మీట్ పెట్టి విమర్శించిన ఆయన ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు.
మాట్లాడకపోయినా…..
మిగిలిన మంత్రులు వచ్చినట్టుగా కూడా ఆయన కనిపించడం లేదు. ప్రస్తుతం బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కంటే కన్నబాబు, ఆళ్ల నాని, కొడాలి నాని లాంటి మంత్రుల హడావిడే ఉంది. అందుకే బుగ్గన చర్చకు వస్తున్నారు. ప్రెస్మీట్లకు, మీడియాకు బుగ్గన దూరంగా ఉన్నా తన నిర్ణయాలు, కార్యక్రమాలు మాత్రం ఆయన చేసుకుని పోతున్నారు. పేదలకురూ.1000 ఇవ్వడంలోనూ.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపకల్పనలోనూ బుగ్గన చాతుర్యం ప్రదర్శించారు. తన పంథాలో తాను పనిచేసుకుని పోయారు. అందుకే ఆ మంత్రి మాట్లాడకపోయినా.. పనులు మాత్రం జరిగిపోతున్నాయి.