వారి పెత్తనంలో నలిగిపోతోన్న వైసీపీ ఎమ్మెల్యే
వైసీపీ అనగానే వెంటనే ఇది రెడ్డి వర్గానికి సంబంధించిన పార్టీ అనే ముద్ర పడిపోయంది. పార్టీ అధినేత జగన్ రెడ్డి వర్గానికి చెందిన నాయకుడు కావడం, పార్టీలో [more]
వైసీపీ అనగానే వెంటనే ఇది రెడ్డి వర్గానికి సంబంధించిన పార్టీ అనే ముద్ర పడిపోయంది. పార్టీ అధినేత జగన్ రెడ్డి వర్గానికి చెందిన నాయకుడు కావడం, పార్టీలో [more]
వైసీపీ అనగానే వెంటనే ఇది రెడ్డి వర్గానికి సంబంధించిన పార్టీ అనే ముద్ర పడిపోయంది. పార్టీ అధినేత జగన్ రెడ్డి వర్గానికి చెందిన నాయకుడు కావడం, పార్టీలో రెడ్డి వర్గం ఆధిపత్యం ప్రదర్శించడం వంటి కారణాల వల్ల ఇది ఇలా ముద్రవేసుకుందని అంటారు పరిశీలకులు. ఆ మాటకు వస్తే టీడీపీకి కమ్మ వర్గం ముద్ర ఎలాగూ ఉండనే ఉంది. ఇక వైసీపీ రెడ్డి వర్గానిదే డామినేషన్ అన్న ప్రచారం ఎలా ఉన్నా ? జగన్ అలా చూస్తున్నా.. చూడకపోయినా.. దిగువస్థాయిలో రెడ్డి వర్గం మాత్రం పార్టీ మాదే పెత్తనం కూడా మాదే అనే రేంజ్లో రాజకీయాలు చేస్తుండడంతో మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన నాయకులు కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. మిగిలిన జిల్లాల్లో మాట ఎలా ఉన్నప్పటికీ.. కీలకమైన ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాత్రం పరిస్థితి మాత్రం రెడ్డి వర్గం డామినేషన్ ఎక్కువగా ఉంది.
నెల్లూరు లోనూ అంతే…?
ఇటీవల కాలంలో నెల్లూరులో ఇదే తరహా పరిస్థితి కనిపించింది. ఈ జిల్లాలో నెల్లూరు సిటీ నుంచి విజయం సాధించి,పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న అనిల్‌కుమార్ యాదవ్ విషయంలో రెడ్డి వర్గం అంతా ఒక్కటైన పరిస్థితి కనిపించింది. ఆయన బీసీ నాయకుడు కావడంతో తమదే హవా సాగాలని ఈ జిల్లాకు చెందిన రెడ్డి వర్గం పట్టుబడుతోంది. అయితే, జగన్ స్థాయిలో ఇది సాగడం లేదు. దీంతో వారు ప్రస్తుతానికి మౌనంగా ఉన్నప్పటికీ.. రెడ్డి వర్గం మాత్రం ఆధిపత్య రాజకీయాలకు ఎప్పటికప్పుడు తెరదీస్తూనే ఉంది. అదేవిధంగా అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి శంకరనారాయణ విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక, ఇప్పుడు ఈ పరిస్థితి ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో పీక్ స్థాయికి చేరుకుందని అంటున్నారు పరిశీలకులు.
కనిగిరి నియోజకవర్గంలో….
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నుంచి 2019లో బీసీ వర్గానికి చెందిన బుర్రా మధుసూదన యాదవ్ విజయం సాధించారు. పార్టీలో ఆయన చాలా యాక్టివ్‌గా ఉండడం, పార్టీని ముందుకు నడిపించడంలోనూ ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నిజానికి బుర్రా కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి . అయినప్పటికీ జిల్లాలో యాదవ వర్గం ఎక్కువగా ఉండడంతో వైసీపీ అధినేత జగన్ బుర్రాకు మంచి ప్రాధాన్యం ఇచ్చి సీటు ఇచ్చారు. అయితే, 2014లో కదిరి బాబూరావుపై స్వల్ప తేడాతో ఓటమి చెందిన బుర్రా.. అనంతరం పార్టీ కోసం ఎంతో శ్రమించారు. పార్టీని నిలబెట్టేందుకు అందరినీ కొలుపుకొని పోయే ప్రయత్నం చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నా….
పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు ఎంతో కష్టపడ్డారు. ఈ నేపథ్యంలోనే 2019లో కనిగిరిలో రెడ్లు..ఆ సీటు కోసం ఎంతో పట్టుబట్టారు. ఎక్కడి నుంచో వచ్చిన బుర్రాకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ సీటు మాది ఇక్కడ వేరే వర్గాలకు సీటు ఇవ్వడం కుదరదని కూడా జగన్ దగ్గర పట్టుబట్టినా జగన్ మాత్రం పార్టీ కోసం కష్టించిన బుర్రాకు సీటిచ్చారు. దీంతో ఆయన అక్కడ నుంచి దాదాపు 40 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడు. చాలా సౌమ్యంగా ఉంటారు. అయితే, నియోజకవర్గంలో రెడ్డి వర్గం ఎక్కువ కావడంతో వారి ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తోంది.
పదవుల విషయంలోనూ…
నియోజకవర్గంలో మండల పార్టీ పదవుల్లో కూడా మెజార్టీ వర్గం రెడ్లకే ఉన్నాయి. సీఎం జగన్ తమ వాడు కావడంతో వీరి దూకుడు ఎక్కువగా ఉంది. ఆయన అందరినీ కలుపుకొని పోవాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో జోరు పెంచాలని బుర్రా భావిస్తున్నారు. అయినా కూడా రెడ్డి వర్గం మాత్రం.. బుర్రాతో ఎంతెంత దూరం.. అంటే తమదే ఆధిపత్యం కావాలని… తమ మాటే చెల్లుబాటు కావాలనన్నట్టుగా వ్యవహరిస్తోంది. బుర్రాది తప్పు లేకపోయినా.. కేవలం సామాజిక వర్గం నెపంతో రెడ్డి వర్గం ఆయనకు సహకరించకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తుండడం గమనార్హం.