ప్రభుత్వం రావాలట.. ఆయన మాత్రం వద్దట
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. అయితే బీహార్ లో జరిపిన సర్వేల్లో బీజేపీ పట్ల కొంత ఓటర్లు సుముఖంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పనితీరు [more]
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. అయితే బీహార్ లో జరిపిన సర్వేల్లో బీజేపీ పట్ల కొంత ఓటర్లు సుముఖంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పనితీరు [more]
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. అయితే బీహార్ లో జరిపిన సర్వేల్లో బీజేపీ పట్ల కొంత ఓటర్లు సుముఖంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పనితీరు పట్ల మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే ఎన్డీఏ కూటమికే తిరిగి ఓటర్లు పట్టం కట్టనున్నారని సర్వేలో తేలింది. ఈ మేరకు సీ ఓటరు సర్వే నిర్వహించింది. బీహార్ లోని అన్ని నియోజకవర్గాల్లో 2,100 మందిని సీ ఓటరు సర్వే చేసింది.
సీ ఓటరు సర్వేలో…..
బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇప్పటికే బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే 243 నియోజకవర్గాల్లో సీ ఓటరు 2,100 మందిని సర్వే చేయగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ సర్వే ప్రకారం జరగబోయే ఎన్నికల్లో 141 నుంచి 161 సీట్లు ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. ఎన్డీఏకు 44.8 శాతం ఓట్లు, యూపీఏకు 33. 4 శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. విపక్ష కూటమికి కేవలం 64 నుంచి 84 సీట్లు, మిగిలిన పార్టీలు 13 స్థానాలను గెలుచుకోవవచ్చని సర్వే తేల్చింది.
ముఖ్యమంత్రిపై అసంతృప్తి…..
అయితే ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయమేంటంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ప్రజలు వ్యతిరేకిస్తున్నరాు. ఆయన పట్ల ఆగ్రహంగా ఉన్నారు. నిరుద్యోగం, అభివృద్ధి విషయంలో నితీష్ కుమార్ పట్ల ప్రజలు సంతృప్తికరంగా లేరని ఈ సర్వేలో తేలింది. నితీష్ కుమార్ మరోసారి అధికారం చేపట్టకూడదని 56.7 శాతం మంది ప్రజలు కోరుకుంటుండటం విశేషం. అయితే ప్రభుత్వం మారకూడదని 29.8 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. విపక్షం వీక్ గా ఉండటంతో నితీష్ కుమార్ మరలా ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నారని సర్వే వెల్లడించింది.
- Tags
- సరà±à°µà±