Telangana : రేవంత్ కు ఆ రెండు కులాల మద్దతు?
ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు 1980 దశకం తర్వాత ప్రారంభమయ్యాయే. అక్కడ రాజకీయాలను కులాలే శాసిస్తాయి. కానీ తెలంగాణలో మొన్నటి వరకూ కుల రాజకీయాలకు తావు లేదు. [more]
ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు 1980 దశకం తర్వాత ప్రారంభమయ్యాయే. అక్కడ రాజకీయాలను కులాలే శాసిస్తాయి. కానీ తెలంగాణలో మొన్నటి వరకూ కుల రాజకీయాలకు తావు లేదు. [more]
ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు 1980 దశకం తర్వాత ప్రారంభమయ్యాయే. అక్కడ రాజకీయాలను కులాలే శాసిస్తాయి. కానీ తెలంగాణలో మొన్నటి వరకూ కుల రాజకీయాలకు తావు లేదు. ఏ కులాన్నైనా పాలకులుగా ఆదరించారు తెలంగాణ ప్రజలు. సెంటెమెంట్ కే వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. క్యాస్ట్ ను పట్టించుకోరు. కానీ అది గతం. ఇప్పుడిప్పుడే తెలంగాణలోనూ కులాల ప్రస్తావన వస్తుంది. ఇది ఎవరో సృష్టించింది కాదు. రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం చేస్తున్న కార్యక్రమాల వల్లనే కులాల కుంపట్లు ఇక్కడ కూడా మొదలయ్యాయి.
పదిశాతమే ఉన్నా….
తెలంగాణలో రెడ్ల శాతం కేవలం పది శాతమే. అయినా మొన్నటి వరకూ రెడ్లకే రాజ్యాధికారాన్ని అప్పగించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వెలమ సామాజికవర్గం ఆధిపత్యం పెరిగింది. సహజంగానే నిన్న మొన్నటి వరకూ అధికారాన్ని చెలాయించిన రెడ్లలో కొంత అసంతృప్తి బయలుదేరుతుంది. ఈసారి రెడ్డి సామాజికవర్గం ఎటువైపు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. వైఎస్ షర్మిల పార్టీ పెట్టినా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్ ను ఆ సామాజిక వర్గం తమ సొంత పార్టీగా భావించడమే ఇందుకు కారణం.
కమ్మ సామాజికవర్గం కూడా…
ఇక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కమ్మ సామాజికవర్గం కాంగ్రెస్ వైపు కంటే టీఆర్ఎస్ వైపే ఉంది. కమ్మ, వెలమ కాంబినేషన్ సక్సెస్ అయిందని పలు ఎన్నికలు నిరూపించాయి. ప్రధానంగా కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గం ప్రభావం అసాధారణ స్థాయిలో ఉంటుంది. అందుకే కేసీఆర్ తొలి నుంచి ఆ సామాజికవర్గానికి కూడా కొంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇటీవల కొంత తగ్గించారు.
తమ నేతగానే భావించి….
ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఎంపిక కావడంతో ఆ సామాజికవర్గం కాంగ్రెస్ వైపు చూస్తుందంటున్నారు. రేవంత్ రెడ్డిని తమ సొంత పార్టీ నేతగానే ఆ సామాజికవర్గం భావిస్తుంది. రేవంత్ ను టీడీపీ నేతగానే చూస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ ప్రయోజనాలు దెబ్బతినవని ఆ వర్గం ఇటీవల కాలంలో అభిప్రాయపడుతుంది. దీంతో రెండు వర్గాలు కాంగ్రెస్ కు చేరువయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. వెల్ కమ్ రాజకీయాలకు తెలంగాణలో తెరపడినట్లే కన్పిస్తుంది. 45 శాతానికి పైగా ఉన్న బీసీలు ఎటువైపు చూస్తే వారిదే విజయం.