ఏ వర్గం వారిని ఆ వర్గం దువ్విందా? మరి ఫలితం?
రాష్ట్రంలోని అన్ని పార్టీల్లోనూ ఒకే తరహా సీన్ కనిపించింది. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు.. అనుసరిస్తున్న వ్యూహం.. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సమయంలో ఆసక్తిగా కనపడింది. [more]
రాష్ట్రంలోని అన్ని పార్టీల్లోనూ ఒకే తరహా సీన్ కనిపించింది. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు.. అనుసరిస్తున్న వ్యూహం.. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సమయంలో ఆసక్తిగా కనపడింది. [more]
రాష్ట్రంలోని అన్ని పార్టీల్లోనూ ఒకే తరహా సీన్ కనిపించింది. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు.. అనుసరిస్తున్న వ్యూహం.. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సమయంలో ఆసక్తిగా కనపడింది. ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ, మధ్యలో అభ్యర్థిని ఖరారు చేసిన వైసీపీ, నామినేషన్లకు మూడు రోజుల ముందు అభ్యర్థిని ఖరారు చేసిన బీజేపీలోనూ ఇదే తరహా వ్యూహం కనిపిస్తుండడం గమనార్హం. పైకి బింకాలు పోయి.. భారీ మెజారిటీ వస్తుందని ఆశలు పెట్టుకున్న వైసీపీలో ఇప్పుడు అంతర్మథనం సాగుతోంది. ఇక, స్థానికంలో చిత్తుగా ఓడిపోయిన టీడీపీ, బీజేపీలకూ ఇప్పుడు తిరుపతి ఒక్కటే చుక్కానిగా మారింది. ఫలితం రావాల్సి ఉంది.
సామాజికవర్గాల వారీగా…?
ఈ క్రమంలో ఇక్కడ ఎలాగైనా సత్తా చాటాలని.. వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ భావించింది. ఇక్కడ ఒక్కచోట గెలవడం ద్వారా తమ సత్తా చాటాలని, ఉనికిని చాటుకోవాలని.. తహతహలాడుతున్న పరిస్థితి తిరుపతిలో కనిపించింది. ఈ క్రమంలో ఈ రెండు పార్టీలూ చెమటోడ్చుతున్న పరిస్థితి కనిపించింది. ఇక, అధికార పార్టీలో నేతల మద్య విభేదాలు, ఆధిపత్య పోరు తిరుపతి వేదికగా స్పష్టంగా కనిపిపించింది. దీంతో నేతలు ప్రచారంలో ముందున్నా.. అనుకున్న విధంగా లక్ష్యాన్ని సాధిస్తారో లేదో తెలియని ఒక సందిగ్ధ పరిస్థితి అయితే పోలింగ్ తర్వాత కూడా ఉంది. ఈ క్రమంలో వైసీపీ సహా.. టీడీపీ, బీజేపీలు.. సామాజికవర్గాల వారీగా ప్రజలను కలుస్తూ.. మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నించాయి.
రెడ్డి సామాజికవర్గం….
బీజేపీలోను, టీడీపీలోనూ, వైసీపీలోనూ కామన్‌గా రెడ్డి సామాజికవర్గం ఉంది. దీంతో వీరు రెడ్డి సామాజిక వర్గాన్ని బలంగా ప్రభావితం చేయాలని అనుకున్నారు. రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నా.. మూడు పార్టీల్లోనూ పార్లమెంటు పరిధిలో మాత్రం రెడ్డి వర్గం నేతలే పెత్తనం చేస్తోన్న పరిస్థితి. ఇక తిరుపతిలో యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో మంత్రి అనిల్‌కుమార్‌కు వైసీపీ అధినేత, సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్ మాజీ మంత్రి యనమలకు ఇక్కడ బాధ్యతలు అప్పగించారు.
ఎవరి కులం వారిది…?
అదే సమయంలో ఎస్సీ సామాజిక వర్గం బాధ్యతను బీజేపీలో ఎవరూ తీసుకోలేదు. సోము వీర్రాజు అన్ని సామాజిక వర్గాలను కలుస్తున్నారు. ఇక, విష్ణువర్ధన్ రెడ్డి భానుప్రకాశ్ రెడ్డి వంటి వారు తమ పరిధిలో ప్రజలతో సమావేశాలు అవుతున్నారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన కీలక నాయకులను కలుస్తూ.. హామీలు గుప్పించారు. ఇక నెల్లూరు జిల్లాలో రెడ్లు ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో రెడ్లకు బాధ్యతలు ఇచ్చిన టీడీపీ… కమ్మలు ఉన్న చోట కమ్మ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి ప్రచారం చేశారు. దీంతో మూడు పార్టీల కుల వ్యూహాలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. మరి తిరుపతి లో వీరి వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి. ఫలితాలు వస్తేనే గాని తెలియదు.