మోదీ త్రీ మ్యాజిక్…!!
అందరూ ఊహించిందే జరిగింది. మధ్యంత్ర బడ్జెట్ ను కేంద్ర సర్కార్ ఎన్నికల బడ్జెట్ గా మార్చింది. దేశ ప్రజలపై వరాల జల్లు కురిపించింది. సంచలన నిర్ణయాలు తీసుకుంది. [more]
అందరూ ఊహించిందే జరిగింది. మధ్యంత్ర బడ్జెట్ ను కేంద్ర సర్కార్ ఎన్నికల బడ్జెట్ గా మార్చింది. దేశ ప్రజలపై వరాల జల్లు కురిపించింది. సంచలన నిర్ణయాలు తీసుకుంది. [more]
అందరూ ఊహించిందే జరిగింది. మధ్యంత్ర బడ్జెట్ ను కేంద్ర సర్కార్ ఎన్నికల బడ్జెట్ గా మార్చింది. దేశ ప్రజలపై వరాల జల్లు కురిపించింది. సంచలన నిర్ణయాలు తీసుకుంది. తక్కువ డబ్బుతో కేంద్రంపై పెద్దగా భారం పడకుండానే ఎక్కువ మంది ప్రజలకు లబ్ధి కలిగేలా కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇటీవల అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేసి సర్జికల్ స్ట్రైక్ చేసిన మోదీ సర్కార్.. ఇప్పుడు బడ్జెట్ తో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. దేశంలో నరేంద్ర మోదీ హవా తగ్గిపోతుందని సంబరపడుతున్న ప్రతిపక్షాలకు బడ్జెట్ ద్వారా భారీ షాక్ నే ఇచ్చింది. మరి, ఎన్నికలకు మూడు నెలల మూడు మోదీ సర్కార్ కురిపిస్తున్న ఈ వరాల జల్లుతో ఓట్ల పంట పండే అవకాశాలు ఎక్కుగానే ఉన్నాయి.
రైతులను ఆదుకునేందుకు… ఆకట్టుకునేందుకు…
మరోసారి అధికారంలోకి వచ్చేందుకు నరేంద్ర మోదీ పక్కా వ్యూహంతోనే ఉన్నారు. తన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలను ఒక్కోటి సంధిస్తున్నారు. ఇప్పటికే అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లతో వారిని తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో బాగానే సక్సెస్ అయ్యారు. ఇప్పుడు బడ్జెట్ లో కూడా ఆయన కేంద్రం ఇటువంటి ప్రయత్నమే చేసింది. పూర్తిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ ను రూపొందించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మూడు అంశాలు మోదీకి రానున్న ఎన్నికల్లో బాగానే మేలు చేసే అవకాశం ఉంది. వాటిల్లో మొదటిది ‘రైతులకు నేరుగా నగదు’. తెలంగాణలో కేసీఆర్ అమలు చేసిన ‘రైతుబంధు’కి ఇది ఒకరకంగా కాపీ అని చెప్పుకోవాలి. అయితే, ఇక్కడ ఒక్క ఎకరానికి ఏడాదికి రూ.8 వేలు ఇస్తున్నారు. ఈ పథకం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు ఓట్ల వర్షం కురిపించింది. దీంతో ఈ పథకాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. కేంద్రం కూడా ఈ పథకంపై ఆసక్తి చూపించింది. ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పేరుతో కొత్త పథకాన్ని రూపొందించారు. ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు నేరుగా వారి ఖాతాల్లోకే మూడు విడతల్లో రూ.6 వేలు జమా చేయనున్నారు. ఎన్నికలకు ముందే ఒక విడత రైతుల ఖాతాల్లో పడనుంది. ఈ పథకం ద్వారా దేశంలో మొత్తం 12 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. దీంతో ఇది ఎన్నికల్లో కలిసివస్తుందని భావిస్తున్నారు.
ఆదాయపన్ను పరిమితి పెంపుతో…
ఇక, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు కూడా కేంద్ర సర్కార్ ప్రయత్నించింది. వీరు ఎప్పటినుంచో ఆశిస్తున్న ఆదాయ పన్ను పరిమితిని రెట్టింపు చేశారు. రూ.2.50 లక్షలు ఉన్న ఆదాయ పన్ను పరిమితిని ఏకంగా రూ.5 లక్షలకు పెంచారు. ఇక, ఇంటి అద్దె, రుణాలు, ఇన్సురెన్సులు వంటివాటితో కలిపి మొత్తం రూ.6.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇది నిజంగా మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట. మూడు కోట్ల కుటుంబాలకు ఈ నిర్ణయం వల్ల మేలు కలిగే అవకాశం ఉంది. ఇక, అసంఘటిత కార్మికుల గురించి కూడా కేంద్రం మంచి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలూ వీరి గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. 60 ఏళ్లు దాటిన ఈ రంగంలోని కార్మికులకు రూ.3 వేలు పింఛన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు కార్మికులు నెలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం ఇప్పటికిప్పుడు కార్మికులకు లబ్ధి కలిగించేదేమీ కాకున్నా… తమకూ పింఛన్ వస్తుందనే భరోసా మాత్రం వారిలో కలిగించే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది లబ్ధి పొందుతారని భావిస్తున్నారు. మొత్తానికి సుమారు 20 కోట్ల మందిని ఆకట్టుకునే విధంగా మోదీ సర్కార్ బడ్జెట్ లో వరాల జల్లు కురిపించింది. అయితే, ఈ పథకాలు మోదీకి వారు ఆశిస్తున్నట్లుగా ఓట్లు కురిపిస్తుందా లేదా ఎన్నికలకు మూడు నెలల ముందు ప్రకటించిన పథకాలు కాబట్టి పెద్దగా ఫలితం ఉంటుందో? ఉండదో చూడాలి.