రెండు నెలలు.. లాక్ డౌన్ లోనే?
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను మరోసారి పొడిగించింది. ఈ సారి రెండు వారాలను పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిింది. మార్చి 24 నుంచి [more]
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను మరోసారి పొడిగించింది. ఈ సారి రెండు వారాలను పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిింది. మార్చి 24 నుంచి [more]
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను మరోసారి పొడిగించింది. ఈ సారి రెండు వారాలను పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిింది. మార్చి 24 నుంచి భారత్ లో లాక్ డౌన్ ను కొనసాగుతుంది. అంటే దాదాపు యాభై రోజుల పాటు భారత్ లో లాక్ డౌన్ కేంద్ర ప్రభుత్వం విధించినట్లయింది. ఇంచుమించుగా రెండు నెలల పాటు లాక్ డౌన్ ను భారత్ లో కొనసాగించారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తొలుత మే 24వ తేదీన….
తొలుత మే 24వ తేదీన ప్రధాని మోదీ లాక్ డౌన్ ను ప్రకటించారు. 21 రోజుల పాటు లాక్ డౌన్ ను విధించారు. ఆ తర్వాత ఏప్రిల్ 14వ తేదీన మరోసారి మోదీ లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రకటించారు. మే 3వ తేదీ వరకూ పొడిగించారు. మూడోసారి మళ్లీ మే 17వ తేదీ వరకూ లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రెండోసారి కొన్ని మినహాయింపులు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలకు, వ్యవసాయపనులకు మినహాయింపు ఇచ్చింది.
మినహాయింపులు ఇచ్చినా….
తాజాగా పొడిగించిన లాక్ డౌన్ లో కూడా కొన్ని మినహాయింపులు ఇచ్చింది. అయితే ఈసారి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొంత వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. ఇది రాష్ట్రాలకు కొంత వరకూ ఊరట నిచ్చే అంశమే అయినప్పటికీ పూర్తి స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభం కాకపోవడం రాష్ట్రాలకు పెద్దగా ఆదాయం ఒనగూరే అవకాశం లేదు. రెడ్ జోన్లలో ఎటువంటి మినహాయింపులు ఉండవు.
గ్రీన్ జోన్ లలో……
ఇక రాష్ట్రాల మధ్య రాకపోకలను మే 17వరకూ పూర్తిగా నిషేధం విధించింది. గ్రీన్ జోన్లలో మాత్రం పూర్తి స్థాయి సడలింపులు ఇచ్చింది. మద్యం దుకాణాలకు కూడా అనుమతి ఇచ్చింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. పరిమిత సంఖ్యలో బస్సులు కూడా నడుపుకోవచ్చని పేర్కొంది. గ్రీన్ జోన్లుగా ఉన్న జిల్లాల మధ్య రాకపోకలకు ఓకే చెప్పింది. ఇది ఒకరకంగా ఊరట ఇచ్చే అంశమే అయినా రెండు నెలల పాటు ఉపాధి లేని పేద, మధ్య తరగతి ప్రజలకు మాత్రం ప్రభుత్వం ఎలాంటి పథకాలను వర్తింప చేయకపోవడం విచారకరం.