చేతులెత్తి దండంపెట్టినా… ప్రయోజనం లేదే?
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్ట్టించిన సృష్టిస్తున్న వినాశనం అంతా చూస్తూనే ఉన్నారు. భారత్ లో ఆ పరిస్థితి ఉత్పన్నం కాకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకల చర్యలు [more]
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్ట్టించిన సృష్టిస్తున్న వినాశనం అంతా చూస్తూనే ఉన్నారు. భారత్ లో ఆ పరిస్థితి ఉత్పన్నం కాకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకల చర్యలు [more]
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్ట్టించిన సృష్టిస్తున్న వినాశనం అంతా చూస్తూనే ఉన్నారు. భారత్ లో ఆ పరిస్థితి ఉత్పన్నం కాకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకల చర్యలు చేపట్టాయి. అయితే ప్రజల ప్రాణాలతో బాటు ఆర్ధిక వ్యవస్థను జాగ్రత్తలు పాటిస్తూ గాడిన పెట్టేందుకు కేంద్రం మూడో దఫా లాక్ డౌన్ లో కొన్ని ఆంక్షలు సడలిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంతే రెక్కలు తెగిన పక్షుల్లాగా ఒక్కసారి ప్రజలు బజార్లపై పడిపోయారు. ఈ చర్యలు ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్నాయి. ఇన్ని రోజులు చేసిన దీక్షను ఒక్కసారిగా భగ్నం చేసుకుంటున్నామా అనే ప్రశ్నను ప్రతిఒక్కరి మదిలో ఉదయించేలా చేస్తుంది.
భౌతిక దూరం లేదు, మాస్క్ లు లేవు …
మందులేని మహమ్మారిని కట్టడి చేయడానికి ఒకే ఒక్క అవకాశం స్వీయ క్రమశిక్షణ పాటించడం. ఇందులో భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరిస్తూ, తరచూ చేతులు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వ్యక్తిగతంగా వారికే కాదు వారి కుటుంబానికి, సమాజానికి మంచిది. కానీ అవసరం ఉన్నా లేకున్నా రోడ్డెక్కేస్తున్నారు చాలా మంది. కుటుంబాలతో సహా కొందరు షాపింగ్ లు మొదలు పెట్టేశారు. మరికొందరు మాస్క్ లు ధరించకుండానే చక్కర్లు కొడుతున్నారు. మద్యం షాపు ల దగ్గర అయితే శృతిమించి వ్యవహారం నడుస్తుంది.
నిబంధనలు పాటించడమే లేదు …
ఇక వ్యాపార వర్గాల్లో చాలామంది నిబంధనలు పాటించడంలేదు. సర్వత్రా నిర్లక్ష్య ధోరణి రాజ్యమేలుతుంది. కుర్రకారు షికార్లకు అయితే ప్రస్తుతం లెక్కే లేకుండా పోయింది. బైక్ లపై ముగ్గురేసి రొటీన్ గానే విహరిస్తూ ప్రమాదఘంటికలు మ్రోగించేస్తున్నారు. తల్లితండ్రులు వారిని కంట్రోల్ చేయకపోవడం మరింత ప్రమాదాన్ని సమాజానికి కొనితెచ్చి పెడుతుంది. ఇక నేతలు చేసే సేవా కార్యక్రమాల్లో భౌతిక దూరం మాట నీటిమూటే అవుతుంది. ఇవన్నీ చూస్తున్న పోలీసులకు చేష్టలుడిగి చూసే పరిస్థితి దాపురించింది. ఈ పరిణామాలను గమనిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ లోని వైద్యులు హడలెత్తిపోతున్నారు. నిబంధనలు పాటించి తమపై వత్తిడి లేకుండా సురక్షితంగా ఉండాలని చేతులు ఎత్తి దణ్ణం పెడుతున్నారు.