తలతిక్క చర్యలతో భౌతిక దూరం మాయం?
లాక్ డౌన్ ను క్రమంగా సడలిస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. అదే రీతిలో రాష్ట్రాలు మినహాయింపులు ఇస్తూ కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నాయి. [more]
లాక్ డౌన్ ను క్రమంగా సడలిస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. అదే రీతిలో రాష్ట్రాలు మినహాయింపులు ఇస్తూ కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నాయి. [more]
లాక్ డౌన్ ను క్రమంగా సడలిస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. అదే రీతిలో రాష్ట్రాలు మినహాయింపులు ఇస్తూ కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నాయి. వైరస్ కట్టడి అంశంలో భౌతిక దూరం చాలా కీలకం. అయితే నిబంధనలు సడలిస్తూ ఉంటె దానికి అనుగుణంగా అధికార యంత్రాంగాలు తీసుకునే చర్యలు ఉండటం లేదు. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, మునిసిపల్ శాఖల నడుమ సమన్వయ లోపంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. అంతేకాదు భౌతిక దూరం లేకుండా పోయి ప్రమాద ఘంటికలు మ్రోగిస్తుంది.
రోడ్లపై ట్రాఫిక్ ఇక్కట్లు …
లాక్ డౌన్ సందర్భంగా పోలీసులు ఎక్కడికక్కడ రహదారులపై బారికేడ్స్, ఐరన్ రాడ్ లు, కర్రలు, సిమ్మెంట్ దిమ్మలు, రాళ్ళు ఇలా ఏది దొరికితే అవి అడ్డం పెట్టారు. రోడ్లపైకి వచ్చే ప్రజలను నియంత్రించేంత పోలీస్ సిబ్బంది లేకపోవడంతో కీలక రోడ్లు బ్లాక్ చేయడంతో వారికి లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేసే వీలు చిక్కింది. అయితే ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు చాలావరకు ఎత్తివేశాయి. రెడ్ జోన్లలో మాత్రం కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్లపైకి వస్తున్న ప్రజలు తమ దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోవడానికి వెళుతున్నారు. అయితే రోడ్లకు అడ్డంగా ఉండే ఈ అడ్డంకులను మాత్రం పోలీసులు తీయకపోవడంతో సాఫీగా వెళ్ళలిసిన వాహనాలకు ట్రాఫిక్ జామ్ లు ఎక్కడికక్కడ ఎదురౌతున్నాయి. అసలే రెడ్ జోన్స్ ఉండే ప్రాంతాలు అడ్డంకి అధిగమించి చుట్టూ తిరిగి వెళ్లేవారికి ఈ ట్రాఫిక్ జామ్ లతో భౌతిక దూరం కనుచూపు మేరలో లేకుండా పోవడం విమర్శలకు తెరతీసింది.
షాప్ లు తెరవడంలో వివక్ష…
రోజు విడిచి రోజు వ్యాపారాలు చేసుకునే వెసులు బాటు ఇవ్వడం కూడా ఒక షాప్ లో ఎక్కువమంది ఖాతాదారులు చేరేలా చేస్తుంది. అదే అన్ని షాప్ లు తెరిస్తే ఈ సమస్య ఎదురుకాదు. భౌతిక దూరం పాటించే అవకాశం ఏర్పడుతుంది. చిన్న చిన్న షాప్ ల విషయంలో పెడుతున్న ఆంక్షలు రిలయన్స్ రిటైల్స్ షాప్ లు వంటి వాటికి లేవు. వారు రోజు తీసుకునే అవకాశాన్ని ఎలక్ట్రానిక్ వ్యాపారాలు చేసుకునేవారు ప్రశ్నిస్తున్నారు. ఇక వస్త్ర వ్యాపారాల్లోనూ ఇదే పంథా అధికారులు అమలు చేయడం విమర్శలకు దారితీస్తుంది. పెద్ద పెద్ద షాప్ లకు రోజు విడిచి రోజు నిబంధన వారు గాలికి వదిలి వేశారు. వీరిపై మునిసిపల్, రెవెన్యూ, పోలీసు శాఖల చర్యలు లేకపోవడం తో చిన్న వ్యాపారులు ఇదెక్కడి న్యాయం అని మౌనంగా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలపై తక్షణం అధికారయంత్రాంగం దృష్టి పెట్టాలని వ్యాపార వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. వివక్షలకు తావులేకుండా భౌతిక దూరం అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్నప్తి చేస్తున్నాయి.