నెమ్మది నెమ్మదిగా … తాళం తీస్తున్నారు
లాక్ డౌన్ పై ఒక పక్క సడలింపులు ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరికొద్ది రోజుల్లో కఠినమైన రీతిలో అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. దేశంలోని వలస కార్మికులకు, [more]
లాక్ డౌన్ పై ఒక పక్క సడలింపులు ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరికొద్ది రోజుల్లో కఠినమైన రీతిలో అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. దేశంలోని వలస కార్మికులకు, [more]
లాక్ డౌన్ పై ఒక పక్క సడలింపులు ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరికొద్ది రోజుల్లో కఠినమైన రీతిలో అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. దేశంలోని వలస కార్మికులకు, యాత్రికులకు, విద్యార్థులకు, అత్యవసర పనులపై ప్రయాణాలకు ఇప్పటికే సడలింపులు ఇచ్చింది. అయితే ఈ నిబంధనలు అడ్డుపెట్టుకుని కొందరు ప్రయాణాలు మొదలు పెట్టేస్తున్నట్లు దృష్టికి రావడంతో మరోసారి గతనెల 29 న మే నెల 17 వ తేదీ వరకూ ఇచ్చిన సడలింపులు పై కేంద్రం వివరణ ఇచ్చింది. ఒక చోట నివాసం వుంటూ మరోచోట ఉద్యోగం చేసుకునేవారు ప్రయాణాలు చేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది. తాము ఇచ్చిన సడలింపులు కేవలం వారికోసమే అని తేల్చి చెప్పేసింది.
ఆ పని పూర్తి అయ్యాక …
వలసకూలీలు, విద్యార్థులు, యాత్రికులు స్వస్థలాలకు చేరుకున్నాకా లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినం చేసే వ్యూహం అమలు చేయాలని కేంద్రం సిద్ధమౌతున్నట్లు సమాచారం. దేశంలో కేసుల సంఖ్య 40 వేలకు పైగా చేరుకోవడం ఇందులో యాక్టివ్ కేసులుగా 28 వేలు ఉన్నాయి. దీనితో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవన్నట్లు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అలాగే రాష్ట్రాలు సైతం టెస్ట్ ల సంఖ్య పెంచుతూ వైరస్ కట్టడికి ప్రజల్లో అవగాహన కలిగించాలని ఆదేశాలు జారీ చేసింది.
విమాన సర్వీసులు కూడా…
మరోపక్క విమాన సర్వీసులను నెమ్మదిగా ప్రారంభించాలని ఆలోచన చేస్తుంది. కొన్ని కీలక నగరాలకు ఒక్కొక్క టెర్మినల్ మాత్రమే ప్రారంభించి రవాణా వ్యవస్థ ను గాడిన పెట్టే పనిలో పడింది కేంద్రం. సామాజిక దూరం పాటించడం, శానిటైజర్స్ వినియోగిస్తూ ప్రయాణికుల బ్యాగేజ్ లను శానిటైజ్ చేయడం వంటివాటిపై తగిన జాగ్రత్తలు చేపట్టే అంశంపై వారికి ఇప్పటికే విమానాశ్రయ వర్గాలకు ఆదేశాలు వెళ్లాయి. పరిస్థితిని బట్టి స్థానిక యంత్రాంగాలు నిర్ణయాలు మార్పు చేర్పులు చేసుకునే వీలుంది.