వైసీపీలోకి వెళ్దామా… విశ్రాంతి తీసుకుందామా..?
చింతచచ్చినా పులుపు చావదని అంటారు! అలానే.. రాజకీయాల్లో ఉన్న నాయకులకు కూడా వయసు మీదపడుతున్నా.. ఇంకా పదవుల మీద కాంక్ష తీరడం లేదు. అధికారం మీద వ్యామోహమూ [more]
చింతచచ్చినా పులుపు చావదని అంటారు! అలానే.. రాజకీయాల్లో ఉన్న నాయకులకు కూడా వయసు మీదపడుతున్నా.. ఇంకా పదవుల మీద కాంక్ష తీరడం లేదు. అధికారం మీద వ్యామోహమూ [more]
చింతచచ్చినా పులుపు చావదని అంటారు! అలానే.. రాజకీయాల్లో ఉన్న నాయకులకు కూడా వయసు మీదపడుతున్నా.. ఇంకా పదవుల మీద కాంక్ష తీరడం లేదు. అధికారం మీద వ్యామోహమూ తీరడం లేదు. గతం తమిళనాడు మాజీ సీఎం కరుణా నిధి.. చక్రాల కుర్చీలో ఒరిగిపోయిన స్థితిలోనూ పార్టీని పట్టుకుని వేలాడారు. ఇప్పుడు కర్నాటకలో దేవగౌడది అదే పరిస్థితి. ఈ వయస్సులోనూ ఆయన గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో తమకూరులో ఓడినా ఇప్పుడు రాజ్యసభకు వెళుతున్నారు. గత ఏడాది ఎన్నికల్లో ఏపీలో గుంటూరు జిల్లాలో ఓ సీనియర్ నేత, వృద్ధుడు తనకు ఎంపీ సీటు ఇస్తారా? చస్తారా? అంటూ.. పీకల మీద కూర్చుని తెప్పించుకున్నారు. ఇది.. అన్నిపార్టీల్లోనూ అన్ని జిల్లాల్లోనూ ఉన్నదే అంటున్నారు పరిశీలకులు.
అనేక పార్టీలు మారి…..
తాజాగా ఈ లైన్లోకి చదలవాడ కృష్ణమూర్తి వచ్చారు. నెల్లూరు జిల్లాలో పుట్టిన ఆయన తిరుపతిలో పట్టు పెంచుకున్నారు. ఆదిలో కాంగ్రెస్, తర్వాత టీడీపీ.. ఆ తర్వాత ఇప్పుడు జనసేనలోనూ ఉన్న చదలవాడ.. వయసు 72. అయినా కూడా ఇంకా పార్టీలు, పదవుల వేటలో ఆయన తీరిక లేకుండా ఉన్నారని అంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు, తర్వాత టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రజలకు స్వచ్ఛంద సేవను మాత్రం మరవలేదు. దీంతో ఆయన పట్ల సానుభూతి ఉంది. గతంలో సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ.. ఆయన కోరుకున్న ఛాన్స్‌లు దక్కలేదు. దీంతోనే టీడీపీలోకి జంప్ చేశారు.
ఘోరంగా ఓడిపోవడంతో……
ఈ క్రమంలోనే తిరుపతి ఎమ్మెల్యేగా అవకాశం దక్కించుకున్నారు. ఇక, ఆ తర్వత రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఎన్నికల్లో ఆయన తిరుపతి సీటుపై ఆశలు పెట్టుకోగా చంద్రబాబు ఆయన్ను కాదని మున్నూరు వెంకటరమణకు సీటు ఇచ్చారు. అయితే 2015లో టీటీడీ బోర్డు చైర్మన్‌గా పదవిని దక్కించుకుని తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేయించుకున్నారు. అయితే, రెండో సారి కూడా తనకే ఈ పదవిని ఇవ్వాలన్న చదలవాడ వినతిని చంద్రబాబు పక్కన పెట్టడంతో ఆయన అలిగి జనసేనలోకి వచ్చారు. గత ఏడాది జనసేన తరఫున తిరుపతిలో పోటీ చేసి డిపాజిట్లు కూడా కోల్పోయారు. ఇక, అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక, ఇప్పుడు ఆయన వైసీపీలోకి చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఎలాంటి వివాదాలు లేకపోవడంతో…..
అంతేకాదు.. ఇటీవల పెద్దిరెడ్డి అప్పాయింట్మెంట్ కోరగా.. చూద్దామన్నారని. ప్రచారం జరుగుతోంది. తిరుపతి ఎంపీ స్థానానికి త్వరలోనే ఉపపోరు జరగనున్న నేపథ్యంలో చదలవాడ లాంటి వాళ్ల అవసరం వైసీపీకి ఉన్నా లేకపోయినా ఎవరికి అయినా కండువా కప్పేందుకు ఆ పార్టీ నేతలు రెడీగా ఉన్నారు. ముందు వారు పార్టీలో చేరే రోజు జగన్ దగ్గరకు తీసుకు వెళ్లి ఓ ఫొటో తీసుకోవడం తప్పా ఆ తర్వాత ఎవ్వరిని పట్టించుకునే పరిస్థితి లేదు. రేపు చదలవాడ వైసీపీలో చేరినా అంతకుమించి ఏం వింతలు జరగవు. మరి చివరికి వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. చదలవాడపై ఎలాంటి వివాదాలు లేకపోవడం గమనార్హం.