ఈయనకు రాజకీయాలు వేస్టేనట
చెలమల శెట్టి సునీల్. రాజకీయ దురదృష్ట వంతుల జాబితాలో మొదట ఉండే పేరు ఇదేనా ? ఆయన ఇప్పటికి మూడు సార్లు పోటీ చేస్తే.. మూడు సార్లూ [more]
చెలమల శెట్టి సునీల్. రాజకీయ దురదృష్ట వంతుల జాబితాలో మొదట ఉండే పేరు ఇదేనా ? ఆయన ఇప్పటికి మూడు సార్లు పోటీ చేస్తే.. మూడు సార్లూ [more]
చెలమల శెట్టి సునీల్. రాజకీయ దురదృష్ట వంతుల జాబితాలో మొదట ఉండే పేరు ఇదేనా ? ఆయన ఇప్పటికి మూడు సార్లు పోటీ చేస్తే.. మూడు సార్లూ ఓటమిపాలయ్యారు. అది కూడా మూడు పార్టీల నుంచి పోటీ చేసినప్పటికీ ఆయనను ఏ ఒక్కపార్టీ కూడా గెలిపించుకోలేక పోయింది. కొన్ని పొరపాట్లు.. కొంత అన్ లక్ వెరసి చెలమల శెట్టి సునీల్ రాజకీయం అగమ్య గోచరంగా మారిపోయింది. మూడు సార్లు కూడా ఆయన స్వల్ప తేడాతోనే ఓడిపోయారు.
మూడు సార్లు పోటీ చేసి…..
విషయంలోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎంపీ స్థానం నుంచి వరుసగా మూడు సార్లు పోటీ చేసిన సునీల్. మూడు సార్లు కూడా పరాజయం పాలయ్యారు. దీంతో ఆయన తీవ్ర నిర్వేదంలో కూరుకుపోయారు. ఎన్నారైగా ఉన్న ఆయన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో ఆకర్షితులు అయి రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ, 2014 వైఎస్సార్సీపీ, 2019లో టీడీపీ…ఇలా మూడు ఎన్నికలు … మూడు పార్టీలన్నట్టుగా పోటీచేసిన చెలమల శెట్టి సునీల్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అయినా మూడు ఎన్నికల్లో వరుస ఓటముల తరువాత పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించే సాహసం చేయలేకపోతున్నారు.
అన్ లక్కీ లీడర్……
ఇటీవల వైసీపీ వేవ్‌లో మూడోసారి కూడా స్వల్ప తేడాతో ఓడిపోవడంతో తనంత దురదృష్ట వంతుడు ఎవ్వరూ ఉండరని ఆయన కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. వాస్తవానికి సునీల్ హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ కాకినాడ ఎల్బీ నగర్లో పెద్ద బిల్డింగ్ అద్దెకు తీసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహించే వారు. అటువంటి భవనం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. ఎన్నికల ముందు రావడం … ఓటమి తరువాత కనిపించకుండా పోవడం షరామామూలేనని అంటున్నారు. వాస్తవానికి ప్రజారాజ్యంలో చేరినప్పుడు చిరంజీవి ప్రభావంతో గెలుపు గుర్రం ఎక్కుతానని ఆయన అనుకున్నారు. అయితే, ఓటమితో ఆయన తీవ్రంగా మదన పడ్డారు.
అనూహ్యంగా టీడీపీలోకి….
ఆ తర్వాత పార్టీనే ఏకంగా కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో వైసీపీలోకి జంప్ చేసేశారు. 2014లో ఆయన వైసీపీ నుంచి వరుసగా రెండోసారి ఎంపీగా పోటీ చేసి అప్పుడు కూడా ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో చెలమల శెట్టి సునీల్ నాడు టీడీపీ నుంచి పోటీ చేసిన తోట నరసింహం చేతిలో 13 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో ఉన్న సునీల్ వైసీపీలో ఉండాలా ? బయటకు రావాలా ? అని చాలా రోజులు డైలమాలో ఉన్నారు. ఈ దఫా ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున పోటీ చేయాల్సిన చెలమల శెట్టి సునీల్ తన సోదరుడుకి టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడికి మధ్య ఉన్న పరిచయం కారణంగా అనూహ్యంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
రాజకీయాలకు దూరంగా…..
ఈ క్రమంలోనే ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. వైసీపీ తరఫున వంగా గీత పోటీ చేశారు. నిజానికి గీత ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు. ఆమెను జనాలు మర్చిపోయి చాలా ఏళ్లు అయ్యింది. కానీ.. జగన్ సునామీలో ఆమె విజయం సాధించగా.. గెలుస్తాడని అనుకున్న చెలమల శెట్టి సునీల్ మాత్రం చతికిల పడ్డారు. ఈ సారి కూడా సునీల్ 23 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఇప్పుడు ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.