ఆంధ్రా మీద పడిపోతున్నారా..?
ఏడేళ్ళ క్రితం వరకూ ఉమ్మడి అంధ్రప్రదేశ్ లోనే అంతా ఉండేవారు. అది అరవయ్యేళ్ళ బంధం. విభజన దెబ్బతో తెగిపోతుందా. అటూ ఇటూ కూడా చుట్టరికాలు, వ్యాపార వ్యవహారాలు [more]
ఏడేళ్ళ క్రితం వరకూ ఉమ్మడి అంధ్రప్రదేశ్ లోనే అంతా ఉండేవారు. అది అరవయ్యేళ్ళ బంధం. విభజన దెబ్బతో తెగిపోతుందా. అటూ ఇటూ కూడా చుట్టరికాలు, వ్యాపార వ్యవహారాలు [more]
ఏడేళ్ళ క్రితం వరకూ ఉమ్మడి అంధ్రప్రదేశ్ లోనే అంతా ఉండేవారు. అది అరవయ్యేళ్ళ బంధం. విభజన దెబ్బతో తెగిపోతుందా. అటూ ఇటూ కూడా చుట్టరికాలు, వ్యాపార వ్యవహారాలు చాలానే ఉన్నాయి. హైదరాబాద్ లో సెటిలర్స్ మొత్తం జనాభాలో సగానికి పైగా ఉంటారు. ఇతర జిల్లాల్లో కూడా ఆంధ్రుల సంఖ్య చెప్పుకోదగినదే. ఈ నేపధ్యంలో ఆంధ్రా తెలంగాణాగా విడిపోయి ఎవరి రాజకీయం వారు చేసుకుందామనుకున్నా అ కెలుకుడూ అటూ ఇటూ ఉంటుంది. ఏడేళ్ల కాలం దాటింది. టీఆర్ఎస్ తెలంగాణా కార్డుకి కాలం చెల్లిందన్న ఉద్దేశ్యంతో జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణా నట్టింట కాలుమోపారు. ఆమె అక్కడ పార్టీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
రివర్స్ గిఫ్ట్ ….
ఇక తెలంగాణాను రాజకీయంగా గిల్లితే వారు ఊరుకుంటారా. అసలే కేసీయార్ గండర గండడు. అందుకే ఆయన ఏపీ వైపు చూస్తున్నారు అంటున్నారు. మునిసిపల్ ఎన్నికల వేళ తన అభ్యర్ధులను నిలబెట్టి బరిలోకి దిగిపోయిన మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీలో తాము ఆడా ఈడా ఉంటామని తేల్చిచెప్పేశారు. అసదుద్దీన్ జగన్ కి మిత్రుడే. కానీ రాజకీయాలు ఎపుడూ ఒకేలా ఉండవు కదా. అందుకే ఆయన ఏపీలో కాలుపెడుతున్నారు. ఆంధ్రా పాలిటిక్స్ లో వేలు కూడా పెడుతున్నారు అంటున్నారు. మరి దీని వెనకాల కేసీఆర్ ఉన్నారా లేదా అన్నది తెలియదు కానీ ఏపీ మీద గురి మాత్రం టీఆర్ఎస్ పెట్టిందని అంటున్నారు.
అనూహ్య మద్దతు ….
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఏపీలో సాగుతోంది. అయితే ఇది అనుకున్నంత దూకుడుగా సాగడంలేదని జనాలు అంటున్నారు. దానికి కారణం ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ కూడా మోడీ అంటే భయపడుతున్నాయనే చెబుతారు. గట్టిగా నోరు తెరచి ఏంటీ అన్యాయం అని మోడీని నిలదీయడానికి మాత్రం సిధ్ధంగా లేవన్నది నిజం. జనాలకు కూడా ఆ సంగతి తెలుసు. సరిగ్గా ఇదే అదనుగా చేసుకుని టీఆర్ఎస్ గర్జించించి. ఇవాళా విశాఖ స్టీల్ ప్లాంట్ రేపు భేల్, సింగరేణీ ఇలా అన్నీ వరసపెట్టి ప్రైవేటీకరించుకుంటూ పోతారు. అందువల్ల ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలంటే మేము స్టీల్ ప్రైవేట్ కాకుండా కార్మికుల పోరాటానికి మద్దతు ఇస్తామంటూ ముందుకు వచ్చారు. అవసరం అయితే విశాఖకే వచ్చి గట్టిగానే ఉద్యమిస్తామని కేటీఆర్ పక్కా క్లారిటీగా చెప్పేశారు
విస్తరిస్తారా ….?
రాజకీయ నాయకుడు అంటేనే లాభం చూసుకుంటారు. ఏపీలో స్టీల్ ప్లాంట్ గురించి పోరాడుతాము అని టీఆర్ఎస్ భావి నాయకుడు కేటీయార్ అంటున్నారు అంటే కచ్చితంగా ఏపీలో రేపటి రోజున టీఆర్ఎస్ విస్తరించేందుకు ఏదైనా వ్యూహం ఉందా అన్న చర్చ అయితే వస్తోంది. అందులో తప్పు కూడా లేదు, ఏ పార్టీ అయినా తన బలాన్ని, బలగాన్ని ఎప్పటికపుడు పెంచుకోవడమే రాజకీయం. ఏపీలో చూస్తే జగన్, చంద్రబాబు ఇద్దరూ కేంద్రాన్ని ఎదిరించలేరు అన్నది నిర్ధారణ అవుతున్న వేళ టీఆర్ఎస్, మజ్లీస్ దూకుడుగా ఏపీకి వచ్చి బీజేపీని మోడీకి ఎదురునిలిస్తే ఆ కధే వేరుగా ఉంటుంది అన్న వారూ లేకపోలేదు. మొత్తానికి చూసుకుంటే ఏపీలో రాజకీయంగా ఒక శూన్యత ఏమైనా ఉంటే దాన్ని పూరించడానికి మేము రెడీ అంటున్నాయి తెలంగాణా పార్టీలు. చూడబోతే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే మరి.