భయపడే వాడే అరుస్తాడు.. బలమున్నోడు భరిస్తాడు
భయపడే వాడే అరుస్తాడు.. బలమున్నోడు భరిస్తాడు ఈ డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది. పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ అత్తారింటికి దారేదిలోని ఈ డైలాగ్ [more]
భయపడే వాడే అరుస్తాడు.. బలమున్నోడు భరిస్తాడు ఈ డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది. పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ అత్తారింటికి దారేదిలోని ఈ డైలాగ్ [more]
భయపడే వాడే అరుస్తాడు.. బలమున్నోడు భరిస్తాడు ఈ డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది. పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ అత్తారింటికి దారేదిలోని ఈ డైలాగ్ ఇప్పుడు పవన్ కల్యాణ్ కు, చంద్రబాబుకు మాత్రం వర్తిస్తుందన్నది వాస్తవం. జగన్ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలల కాకముందే ఇటు చంద్రబాబు, అటు పవన్ కల్యాణ్ లు రోడ్డెక్కుతుండటాన్ని ఈ డైలాగ్ జ్ఞప్తికి తెస్తోంది. నిజానికి ఈ ఇద్దరూ జగన్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు పెద్దగా అంశాలు లేవు. కేవలం ఇసుక కొరత మాత్రమే వారికి కన్పించింది.
పవన్ కల్యాణ విషయానికొస్తే….
పవన్ కల్యాణ్ విషయానికొస్తే ఆయన పార్టీ గెలిచింది ఒక్క ఎమ్మెల్యే మాత్రమే. ఆఎమ్మెల్యేను కూడా తన పార్టీలోకి లాగేసుకుంటారన్నది పవన్ కల్యాణ్ భయంగా కన్పిస్తుంది. వైసీపీ నేతలపై అవినీతి ఆరోపణలు చేసేందుకు తన వద్ద ఏమీ అస్త్రాలు లేవని, వారు పనులు చేస్తే కదా? అవినీతి జరిగేది అంటూ పవన్ కల్యాణ్ సెటైర్ వేసినా అందులో నిజం లేకపోలేదు. కేవలం ఇసుక కొరత, అమరావతి రాజధాని మాత్రమే ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై పోరాటం చేసే అంశాలుగా నిలిచాయి.
ప్రతి అంశాన్ని….
ఇక చంద్రబాబు విషయానికొస్తే ఆయనకు ప్రతి అంశమూ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. ఇసుక కొరతపై ఈ నెల 14వ తేదీన ధర్నాకు దిగుతున్నారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతుందంటూ కొన్నాళ్లు ఆందోళన చేశారు. మరికొద్ది రోజులు విద్యుత్తు సమస్యపై ధ్వజమెత్తారు. ఆ తర్వాత రాజధాని అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. ఇప్పుడు వాటిని పక్కనపెట్టేసి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీని, తిరుమలలో అన్యమత ఉద్యోగుల అంశాలను ప్రచారఅస్త్రాలుగా చేసుకుంటున్నారు.
బలహీనతతోనేనా?
వైఎస్ జగన్ ను ఎదుర్కొనలేక బలహీనతతోనే చంద్రబాబు, పవన్ లు ఇలా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వైసీపీ నుంచి వస్తున్నాయి. ప్రధానంగా చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకుని రాజీనామా చేయిస్తారేమోనన్న భయమే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో గెలవడం కష్టమనేది ఆయన భావన అందుకే గొంతెత్తి అరుస్తున్నారంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా క్యాడర్ ను కాపాడుకునేందుకే వీధిపోరాటాలకు దిగుతున్నారంటున్నారు. మొత్తం మీద ఇద్దరూ భయపడే అరుస్తున్నట్లా? బలం లేకనే భరించకపోతున్నట్లా? అన్న సెటైర్లు విన్పిస్తున్నాయి.