అస్సలు అర్థం కావడం లేదే
రాజకీయాలకు రాజకీయాలు నేర్పే నాయకులు నేటి పార్టీల్లో కోకొల్లలుగా కనిపిస్తున్నారు. అధినేత మాట వినడం, అధిష్టానం చెప్పిన మాటకు కట్టుబడడం అనే సంస్కృతి దాదాపు తగ్గిపోయింది. నాయకులు [more]
రాజకీయాలకు రాజకీయాలు నేర్పే నాయకులు నేటి పార్టీల్లో కోకొల్లలుగా కనిపిస్తున్నారు. అధినేత మాట వినడం, అధిష్టానం చెప్పిన మాటకు కట్టుబడడం అనే సంస్కృతి దాదాపు తగ్గిపోయింది. నాయకులు [more]
రాజకీయాలకు రాజకీయాలు నేర్పే నాయకులు నేటి పార్టీల్లో కోకొల్లలుగా కనిపిస్తున్నారు. అధినేత మాట వినడం, అధిష్టానం చెప్పిన మాటకు కట్టుబడడం అనే సంస్కృతి దాదాపు తగ్గిపోయింది. నాయకులు చెప్పినట్టు, వారు నడిచినట్టే రాజకీయాలు ఉండాలనే పరిస్థితి ఉంటోంది. ఈ తరహా రాజకీయం దేశవ్యాప్తంగా అన్నిచోట్లా కనిపిస్తోంది. నాయకులు బలవంతులు అయినప్పుడు.. అధిష్టానం కూడా సాగిల పడుతున్న సందర్భాలు అనేకం కళ్లకుకడుతున్నాయి. ఒకప్పుడు పార్టీలు బలంగా ఉండేవి. జెండాను చూసి జనం ఓట్లు గుద్దేవారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. టీడీపీలో చంద్రబాబు కంటే నాయకులే బలంగా ఉన్నట్లు కన్పిస్తుంది.
నేతలను బట్టే…..
నాయకులు బలవంతులు అయ్యారు. పార్టీలకు వారే దిక్కవుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కూడా చాలా నియోజకవర్గాల్లో నాయకులను బట్టే.. పార్టీల అధినేతలు నిర్ణయం తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక, ఏపీ విషయానికి వస్తే.. ఈ తరహా పరిస్థితి టీడీపీలో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచాన్ని చదివిన టీడీపీ అధినేతకు ఈ పార్టీలోని తమ్ముళ్ల మనస్తత్వాన్ని అర్దం చేసుకోవడంలో డీలా పడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో అటు గెలిచిన వారు.. ఇటు ఓడిన వారు కూడా బాబుకు అర్ధం కావడంలేదు. వారు ఏం చేయాలని అనుకుంటున్నారో.. వారు ఏం చేస్తున్నారో..కూడా ఆయనకు అంతుపట్టడం లేదు.
వేటు వేద్దామనుకుంటే….
టీడీపీలోనే ఉంటారు.. పొగ పెడుతుంటారు. సరే! కదా.. వీరిపై వేటు వేద్దామనుకునేలోగా.. వచ్చి బాబుకు జై కొడతారు. హమ్మయ్య .. అంతా ఓకే అనుకునేలోగానే. మళ్లీ అదే సీన్.. వీరిని ఏం చేయాలి? ఇప్పుడు ఇదీ బాబుకు తలకు మించిన భారంగా పరిణమిస్తున్న విషయం. విజయవాడ సెంట్రల్ నుంచి పాతిక ఓట్ల తేడాతో ఓడిపోయిన బోండా ఉమా, విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని, గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ, అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి సోదరులు, పలమనేరులో ఓడిన అమన్నాథ్రెడ్డి, విజయనగరంలో ఓటమి చవిచూసిన అశోక్‌గజపతిరాజు తదితర నేతల వ్యూహ రాజకీయాలు.. బాబుకు చిర్రెత్తుకొస్తున్నాయి. వీరిని ఏం చేయాలి ? వదులుకుంటే.. భారీ నష్టం .. పోనీ వారంతట వారే వెళ్లిపోతే.. అది సాధ్యం కాదు. కానీ, కలిసి వస్తున్నారా? అంటే అదీలేదు. టీడీపీ కార్యక్రమాలకు పిలుపు ఇస్తున్నా పట్టించుకోవం లేదు. దీంతో వీళ్ల విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తెలియని పరిస్థితి. ఇదీ ఇప్పుడు బాబును పట్టి పీడిస్తున్న రాజకీయం. మరి ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.