ఒక దీక్ష.. రెండు దెబ్బలు.. వైసీపీ మైండ్ గేమ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇసుక కొరత పై దీక్ష చేస్తున్న సమయంలోనే విజయవాడలో రెండు ప్రధాన సంఘటనలు జరిగాయి. ఒకటి తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇసుక కొరత పై దీక్ష చేస్తున్న సమయంలోనే విజయవాడలో రెండు ప్రధాన సంఘటనలు జరిగాయి. ఒకటి తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇసుక కొరత పై దీక్ష చేస్తున్న సమయంలోనే విజయవాడలో రెండు ప్రధాన సంఘటనలు జరిగాయి. ఒకటి తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరతానని స్పష్టమైన ప్రకటన చేశారు. చంద్రబాబు పన్నెండు గంటల దీక్ష చేస్తున్న సమయంలోనే ఈ ప్రధాన సంఘటనలు జరగడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
ఇద్దరూ ఆ సామాజికవర్గం నేతలే…..
ఈ ఇద్దరు నేతలు ఒక సామాజిక వర్గానికి బలమైన నేతలు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతలే. ఆర్థికంగా, ఓటు బ్యాంకు పరంగా బలమైన లీడర్లు. బెజవాడ ప్రాంతంలో పట్టున్న నేతలే. అయితే చంద్రబాబు దీక్షకు దిగిన సమయంలోనే ఈ రెండు సంఘటనలు ఎందుకు జరిగాయన్నది టీడీపీ నేతలకు సయితం అర్థం కావడం లేదు. దేవినేని అవినాష్ విషయం తీసుకుంటే నెలన్నర రోజుల క్రితమే తెలుగు పోస్ట్ ఆయన పార్టీ మారుతున్నట్లు స్పష్టంగా తెలిపింది.
ఎంత బుజ్జగించినా…..
అయితే దేవినేని అవినాష్ ఆరోజు ఖండించారు. తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ప్రకటన చేశారు. ప్రకటన చేసిన నాటి నుంచి దేవినేని అవినాష్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన లేదు. దేవినేని అవినాష్ ను దేవినేని ఉమ వంటి నేతలు బుజ్జగించడంలో అప్పట్లో కొంత వెనక్కు తగ్గారు. కానీ తాజాగా దేవినేని అవినాష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కూడా పార్టీని వీడకుండా ఉండేందుకు చంద్రబాబు గట్టి ప్రయత్నమే చేశారు. కేశినేని నాని, కొనకళ్ల నారాయణలను రాయబారానికి పంపారు. కొంత మెత్తబడినట్లే కన్పించినా చివరకు చంద్రబాబు మీద విమర్శలకు దిగి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
అదే రోజు చేరికలంటే…..
చంద్రబాబును మానసికంగా దెబ్బతీసేందుకే మైండ్ గేమ్ లో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలకు తెరతీసిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. నిజానికి వల్లభనేని వంశీ రాజీనామా చేసి నెలరోజులకు పైగానే అయింది. అయితే అకస్మాత్తుగా చంద్రబాబు దీక్ష రోజునే ఆయన బయటకు వచ్చి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దేవినేని అవినాష్ చేరిక విషయాన్ని పెండింగ్ లో ఉంచిన వైసీపీ అధినాయకత్వం బాబు దీక్షరోజునే చేరికకు అనుమతివ్వడం కూడా చర్చనీయాంశమైంది. మొత్తం మీద బెజవాడ పొలిటిక్స్ లో ఒక బలమైన సామాజిక వర్గం నుంచి ఇద్దరు నేతలను వైసీపీ టీడీపీకి దూరం చేసింది.