చంద్రబాబు నాయుడు అదే చేస్తే పరిస్థితి ఏమిటి ?
ఐదు రోజుల పాటు నడిచిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసిపి ప్రతిపక్ష టిడిపిని అడుగడుగునా ఏకిపారేసింది. తద్వారా గతంలో తమకు జరిగిన పరాభవాల తాలూకా కడుపుమంట అంతా [more]
ఐదు రోజుల పాటు నడిచిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసిపి ప్రతిపక్ష టిడిపిని అడుగడుగునా ఏకిపారేసింది. తద్వారా గతంలో తమకు జరిగిన పరాభవాల తాలూకా కడుపుమంట అంతా [more]
ఐదు రోజుల పాటు నడిచిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసిపి ప్రతిపక్ష టిడిపిని అడుగడుగునా ఏకిపారేసింది. తద్వారా గతంలో తమకు జరిగిన పరాభవాల తాలూకా కడుపుమంట అంతా కక్కేసింది. ఫార్టీ ఇయర్స్ అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు కు అయితే జరగని అవమానం లేదు. అధికారపక్షం నుంచి ఎవరు లేచినా చంద్రబాబు నాయుడు ను దుమ్మెత్తి పోస్తూ ఆయన గతంలో చేసిన తప్పులను కడిగేస్తున్నారు. ఇది ఒక రకంగా భరించడం చాలా కష్టంగానే వుంది చంద్రబాబు కు. గతంలో పదేళ్ళు విపక్షంలో వున్నా రాజకీయాల్లో ఆయన సమకాలికులు వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారు తో పోరాడేవారు. ఇప్పుడు తన అనుభవం అంత లేని వైఎస్ జగన్ తో తలపడటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆయన.
ఇప్పుడే డుమ్మా కొడితే ....
రాబోయే రోజుల్లో అధికార టిడిపి తమకున్న అఖండ మెజారిటీ అండతో చంద్రబాబు నాయుడు ను ఇంటా బయట ముప్పుతిప్పలు పెట్టడం ఖాయమన్నది ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు చూసిన ఎవరికైనా ఇట్టే అర్ధమౌతుంది. దాంతో చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి డుమ్మా కొట్టక తప్పని పరిస్థితి ఎదురయ్యేలాగే వుంది. అలా ఇప్పుడే చేస్తే ఈర్ష్య అసూయలతో ఆయన ప్రజా పక్షాన పోరాటం వదిలి పారిపోయారని పెద్దఎత్తునే విమర్శలు చెలరేగే అవకాశాలు వున్నాయి. కష్టమో నష్టమో మరికొంత కాలం చూసి బాబు తమ సర్కార్ అధికారంలోకి వచ్చే వరకు అసెంబ్లీకి రామని చెప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.
వారి చరిష్మా ఏది ఇక్కడ ….
ఎన్టీఆర్, జయలలిత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లకు జన సమ్మోహన శక్తి అండగా వుంది. చంద్రబాబు నాయుడు కు మాస్ లీడర్ ఇమేజ్ లేదు. దాంతో అసెంబ్లీ వదిలి ఆయన వీధి పోరాటాలకు దిగే వయసు కాదు. ఎలా చూసినా భవిష్యత్తులో అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం చంద్రబాబు నాయుడు తీసుకునే అవకాశాలు లేవంటున్నారు మరికొందరు. కొడుకు లోకేష్ రాజకీయాల్లో అందిరాకపోవడంతో కడవరకు చంద్రబాబు తన పోరాటం కొనసాగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. వయోభారంతో ఉన్నప్పటికీ ఆయన ఫిట్ నెస్ ఎక్కడా ప్రస్తుతానికి చెక్కుచెదరలేదు. అయితే అధికారం కోల్పోవడంతో కొంత కుంగుబాటు బాబు లో కనిపిస్తుంది.
ప్రతిపక్షం లేకపోతే ….
ప్రతిపక్షం లేని సభను ఊహించలేరు. అధికారపార్టీ ఎంత గొంతు చించుకున్నా ప్రజల్లో సైతం పెద్దగా ఆ చర్చలు, ప్రసంగాలపై అస్సలు ఆసక్తే ఉండదు. అధికార పార్టీ హైలెట్ కావాలన్న, విపక్షం హైలెట్ అవ్వాలన్నా రెండు పక్షాల నడుమ చట్ట సభలో అర్ధవంతమైన చర్చలు సాగాలి. టిడిపి కూడా వైసిపి బాటలో అసెంబ్లీ బహిష్కరణ చేపడితే మాత్రం అధికారపక్షం ఢీలా పడే పరిస్థితే ఉంటుంది. అయితే జగన్ విపక్షంలో వున్నప్పుడు 23 ఎమ్యెల్యే లను చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారని అంటూ సరైన కారణంతోనే అసెంబ్లీకి డుమ్మా కొట్టేశారు. ఇలాంటి ఆయుధం కనుక బాబుకు కూడా దొరికిన రోజు టిడిపి సైతం వైసిపి టార్చర్ భరించలేక బయటకు పోవచ్చంటున్నారు విశ్లేషకులు. అయితే రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో కాలమే చెప్పాలి.