పార్టీ వెలుగు కోసం ప్రశాంత్ కిషోర్ వేటలో బాబు ?
ఆయన అపరచాణుక్యుడు, ప్రపంచ మేధావి, ఐటి ఆరాధ్యుడు ఇలా టిడిపి అనుకూల పత్రికలు తెలుగుదేశం అధినేతకు అవసరానికి మించి మరి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొట్టేవి. అవన్నీ [more]
ఆయన అపరచాణుక్యుడు, ప్రపంచ మేధావి, ఐటి ఆరాధ్యుడు ఇలా టిడిపి అనుకూల పత్రికలు తెలుగుదేశం అధినేతకు అవసరానికి మించి మరి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొట్టేవి. అవన్నీ [more]
ఆయన అపరచాణుక్యుడు, ప్రపంచ మేధావి, ఐటి ఆరాధ్యుడు ఇలా టిడిపి అనుకూల పత్రికలు తెలుగుదేశం అధినేతకు అవసరానికి మించి మరి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొట్టేవి. అవన్నీ నిజమని భావించిన చంద్రబాబు ఎన్నికల వ్యూహాల పై వ్యూహాలు రచించి అవన్నీ ఫెయిల్ అయి చివరికి ఘోరపరాజయాన్ని తద్వారా పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు టీం 23 తో చంద్రబాబు 151 వున్న సైన్యాన్ని ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించాలి. ఇది ఆయన ముందు వున్న సవాల్. దీనికోసం ఇప్పటినుంచి సరైన వ్యూహంతో టిడిపి ముందుకు సాగాలి. ఆ వ్యూహాలు బాబు రెడీ చేసే ఓపిక వయోభారం రీత్యా లేదంటున్నాయి టిడిపి లో కొందరు. లోకేష్ అనుభవరాహిత్యం తో పార్టీ నెగ్గుకు రావడం కష్టమని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆయన కావాలి ఆయన రావాలి అన్న మాట పసుపు దళంలో వినిపిస్తుంది. ఇంతకీ టిడిపి కోరుకుంటున్నది మొన్నటి ఎన్నికల్లో వైసిపికి సారధ్యం వహించి సర్వేలు, అభ్యర్థుల ఎంపిక ప్రజల్లోకి చొచ్చుకు పోయే వ్యూహాలు అందించిన ప్రశాంత్ కిషోర్ ను కావడం విశేషం.
పికేకి ఇప్పుడు యమా డిమాండ్ ….
వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కి ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. వైసిపి కి అఖండ విజయంలో పికె వెన్నెముకగా నిలవడంతో ఎపి ఎన్నికల ఫలితాల అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి ప్రశాంత్ కిషోర్ కి బంపర్ ఆఫర్ తగిలింది. ఎక్కడైనా, ఎవరైనా ప్రశాంత్ కిషోర్ ప్యాకేజ్ ఒకే చేసుకుంటే ఆయనకు ఏ పార్టీ అయినా ఒకటే ఆయన ఐ ప్యాక్ టీం వెంటనే రంగంలోకి దిగి పని మొదలు పెట్టేస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది బెంగాల్ ఎన్నికలు ముగిసిన అనంతరం అవసరమైతే మమతా బెనర్జీ తో రికమెండ్ చేయించి అయినా ప్రశాంత్ ను ఎపి టిడిపి వ్యూహకర్త గా నియమించాలని పార్టీ లో కొందరు తమ్ముళ్లు సూచిస్తున్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. అయితే దీన్ని పార్టీ మాత్రం అధికారికంగా ఖండిస్తోంది. సక్సెస్ మంత్రా ఎక్కడ వున్నా దాన్ని అమలు చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఈ నేపథ్యంలో ప్రశాంత్ ను వచ్చే ఎన్నికలకు తిరిగి జగన్ చెంతకు కనీసం చేరకుండా చేస్తే చాలని తమ వ్యూహకర్త కాకపోయినా ఫరవాలేదని పసుపుదళ మేధావుల ఆలోచన అంటున్నారు.
జగన్ ముందే చెప్పేశారు ….
టిడిపి నుంచి ఈ ఆఫర్లు వెళ్లినా వెళ్లకపోయినా వైఎస్ జగన్ ఎన్నికల ఫలితాల కు ముందే ప్రభుత్వం ఏర్పడ్డాకా కూడా ప్రశాంత్ కిశోర్ టీం సేవలు వైసిపి కి అవసరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ సరైన బాటలో పెట్టేందుకు నిత్యం జనాభిప్రాయాలను తెలుసుకునేందుకు తనతోనే వుండాలని వారితో మాట తీసుకున్నారు. ప్రశాంత్ ప్యాకేజీ రేటు ఎలా వున్నా వచ్చే ఎన్నికలకు పికె ఎటు ఉంటారన్నది ఇప్పటినుంచే చర్చనీయాంశంగా మారింది.