తండ్రీ కొడుకులు తొంగి చూడలేదుగా ?
అదేంటో ఏపీలో జగన్ అంటే పూనకం వచ్చినట్లుగా విరుచుకుపడిపోయే టీడీపీ పెత్తందార్లకు తామున్న చోట ఎన్నికల సమర నినాదాలు వినిపించకపోవడం వింతల్లోకెల్లా వింతే మరి. పైగా జాతీయ [more]
అదేంటో ఏపీలో జగన్ అంటే పూనకం వచ్చినట్లుగా విరుచుకుపడిపోయే టీడీపీ పెత్తందార్లకు తామున్న చోట ఎన్నికల సమర నినాదాలు వినిపించకపోవడం వింతల్లోకెల్లా వింతే మరి. పైగా జాతీయ [more]
అదేంటో ఏపీలో జగన్ అంటే పూనకం వచ్చినట్లుగా విరుచుకుపడిపోయే టీడీపీ పెత్తందార్లకు తామున్న చోట ఎన్నికల సమర నినాదాలు వినిపించకపోవడం వింతల్లోకెల్లా వింతే మరి. పైగా జాతీయ పార్టీ ఆయే. అంతకంటే ముందు తొమ్మిదేళ్ల పాటు ఉమ్మడి ఏపీని ఏలిన చరిత్ర ఉందాయే. అయినా సరే తెలంగాణాలో నో సౌండ్. తెలుగుదేశం వల్లభుడి విచిత్ర రాజకీయం అంటే ఇదే మరి. ఆయన గారి వారసుడు, భావి అధినాయకుడు సంగతి సరే సరి. గ్రేటర్ హైదరాబాద్ గుండా తన కారును పోనిచ్చేసి మరీ ఏదో అర్జంటు పని ఉన్నట్లుగా విజయవాడకు ఎంచక్కా వచ్చేశాడుగా.
ఆ చేదు అనుభవంతోనా…?
సరిగ్గా అయిదేళ్ళ క్రితం వెనక్కు వెళ్తే అపుడు జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఒక వైపు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వారసుడు కేటీయార్ ఓ వైపు, మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వారసుడు లోకేష్ ఇంకో వైపు మోహరించిన అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. నువ్వా నేనా అన్నట్లుగా ఇద్దరు కుమార రాజాలు చెడ తిరిగారు. కలివిడిగా గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. కేటీయార్ చేసిన ప్రచారానికి టీయారెస్ కి 99 సీట్లు దక్కితే. ఆ ఒక్క సీటు పట్టుకుని చంద్రబాబు వారసుడు చతికిలపడ్డాడు. దాంతో అదొక పీడకలగా మారి మళ్లీ లోకేష్ తెలంగాణ వైపు చూస్తే ఒట్టు పెట్టుకున్నాడని అంటారు.
ఆ గొంతు ఏమయిందో …?
చంద్రబాబు అయితే హైదరాబాద్ ని నేనే కట్టాను అంటారు. రాజధాని రాచ ఠీవి అంతా తన చలవే అంటారు. అపరసృష్టి కర్తను తానేనని డప్పు కొట్టుకుని మరీ చెప్పుకు తిరిగారు. అటువంటి చోట గ్రేటర్ ఎన్నికలు జరిగితే మీ ప్రతాపమో మా ప్రతాపమో అని ఎందుకు గర్జించలేకపోతున్నారు అన్నదే ప్రశ్న. తెలంగాణాలో పార్టీని అలా గాలికొదిలేసి తనకేం సంబంధం లేనట్లుగా చంద్రబాబు చోద్యం చూస్తున్నారని అక్కడ ఉన్న తమ్ముళ్లే గోడుమంటున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామంటే సరేనన్న చంద్రబాబు ఆ మీదట తాను కానీ కొడుకు లోకెష్ బాబు కానీ ప్రచారానికి రాకుండా బలి పశువులను చేశారని బిగ్గరగా రోదిస్తున్నారు అంటే జాలి పడాల్సిందేగా.
అలా వాడేస్తున్నారుగా….
వాడడం అంటూ మొదలుపెడితే చంద్రబాబు తరువాతే అని అంటారు ఎవరైనా. అందులోనూ తన పర భేదం లేకుండా బాబు వాడేస్తారని సెటైర్లు కూదా పడతాయి. ఇక చిత్రమేంటంటే తాను జాతీయ అధ్యక్షుడిని అనిపించుకోవడానికి షోకేసులో బొమ్మలా తెలంగాణాలో పార్టీని బాబు అలా ఉంచారని కూడా విమర్శలు వస్తున్నాయి. పైగా వందల కోట్లతో కట్టిన ఎన్టీఆర్ భవనానికి కూడా కాస్తా సందడి కావాలిగా. అందుకే అక్కడో కమిటీ, కార్యవర్గం అంటూ హడావుడి చేస్తున్నారు అంటున్నారు. మొత్తానికి జాతీయ పార్టీ అని చెప్పుకునే ఏ రాజకీయ నేత కూడా ఇలా తమ పార్టీని గాలికి వదిలేయడు అన్న కామెంట్స్ పడుతున్నాయంటే తెలుగు వల్లభుడు కాసింతైనా మనసు పెట్టి ఆలోచించాల్సిందేగా.