బాబు విషయంలో జగన్ ది భ్రమేనా?
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలంటే ఎవరైనా ప్రియమైన వారి కంటే ప్రత్యర్ధులనే ఎక్కువగా తలచుకుంటారు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ పేరు రోజుకు ఎన్నిసార్లు వల్లిస్తారో [more]
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలంటే ఎవరైనా ప్రియమైన వారి కంటే ప్రత్యర్ధులనే ఎక్కువగా తలచుకుంటారు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ పేరు రోజుకు ఎన్నిసార్లు వల్లిస్తారో [more]
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలంటే ఎవరైనా ప్రియమైన వారి కంటే ప్రత్యర్ధులనే ఎక్కువగా తలచుకుంటారు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ పేరు రోజుకు ఎన్నిసార్లు వల్లిస్తారో తెలియదు కానీ జగన్ అంటూ అదే పనిగా జపం చేస్తారు. ఇక జగన్ విషయానికి వస్తే ఆయనకు చంద్రబాబే ఎటు చూసినా కనిపిస్తున్నారు. చంద్రబాబును తలచుకుని తొడగొట్టిన జగన్ కి ఒకనాడు అది బలం అయింది. ఇపుడు అదే అతి పెద్ద మైనస్ అవుతోంది అంటున్నారు.
నీడను చూసి….
చంద్రబాబునే మననం చేసుకుంటూ జగన్ ఎంతదాకా వెళ్ళారంటే వ్వక్తులను దాటేసి వ్యవస్థలలోనూ చంద్రబాబును చూస్తున్నారు. తనకు అడ్డం తిరిగిన ప్రతి పనిలోనూ చంద్రబాబు హస్తం ఉందని తలపోస్తున్నారు. తాను ఎక్కడ ఫెయిల్ అయినా దానికి చంద్రబాబే కారణమని ఆడిపోసుకుంటున్నారు. బాబే అన్నీ చేయిస్తున్నారని, ఆయనే తెర వెనక చక్రం తిప్పుతున్నారు అని జగన్ అనుమానిస్తూ ఇపుడు తన కంటే ఎక్కువగా చంద్రబాబు ను చేసి జనాలకు చూపిస్తున్నారు.
చేతిలో అధికారం….
ఇక గత ఇరవై నెలలుగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కనుసన్ననలోనే పాలన మొత్తం సాగుతోంది. చంద్రబాబు ఒక మాజీ ముఖ్యమంత్రి. పైగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ సీట్లకు చంద్రబాబు పార్టీ పడిపోయింది. ఇక కేంద్రంలోని బీజేపీ అయితే బాబుకు ఏ మాత్రం సహకరించడంలేదు. చంద్రబాబు ను దూరంగానే బీజేపీ పెద్దలు నేటికీ ఉంచారు. పార్టీ ప్రభ కూడా నానాటికీ దిగజారుతోంది. కుమారుడు లోకేష్ ఎక్కడా అందుకురావడంలేదన్న బాధ బాబులో ఉంది. మరి ఇంతలా టీడీపీ చితికి కళ్ల ముందు ఉంటే ఆ పార్టీ నేతల కంటే ఎక్కువగా జగన్ తలచడమే కాదు, చంద్రబాబు వ్యవస్థలను మ్యానేజ్ చేసే అపర చాణక్యుడు అంటూ తనకు తెలియకుండానే కొత్త క్రెడిట్లు ఆయనకు అంటగడుతున్నారు. దాంతో బాబు గొప్పతనం చెప్పకుండానే జగనే తమ్ముళ్ళకు చెబుతున్నట్లుగా ఉంది.
భ్రమలలోలేనా…?
నిజానికి చంద్రబాబు కు వ్యవస్థలలోని కీలకమైన వ్యక్తులతో కొన్ని తెర వెనక బంధాలు ఉన్నాయని అంటారు. అయితే ఏ బంధం అయినా అధికారం, డబ్బు ముందు ఏ మాత్రం పనికిరాదు. చంద్రబాబు ఇపుడు విపక్షంలో ఉన్నారు. ఇప్పటికిపుడు ఆయన ఎవరికీ ఏమీ చేసే ప్రత్యుపకారం లేదు. ఇక మరోసారి ఎన్నికల్లో ఆయన నెగ్గుతారు అన్న నమ్మకం సొంత పార్టీకే లేని వేళ పలు వ్యవస్థలలోని కీలకమైన వ్యక్తులు హై రిస్క్ లో పడి తమకు తాము ఇబ్బంది పెట్టుకుని మరీ బాబుకు మేలు చేస్తారా అన్నది లాజిక్ గా ఆలోచిస్తే తట్టే పాయింట్. ఏపీలో ఏది జరిగినా దాని వెనక చంద్రబాబు ఉన్నాడు అన్నది జగన్ భ్రమ కూడా కావచ్చు అంటున్నారు. ఎంత తొందరగా జగన్ ఈ భ్రమల నుచ్ని బయటకు వస్తే అంత తొందరగా ఆయనకూ పార్టీకి మేలు జరుగుతుంది అన్నది పార్టీ నేతల వాదన కూడా. ఇక న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదు, అలాగే తన సర్కార్ లోని లోపాలను ముందు గుర్తించాలి. రాజ్యాంగబద్దంగా నిర్ణయాలు ఉండేలా చూసుకోవాలి. అంతే తప్ప చంద్రబాబు పేరు చెప్పి విమర్శలు చేయడం వల్ల అంతిమంగా అది టీడీపీకే మేలు చేస్తుంది అని జగన్ గుర్తించాలి.