కార్పొరేట్ పాలిటిక్స్ కాదు.. ఇద్దరికీ ఎంత తేడా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుది తొలి నుంచి కార్పొరేట్ పాలిటిక్స్. ఆ స్టయిల్ లోనే ఆయన రాజకీయాలు చేస్తారు. కానీ జగన్ మాత్రం దీనికి విరుద్ధం. ఏదైనా [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుది తొలి నుంచి కార్పొరేట్ పాలిటిక్స్. ఆ స్టయిల్ లోనే ఆయన రాజకీయాలు చేస్తారు. కానీ జగన్ మాత్రం దీనికి విరుద్ధం. ఏదైనా [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుది తొలి నుంచి కార్పొరేట్ పాలిటిక్స్. ఆ స్టయిల్ లోనే ఆయన రాజకీయాలు చేస్తారు. కానీ జగన్ మాత్రం దీనికి విరుద్ధం. ఏదైనా పదవుల భర్తీలో జగన్, చంద్రబాబులు సామాజిక వర్గాలను ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ అందులో చంద్రబాబు ఎంపిక వేరేలా ఉండేది. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా అప్పటికప్పుడు పార్టీలో వచ్చి చేరిన వారికి చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ జగన్ మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో పాటు విధేయులకు పెద్దపీట వేస్తారు.
బాబు హయాంలో…..
చంద్రబాబు హయాంలో పదవుల పంపిణీ చేశారు. రాజ్యసభ స్థానాలను, ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేశారు. పార్టీ మారి వచ్చిన వెంటనే డొక్కా మాణిక్యవరప్రసాద్ కు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అలాగే టీజీ వెంకటేష్ కు కూడా రాజ్యసభ పదవి ఇచ్చారు. ఈ రెండు పదవుల ఎంపికలో కేవలం సామాజిక సమీకరణాలు మాత్రమే కాకుండా పార్టీకి లబ్ది చేకూర్చేలా, నిధులు సమకూరేలా చంద్రబాబు పదవులను భర్తీ చేశారని అప్పట్లో విమర్శలు వచ్చాయి.
ఇద్దరూ పార్టీని వీడి….
ఆ తర్వాత డొక్కా మాణిక్య వరప్రసాద్, టీజీ వెంకటేష్ లు ఇద్దరూ పార్టీని విడిచి వెళ్లిపోయారు. పోతుల సునీత సయితం పార్టీని వీడారు. విధేయతకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే పార్టీ అధికారంలో లేని సమయంలో ఉపయోగం లేకుండా పోయింది. విదేయతగా ఉన్న వర్ల రామయ్య వంటి వారిని చంద్రబాబు విస్మరించడం కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. చంద్రబాబు పదవుల భర్తీలో ఈక్వేషన్లు వేరేగా ఉంటాయంటున్నారు. పార్టీకి, తనకు ఉపయోగపడే నేతలనే ఎంపిక చేసుకుంటారు.
విధేయతను చూసే….?
కానీ జగన్ మాత్రం ఇందుకు విరుద్ధం. ఇప్పటివరకూ భర్తీ చేసిన పదవుల విషయంలో కేవలం విధేయతకే పెద్దపీట వేస్తున్నారన్నది వాస్తవం. చంద్రబాబు తాను అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక మైనారిటీ వర్గానికి పదవులు ఇవ్వలేదు. మంత్రి పదవిని పక్కన పెట్టినా ఎమ్మెల్సీగా ఒక్క షరీఫ్ కే అవకాశం ఇచ్చారు. కానీ జగన్ మాత్రం ముగ్గురు మైనారిటీలకు పదవులు ఇచ్చారు. మంత్రి వర్గంలో చోటు కల్పించారు. ఇలా చంద్రబాబు కార్పొరేట్ స్టయిల్ లో పదవులను భర్తీ చేస్తుంటే, జగన్ మాత్రం పూర్తిగా కిందిస్థాయి నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.