చంద్రబాబు అదే చేస్తే…?
అమరావతి తో సహా మూడు రాజధానులు అంటూ టిడిపి స్వప్నాన్ని సాంతం కూల్చేసిన జగన్ సర్కార్ దూకుడు కి కోర్టు ద్వారానే చెక్ పెట్టాలని ప్రధాన విపక్షం [more]
అమరావతి తో సహా మూడు రాజధానులు అంటూ టిడిపి స్వప్నాన్ని సాంతం కూల్చేసిన జగన్ సర్కార్ దూకుడు కి కోర్టు ద్వారానే చెక్ పెట్టాలని ప్రధాన విపక్షం [more]
అమరావతి తో సహా మూడు రాజధానులు అంటూ టిడిపి స్వప్నాన్ని సాంతం కూల్చేసిన జగన్ సర్కార్ దూకుడు కి కోర్టు ద్వారానే చెక్ పెట్టాలని ప్రధాన విపక్షం గట్టిగానే సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు వైసిపి సర్కార్ కి ఇప్పటికే సంకేతాలు అందడం తో రాజధానుల ప్రకటనపై ఆచితూచి అడుగులు వేసి శుభం కార్డు వేసేలా కార్యాచరణ చేపట్టిందన్న టాక్ నడుస్తుంది. విపక్ష నేత చంద్రబాబు అండ్ టీం కి న్యాయవ్యవస్థ ను ఎక్కడ ఎలా ఉపయోగించాలన్న దానిపై దేశంలో ఎవరికి లేని ట్రాక్ రికార్డ్ వుంది. అందుకే వ్యవస్థలను మ్యానేజ్ చేయడం చంద్రబాబు కి వెన్నతో పెట్టిన విద్య అని వైసిపి పదేపదే ఆరోపిస్తూ వచ్చే అంశమే. చంద్రబాబు జ్యుడీషియరీ మేనేజ్ మెంట్ కాజాలను ఇప్పటికే వైసిపి గట్టిగానే రుచి చూసిన అనుభవంతో రాబోయే పరిణామాలను అంచనా వేసి అందుకు అనుగుణమైన అడుగులు వేసేందుకు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది.
విశాఖ రాజధాని కాకుండా….
విశాఖను రాజధాని కానీయకుండా చంద్రబాబు కుట్ర మొదలు పెట్టేశారని వైసిపి ప్రచారం స్టార్ట్ చేసేసింది. ఎంపి విజయసాయి రెడ్డి ఈ అనుమానాన్ని విశాఖ వేదికగానే వ్యక్తం చేసేసారు. న్యాయస్థానాలను మ్యానేజ్ చేయడం చంద్రబాబు కి అలవాటేనని ఆయన ఎదో ఒకటి కోర్టు ద్వారా చేసి బ్రేక్ వేయాలని చూస్తున్నారంటూ సాయి రెడ్డి బాంబు పేల్చి కొత్త చర్చకు తెరలేపారు. అయితే ముఖ్యమంత్రి జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ను రాజధాని చేసితీరుతారని చెప్పడం ద్వారా టిడిపి వర్గాల్లో రెండు రకాల ఆందోళనలను రేకెత్తించారు. ఉత్తరాంధ్ర కు రాజధాని తరలి రావడం చంద్రబాబు కి ఇష్టం లేదనే ప్రచారం ద్వారా రాజకీయ లబ్ది వైసిపి కి వస్తుంది. అదే విధంగా త్రి క్యాపిటల్స్ ప్రకటన ఆలస్యం అయితే దానికి కారణం చంద్రబాబే అన్నది ప్రజల్లోకి తేవాలని వైసిపి భావిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
చూస్తూ ఊరుకునేది లేదంటున్న …
విజయసాయి అనుమానాలు అలా ఉంటే టిడిపి నేతలు కోర్టు మెట్లు ఎక్కేందుకు సన్నాహాలు మొదలు పెట్టినట్లు స్పష్టం అయిపోతుంది. ఇప్పటికే దేవినేని ఉమ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కనకమేడల వంటివారు న్యాయపోరాటానికి దిగుతామనే సంకేతాలు ఇచ్చేశారు. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే దానిని అడ్డుకునేందుకు వున్న ప్రధాన అవకాశం న్యాయస్థానమే అని టిడిపి భావిస్తుంది. దీనికి అవసరమైన డాక్యుమెంట్లను ఒక పక్క సిద్ధం చేసేస్తోంది. గత ప్రభుత్వం రాతపూర్వకంగా రైతులకు ఇచ్చిన హామీలను సీఆర్డీఏ ఇచ్చిన రాతపూర్వక హామీలతో కూడిన దస్తావేజులను పరిశీలించి న్యాయనిపుణులతో సుదీర్ఘ భేటీ ని నేతలు సాగిస్తున్నారని తెలుస్తుంది. అయితే త్రి క్యాపిటల్స్ పై టిడిపి ఎలాంటి పోరాటం చేసినా రాజకీయంగా ఆ పార్టీకి మైనస్ నే అవుతుందని వైసిపి లెక్కేసుకుంటుంది. సాధ్యమైనంత నాయపరమైన చిక్కులు ఎదురుకాకుండానే వ్యవహారం సాగించాలనే కార్యాచరణ తో జగన్ సర్కార్ ముందుకు వెళుతున్నట్లు తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరగనుందో చూడాలి.