బాబు టీం కు మరో దారి లేదా?
వైసిపి సర్కార్ అనుకున్నట్లే రాజధాని తరలింపు తో టిడిపి ముద్ర చెరపడానికి రంగం సిద్ధం చేసేసింది. దాంతో అటు రాజకీయంగా ఇటు ఆర్ధికంగా మరోపక్క దేశవ్యాప్తంగా చంద్రబాబు [more]
వైసిపి సర్కార్ అనుకున్నట్లే రాజధాని తరలింపు తో టిడిపి ముద్ర చెరపడానికి రంగం సిద్ధం చేసేసింది. దాంతో అటు రాజకీయంగా ఇటు ఆర్ధికంగా మరోపక్క దేశవ్యాప్తంగా చంద్రబాబు [more]
వైసిపి సర్కార్ అనుకున్నట్లే రాజధాని తరలింపు తో టిడిపి ముద్ర చెరపడానికి రంగం సిద్ధం చేసేసింది. దాంతో అటు రాజకీయంగా ఇటు ఆర్ధికంగా మరోపక్క దేశవ్యాప్తంగా చంద్రబాబు అండ్ టీం ఐదేళ్ళపాటు సాగించిన ప్రచారం కృష్ణ లో కలిసిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేసి అదిగో అమరావతి ఇదిగో అమరావతి అంటూ చంద్రబాబు హోరెత్తించారు. పబ్లిసిటీ కి ఆయన పెట్టిన ఖర్చు ను అమరావతి లో ఖర్చు పెట్టి ఉంటే కొన్ని శాశ్వత భవనాలైనా సమకూరి ఉండేవన్న విమర్శలు ఉన్నాయి. అంత పెద్ద ఎత్తున ప్రచారం సాగించి తీరా ఏది పూర్తి చేయలేక పోవడంతో ఇప్పుడు జగన్ సర్కార్ మూడు రాజధానుల మాట ఎలా ఉన్నా చంద్రబాబు చేసింది ముమ్మాటికీ తప్పేనన్న అభిప్రాయం టిడిపి లో కూడా వ్యక్తం అయ్యే పరిస్థితి దాపురించింది.
అంత దమ్ముందా … ?
అమరావతి లోనే రాజధాని ఉండాలి అన్న డిమాండ్ త్రికరణ శుద్ధిగా టిడిపి నమ్మితే మొత్తం పార్టీలో గెలిచిన ఎమ్యెల్యేలంతా రాజీనామా చేయాలి. అలా చేసి తిరిగి ఎందరు గెలిచే అవకాశం ఉంటుంది. ఇందులో సగం పైగా ఓడిపోతే ఉన్న ప్రతిపక్ష హోదా కూడా పోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా పోరాటం పోరాటం అంటూ ప్లే కార్డు లు పట్టుకుని, చెప్పులతో కొట్టుకుంటూ ఎన్ని రోజులు ఉద్యమం నడిపినా ప్రయోజనం ఉండేలా కనిపించడం లేదు. ఏదైనా ఉద్యమం దీర్ఘ కాలం సాగితే దాన్ని ఎలా సమర్ధవంతంగా అణచివేయాలో చంద్రబాబు కాపు ఉద్యమం లో చేసి జగన్ కి మార్గదర్శిగా నిలిచారు. తీవ్ర భావోద్వేగంతో కూడిన సున్నితమైన కాపు ఉద్యమాన్ని చంద్రబాబు సర్కార్ గతంలో వ్యూహాత్మకంగా ఎదుర్కొంది.
జగన్ సర్కార్ ధీమా అదే …
ఆ అనుభవాల రీత్యానే జగన్ కేవలం 29 గ్రామాలకు పరిమితం అయిన రాజధాని ఉద్యమాన్ని తొలినుంచి పట్టించుకోవడమే లేదు. దాంతో బాటు కరోనా రూపంలో జగన్ సర్కార్ కి మరింత అవకాశం కలిసి వచ్చింది. రాజధాని ప్రాంతంలో కానీ మరేచోట ఏమి చేయాలన్నా నిబంధనలకు అనుగుణంగానే నిరసనలు సాగాల్సి ఉంది. దాంతో పాలకపక్షానికి పెద్ద గా నిరసనల సెగ కరోనా రక్కసి తొలగేదాకా తగిలే అవకాశాలే లేవు. ఈ నేపథ్యంలో చంద్రబాబు టీం కి దారి కనిపించడం లేదు. మరోపక్క రాబోయే రోజుల్లో ఒక్కో కార్యాలయం విశాఖకు తరలిపోతే ఉద్యమకారులు ప్రభుత్వంతో చర్చలు జరుపుకుని ఎదో ఒక లబ్ది పొందే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.