ఆ నలుగురి కోసం…?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 మంది సభ్యులుంటారు. ఇందులో పది శాతం అంటే పద్ధెనిమిది మంది ఉంటేనే ఎవరికైనా ప్రతిపక్ష హోదా దక్కుతుంది. చంద్రబాబుకు 23 మంది [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 మంది సభ్యులుంటారు. ఇందులో పది శాతం అంటే పద్ధెనిమిది మంది ఉంటేనే ఎవరికైనా ప్రతిపక్ష హోదా దక్కుతుంది. చంద్రబాబుకు 23 మంది [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 మంది సభ్యులుంటారు. ఇందులో పది శాతం అంటే పద్ధెనిమిది మంది ఉంటేనే ఎవరికైనా ప్రతిపక్ష హోదా దక్కుతుంది. చంద్రబాబుకు 23 మంది ఎమ్మెల్యేలు ఉండటంతోనే ప్రతిపక్ష హోదా దక్కింది. ఇప్పుడు వల్లభనేని వంశీ పార్టీని వీడటం, గంటా శ్రీనివాసరావు పార్టీకి దూరం కావడంతో ఇక ఆరుగురి దగ్గర ఆగిపోయింది. మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు జారుకుంటే చంద్రబాబు ప్రతిపక్ష హోదాను కోల్పోతారు. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో టెన్షన్ గా ఉంది.
వంశీ వీడటంతోనే….
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేేని వంశీ పార్టీని వీడటం తెలుగుదేశం పార్టీని ఒక కుదుపు కుదిపేసిందనే చెప్పాలి. మొత్తం 23 మంది శాసనసభ్యుల్లో సగం మంది అంటే 11 మంది వరకూ కమ్మ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలో ఉన్నారు. ఇది చంద్రబాబుకు తొలి నుంచి ఊరట కల్గించే అంశం. ఎందుకంటే తనను కాదని వారు ఇతర పార్టీలకు వెళ్లరన్నది చంద్రబాబు నమ్మకం. విశ్వాసం. అయితే వల్లభనేని వంశీ వెళ్లిపోవడంతో ఆ ఆశ కూడా గల్లంతయింది.
వైసీపీ గట్టిగానే…..
మరో నలుగురు శాసనసభ్యుల కోసం వైసీపీ గట్టిగానే వల విసురుతున్నట్లు తెలుస్తోంది. కొందరిపై వత్తిడి తేవడం ద్వారా, మరికొందరిని ఆకర్షించడం ద్వారా పార్టీలోకి తెచ్చుకోవాలన్నది వైసీపీ వ్యూహంగా కన్పిస్తుంది. ఇప్పటికే కోస్తా జిల్లాలకు చెందిన ఇద్దరు శాసనసభ్యులు వైసీపీకి టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు మరో ఇద్దరు కూడా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే జంప్ చేసేందుకు రెడీ గా ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో ఒకరు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారే అని తెలియడంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు.
వారిని కాపాడుకునేందుకు…..
గతంలో 23 మంది ఎమ్మెల్యేలను సులువుగా వైసీపీ నుంచి తన పార్టీలోకి తీసుకున్న చంద్రబాబుకు ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కత్తిమీద సామే అయింది. ప్రతిపక్ష హోదా కోల్పోతే పార్టీలో ఉన్న కొద్దిమంది ఉండరు. పరువు కోల్పోక తప్పదు. సానుభూతి వచ్చే అవకాశమున్నప్పటికీ నాలుగున్నరేళ్లు ప్రతిపక్ష హోదా లేకుండా ఉండటం చంద్రబాబుకు కష్టమే. అందుకే ఆయన ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ జారిపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వారికి ఉన్న అన్ని ఇబ్బందులను తొలగించేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు.