ఊహించని షాక్…. తేరుకోలేకపోతున్నారా?
రెండేళ్ల నుంచి న్యాయస్థానాల తీర్పులతో చంద్రబాబు ఊరట చెందుతూ వస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దాదాపు 70 కి పైగా కేసుల్లో న్యాయస్థానం జగన్ [more]
రెండేళ్ల నుంచి న్యాయస్థానాల తీర్పులతో చంద్రబాబు ఊరట చెందుతూ వస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దాదాపు 70 కి పైగా కేసుల్లో న్యాయస్థానం జగన్ [more]
రెండేళ్ల నుంచి న్యాయస్థానాల తీర్పులతో చంద్రబాబు ఊరట చెందుతూ వస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దాదాపు 70 కి పైగా కేసుల్లో న్యాయస్థానం జగన్ కు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. చంద్రబాబు పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే తొలిసారి ఇరవై నెలల్లో చంద్రబాబుకు కోర్టు తీర్పు ఇబ్బందిగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల కు వెళ్లి పార్టీని మరింత బలోపేతం చేద్దామనుకున్న చంద్రబాబుకు హైకోర్టు తీర్పు షాక్ కు గురిచేసిందనే చెప్పాలి.
ఊహించ లేదట….
చంద్రబాబు సయితం ఇది ఊహించలేదు. ఒకసారి షెడ్యూల్ విడుదలయిన తర్వాత రద్దు చేయడమనేది అసాధరణం. పంచాయతీ ఎన్నికల విషయంలోనూ అదే జరుగుతుందని చంద్రబాబు అంచనా వేశారు. దీంతో ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని స్వాగతించారు. అంతేకాదు వైసీపీ ఎన్నికలకు భయపడుతుందని సవాల్ కూడా విసిరారు. గతంలో జరిగిన ఏకగ్రీవాలను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుపై ఎటూ మాట్లాడలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో…..
వాస్తవానికి చంద్రబాబు వ్యవస్థలను మానేజ్ చేస్తారన్న వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిళ్లలో విన్పిస్తాయి. తొలినుంచి అన్ని వ్యవస్థలను మానేజ్ చేయడం వల్లనే చంద్రబాబు ఈస్థాయికి ఎదిగారని అందరూ అంటారు. కానీ అలాంటి చంద్రబాబుకు ఇప్పుడు తొలి దెబ్బ తగిలింది. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేసినప్పుడు కూడా స్వాగతించారు. ఇప్పుడు షెడ్యూల్ విడుదల చేస్తే మళ్లీ వెల్ కమ్ చెప్పారు.
పంతానికి పోయి…..
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉన్న సమయంలో ఎన్నికలకు వెళ్లకూడదని ప్రభుత్వం భావిస్తుంది. ఆయన ఉండగానే ఎన్నికలు జరగాలని చంద్రబాబు గట్టిగా కోరుకున్నారు. గత కొన్ని నెలలుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక చంద్రబాబు ఉన్నారన్న ప్రచారాన్ని ప్రజల్లోకి వైసీపీ బాగా తీసుకెళ్లగలిగింది. దీంతోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న ప్రతి నిర్ణయం వివాదంగానే కన్పించింది. మొత్తం మీద హైకోర్టు తీర్పుతో చంద్రబాబు సమాధానమిచ్చుకోలేని స్థితిలోకి వెళ్లారు.