ఈసారి అక్కడ గెలుపు సులువేనట.. బాబు ధైర్యమదేనట
టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తన సొంత జిల్లా కావడంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జిల్లాపై పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే [more]
టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తన సొంత జిల్లా కావడంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జిల్లాపై పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే [more]
టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తన సొంత జిల్లా కావడంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జిల్లాపై పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబుకు కొంత అడ్వాంటేజీ అయితే ఈసారి ఉంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలుగా రెండుసార్లు గెలిచిన వారు అనేక మంది ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంది. వాటిని క్యాష్ చేసుకుని పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు పార్టీనేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఎమ్మెల్యేల్లో అసంతృప్తి….
చిత్తూరు జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. అదీ చంద్రబాబు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలోనే. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే 2014, 2019 ఎన్నికలలో వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని చంద్రబాబు గుర్తించారు. వీటితో పాటు బలమైన నేతలు అమర్ నాధ్ రెడ్డి, సుగుణమ్మ వంటి వారు ఈసారి ఎన్నికల్లో గెలుస్తారని అంచనా వేస్తున్నారు.
ఈ ఐదు నియోజకవర్గాలే టార్గెట్…
చిత్తూరు జిల్లాలో నగరి, పీలేరు, చంద్రగిరి, గంగాధర నెల్లూరు, పుంగనూరు నియోజకవర్గాలున్నాయి. నగరిలో 2014, 2019 ఎన్నికల్లో ఆర్కే రోజా గెలిచారు. అక్కడ వైసీపీలో విభేదాలు తలెత్తాయి. ఇక చంద్రగిరిలో రెండు దఫాలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో మూడు సార్ల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే గెలుపుగా ఉంది. ఇక గంగాధర నెల్లూరులో నారాయణస్వామి కూడా రెండు సార్లు విజయం సాధించారు. పీలేరులో చింతల రామచంద్రారెడ్డి కూడా రెండు సార్లు విజయం సాధించారు. వీరంతా వచ్చే ఎన్నికలలో హ్యాట్రిక్ విజయం కోసం కృషి చేయాలి.
నియోజకవర్గాల్లోనే ఉండాలని….
ఈ ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలను చంద్రబాబు అలెర్ట్ చేశారు. పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండటంతో సహజంగా ఉండే వ్యతిరేకతను సానుకూలంగా మలచుకోవాలని సూచించారు. నిత్యం నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై స్పందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కొంచెం కష్టపడితే ఇక్కడ సులువుగా గెలుపు సాధించవచ్చని నేతలకు చంద్రబాబు నూరిపోస్తున్నారు. నియోజకవర్గంలోనే ఎక్కువ సమయం ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చంద్రబాబు వారికి సూచించారు. ఈసారి ఎలాగైనా వైసీపీ నేతల హ్యాట్రిక్ విజయాలను ఆపాలని చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారు.