కలవరం…గడ్డుకాలం
టిడిపి లో ఇప్పుడు తీవ్ర కలవరం మొదలైంది. ఒక పక్క ఢిల్లీ లో జగన్ టూర్ సక్సెస్ ఒక పక్క, మరోపక్క అమరావతి ఉద్యమానికి స్పందన లేకపోవడంతో [more]
టిడిపి లో ఇప్పుడు తీవ్ర కలవరం మొదలైంది. ఒక పక్క ఢిల్లీ లో జగన్ టూర్ సక్సెస్ ఒక పక్క, మరోపక్క అమరావతి ఉద్యమానికి స్పందన లేకపోవడంతో [more]
టిడిపి లో ఇప్పుడు తీవ్ర కలవరం మొదలైంది. ఒక పక్క ఢిల్లీ లో జగన్ టూర్ సక్సెస్ ఒక పక్క, మరోపక్క అమరావతి ఉద్యమానికి స్పందన లేకపోవడంతో ఇంకో పక్క ఎన్డీయే లో చేరితే తప్పేంటి అంటూ వైసిపి నేతలనుంచి వస్తున్న వ్యాఖ్యలు తమ సన్నిహితులపై జరుగుతున్న ఐటి దాడులు దీనికి ప్రధాన కారణంగా మారాయి. దీంతో కిం కర్తవ్యం అన్నది టిడిపి అధిష్టానం ముందు ప్రశ్నగా తయారైంది. అన్ని వైపులా వస్తున్న వత్తిడి నుంచి బయటపడటానికి సరైన వ్యూహాలకు కసరత్తును పసుపుకోటలో వ్యూహకర్తలు చేస్తున్నారు. అయితే ఈ వ్యూహాలమాట ఎలా ఉన్నా ఇంకోపక్క ప్రజల్లోకి వెళ్లేందుకు అధినేత చంద్రబాబు టూర్ విజయవంతం చేసే ప్రక్రియ చేయాలిసి రావడం తమ్ముళ్ళకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది.
ప్రధానంగా వాటిపై ఫోకస్ …
ముందుగా చంద్రబాబు సన్నిహితులపై జరిగిన ఐటి దాడుల వ్యవహారాన్ని తిప్పికొట్టే కార్యక్రమం క్యాడర్ కి అప్పగించింది. చంద్రబాబు క్యారెక్టర్ డ్యామేజ్ కోసమే ఇదంతా అని ఇప్పటికే ఏపీలోని టిడిపి శ్రేణులన్నీ మీడియా ముందుకు వచ్చి ఖండించేశాయి. ఇక జగన్ ఢిల్లీ టూర్ తో ఏపీకి ఒరిగింది ఏమిలేదన్న ప్రచారానికి పదును పెంచింది టిడిపి. అలాగే తమకు అనుకూలంగా ఉన్న సిపిఐ నేతలతో వైసిపి ఎన్డీయే లో ఎలా చేరతారని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదంటూ సూటిగా ప్రశ్నలు వేయిస్తుంది.
ఇక అదే దారి….
మరో పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హస్తినలో జగన్ హల్ చల్ పై కస్సుబుస్సులాడారు. అవసరమైతే బిజెపి తో కటీఫ్ కి పవన్ రెడీ అయిపోయారు. అమరావతి ఉద్యమం లో ఇక తమకు సహకరించే వారు రాజకీయంగా ఎవరు లేరని స్పష్టం అవుతున్న నేపథ్యంలో న్యాయస్థానాలను నమ్ముకోవడం సరైందన్న ఆలోచన చేస్తుంది టిడిపి. ఇలా తమపై ముప్పేట దాడి చేస్తున్న సమస్యలనుంచి గట్టెక్కేందుకు గడ్డుకాలం ఎదుర్కొంటున్న తెలుగుదేశం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.