బాబు దెబ్బకు ‘ కమ్మ ‘ లు బలి అవుతున్నారా…?
ఆశ్చర్యంగా అనిపించినా.. ఇప్పుడు టీడీపీలో అంతర్గతంగా ఇదే విషయంపై చర్చ సాగుతోంది. కమ్మల పార్టీగా గుర్తింపు పొందిన టీడీపీలో కమ్మ వర్గానికి ఇచ్చే ప్రాధాన్యం వేరు. కానీ, [more]
ఆశ్చర్యంగా అనిపించినా.. ఇప్పుడు టీడీపీలో అంతర్గతంగా ఇదే విషయంపై చర్చ సాగుతోంది. కమ్మల పార్టీగా గుర్తింపు పొందిన టీడీపీలో కమ్మ వర్గానికి ఇచ్చే ప్రాధాన్యం వేరు. కానీ, [more]
ఆశ్చర్యంగా అనిపించినా.. ఇప్పుడు టీడీపీలో అంతర్గతంగా ఇదే విషయంపై చర్చ సాగుతోంది. కమ్మల పార్టీగా గుర్తింపు పొందిన టీడీపీలో కమ్మ వర్గానికి ఇచ్చే ప్రాధాన్యం వేరు. కానీ, అదే సమయంలో బీసీలే పార్టీ వెన్నెముక అని అంటారు చంద్రబాబు. మరి ఈ బీసీలకు చేసింది ఏమైనా ఉందా ? అలాగని.. తమది కమ్మ పార్టీనే అయినప్పటికీ.. కమ్మలకు ఏమైనా ప్రాధాన్యం ఉందా ? ఈ ప్రశ్నలకు సమాధానం లభించడం కొంచెం కష్టమే! టీడీపీ అభివృద్ధి కోసం.. చంద్రబాబు కమ్మ సామాజిక వర్గాన్ని బాగానే వాడుకున్నారనే వాదన ఉంది. తన పార్టీ కోసం.. తన ఎదుగుదల కోసం.. చంద్రబాబు తనసొంత సామాజిక వర్గాన్ని నిచ్చెనలా వాడుకున్నారని అంటారు.
అధికారంలో ఉన్నప్పుడు కూడా….
అయితే, చంద్రబాబు అడుగులకు మడుగు లొత్తుతున్న కమ్మం వర్గానికి పార్టీలో గడిచిన నలభై ఏళ్లుగా .. పోనీ.. చంద్రబాబు చేతిలోకి పార్టీ పగ్గాలు వచ్చిన తర్వాతైనా.. దక్కిన ప్రతిఫలం ఏంటి ? పార్టీలో కీలకమైన పదవుల కమ్మలకు ఏమైనా దక్కాయా ? పోనీ.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా.. కమ్మ వర్గానికి చెందిన నేతలకు ఏమైనా పదవులు వరించాయా ? అంటే ప్రశ్నార్థకమే..! ఇక, పార్టీలో కమ్మలను అడ్డు పెట్టి రాజకీయం చేయడంలో చంద్రబాబు ముందున్నారు. ఫలితంగానే ఇప్పుడు అమరావతి వంటి కీలక విషయంలో కమ్మ సామాజిక వర్గం మాటలు పడుతోంది.
బాబు ఫెయిల్యూర్ కాదా?
ఇక, బీసీ వర్గాలను చూస్తే.. పార్టీకి వీరే వెన్నెముక అంటూ.. చంద్రబాబు అనే క సందర్భాల్లో ప్రకటించారు. కానీ, అదే బీసీ వర్గాలకు చెందిన మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు కేసుల్లో చిక్కుకుని జైళ్లలో ఉన్నారు. వారికి బెయిల్ కూడా ఇప్పటికీ రాలేదు. మరి బీసీలంటే ప్రాణమనే చంద్రబాబు వీరికి బెయిల్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నారా ? ఇప్పుడు ఇదే అంశంపై సొంత పార్టీ నేతల్లోనే ఇది చంద్రబాబు ఫెయిల్యూర్‌గా చర్చ నడుస్తోంది. నిజానికి వైసీపీలోనూ కమ్మలు ఉన్నారు. కానీ, వారే టార్గెట్‌గా ఎక్కడా రాజకీయాలు నడవడం లేదు.
ప్రాధాన్యం లేకపోవడంతో….
గతంలో రెడ్డి సామాజిక వర్గం రాష్ట్రంలో చక్రం తిప్పినా.. ఇరవై ముప్పై ఏళ్లలో రెడ్డి వర్గంలో చాలా మంది కొత్త నేతలు వచ్చారు.. వెళ్లారు. వైఎస్ అధికారం అనంతరం కిరణ్ కుమార్‌రెడ్డి సీఎం అయ్యారు. ఇప్పుడు అదే రెడ్డి వర్గం నుంచి జగన్ సీఎంగా ఉన్నారు. ఇలా మార్పులు జరిగాయి. కానీ, చంద్రబాబు మాత్రం కమ్మలతోను, బీసీలతోనూ రాజకీయాలు చేస్తూ.. తను ఎదుగుతూ, తన పార్టీని ఎదిగేలా చేస్తున్నా.. వారికి ఇస్తున్న ప్రాధాన్యం ఏంటనేది మాత్రం ప్రశ్నార్థకంగామారింది.
తాను మాత్రమే ఎదుగుతూ….
ఇక కమ్మ సామాజిక వర్గంలో గత రెండున్నర దశాబ్దాలుగా చంద్రబాబే లీడ్‌లో ఉంటున్నారు. కమ్మలకు తాను మాత్రమే ఆప్షన్ అన్న భావన కమ్మల్లో కల్పిస్తూనే చంద్రబాబు ఇప్పటి వరకు రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. అందుకే చంద్రబాబు తప్ప మరో కమ్మ ఈ రెండున్నర దశాబ్దాల్లోనూ ఎదగలేదు. చివరకు నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ఎవ్వరూ బాబు రేంజ్లో హైలెట్ కాలేదంటే బాబు రాజకీయం అర్థమవుతోంది. ఇక ఇప్పుడు చంద్రబాబు చర్యలకు ఓవరాల్‌గా కమ్మ వర్గం అందరికి టార్గెట్ అవుతోంది.అందుకే పార్టీలో ఉన్న కమ్మలు కావొచ్చు… వైసీపీ చెంత చేరిన ఎమ్మెల్యే వంశీ లాంటి వాళ్లు కావొచ్చు… చాటుమాటుగానో లేదా పబ్లిక్గానో చంద్రబాబు చర్యలతో కమ్మ వర్గం మిగిలిన వర్గాలకు దూరమైపోతోందని చెపుతోన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ విషయంపైనే పార్టీలో అంతర్గతంగా చర్చసాగుతుండడం గమనార్హం.