కోటరీ నుంచి బయటపడినట్లేనా?
టీడీపీ అధినేత చంద్రబాబు తన కోటరీని పూర్తిగా పక్కన పెట్టేశారు. గత కొంతకాలంగా ఆయన కోటరీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికల సమయంలో కోటరీ మీద వచ్చిన ఆరోపణలే [more]
టీడీపీ అధినేత చంద్రబాబు తన కోటరీని పూర్తిగా పక్కన పెట్టేశారు. గత కొంతకాలంగా ఆయన కోటరీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికల సమయంలో కోటరీ మీద వచ్చిన ఆరోపణలే [more]
టీడీపీ అధినేత చంద్రబాబు తన కోటరీని పూర్తిగా పక్కన పెట్టేశారు. గత కొంతకాలంగా ఆయన కోటరీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికల సమయంలో కోటరీ మీద వచ్చిన ఆరోపణలే ఇందుకు కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నేరుగా టీడీపీ నేతలతోనే మాట్లాడుతూ ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. ఇది పార్టీలో చర్చనీయాంశమైంది. కోటరీకి ప్రాధాన్యత తగ్గడంతో ఇప్పుడిప్పుడే సీనియర్ నేతలు చంద్రబాబుకు చేరువవుతున్నారు.
సీనియర్ నేతల సలహాలను……
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన సీనియర్ నేతలకు విలువ ఇచ్చేవారు. అధికారులను పక్కన పెట్టి పార్టీ వ్యవహారాలను సీనియర్ నేతలతోనే మాట్లాడేవారు. కానీ 2014 ఎన్నికల్లో అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు వైఖరిలో మార్పు వచ్చింది. కొత్తగా రాజధాని ఏర్పాటు కావడం, ఇక తనకు తిరుగులేదని భావించడంతో ఆయన చుట్టూ కోటరీ చేరిపోయింది.
కార్పొరేట్ శక్తులే…..
కార్పొరేట్ శక్తులతో పాటు వ్యాపారవేత్తలు సయితం చంద్రబాబు కోటరీలో చేరిపోయారు. పార్టీ నేతలు కొందరు ఉన్నా బయట జరుగుతున్న విషయాలను చంద్రబాబుకు చేర్చే వారు కాదు. అంతా బాగుంది అంటూ చంద్రబాబును నమ్మించేవారు. వీరిలో కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు నేతలున్నారు. వారిలో ఒకరు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. వారిదే పెత్తనం అంతా. ఇక ఐఏఎస్ అధికారులు కూడా చంద్రబాబును తమ గ్రిప్ లోకి తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు.
ఇప్పుడు మార్చుకుని…..
అయితే 2019 ఎన్నికల వరకూ చంద్రబాబు కోటరీ ఆథీనంలోనే ఉండేవారు. చివరకు పార్టీ నిధులు కొన్ని నియోజకవర్గాలకు చేరలేదని, ఇందులో కోటరీ చేతివాటం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబుకు సీన్ అర్థమయింది. కోటరీని పూర్తిగా పక్కన పెట్టేశారు. అందుకే ఇటీవల సీనియర్ నేతలను చంద్రబాబు దగ్గరకు తీస్తున్నారు. త్వరలో కేంద్ర పార్టీ కార్యాలయంలో ముఖ్యులను కూడా మారుస్తారని పార్టీలో టాక్ విన్పిస్తుంది. మొత్తం మీద చంద్రబాబు కోటరీ నుంచి బయటపడ్డారంటే సగం విజయం సాధించినట్లేనని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.