బాబుకు రాజగురువు సలహా.. అందుకే ఇలా చేస్తున్నారట
ప్రస్తుతం టీడీపీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. చంద్రబాబు మాటలను కేడర్ పట్టించుకునే పరిస్థితిలో లేదు. కొందరు చంద్రబాబు మాటలు వింటున్నా.. అది నటనేనని తర్వాత అర్ధమైపోతోంది. [more]
ప్రస్తుతం టీడీపీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. చంద్రబాబు మాటలను కేడర్ పట్టించుకునే పరిస్థితిలో లేదు. కొందరు చంద్రబాబు మాటలు వింటున్నా.. అది నటనేనని తర్వాత అర్ధమైపోతోంది. [more]
ప్రస్తుతం టీడీపీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. చంద్రబాబు మాటలను కేడర్ పట్టించుకునే పరిస్థితిలో లేదు. కొందరు చంద్రబాబు మాటలు వింటున్నా.. అది నటనేనని తర్వాత అర్ధమైపోతోంది. దీంతో ఎక్కడికక్కడ పార్టీ చిన్నాభిన్నంగా ఉంది. ఈ క్రమంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి ? అనేది కీలక ప్రశ్న. మరో పక్క.. చంద్రబాబు హైదరాబాద్ నుంచి కాలు బయటకు పెట్టడం లేదు. ఈ మధ్య మూడు నెలల నుంచి అంటే.. కరోనా రెండో దశ ప్రారంభమైందని ప్రచారం జరుగుతున్న సమయం నుంచి ఆయన తనున్న గదిలోకి కూడా ఇంట్లోనే అయినా.. ఎవరినీ రానివ్వడం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
నిజాలు తెలుసుకోవడం లేదని…..
పార్టీకి ఎంతో కీలకమైన పార్లమెంటరీ జిల్లాల కమిటీలు, రెండు తెలుగు రాష్ట్రాల కమిటీలను సైతం ఆయన హైదరాబాద్‌లోనే ఉంటూ ఫోన్ల లోనే ఏర్పాటు చేసేశారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందన్నదానిపై చంద్రబాబు ఇతరుల అభిప్రాయాలు మాత్రమే తీసుకుని తనకు తోచింది చేస్తున్నారే తప్ప నిజాలు తెలుసుకోవడం లేదని పార్టీ కేడర్ కూడా గగ్గోలు పెడుతోంది. ఇక, అదే సమయంలో ఆయన కుమారుడు లోకేష్‌లో గతంలో ఎన్నడూ లేని ఉత్తేజం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అంతేకాదు.. ఆయన ఇటీవల నిర్వహించిన పర్యటనలు, ఓదార్పులు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో రైతులతో ముఖాముఖి అయిన విషయాలు బాగానే వర్కవుట్ అయ్యాయి.
రామోజీ సలహా మేరకే….
యువనేతలో ఏదో మార్పు వచ్చిందే.. అని పార్టీలోనే కాకుండా.. వైసీపీలోనూ చర్చకు వచ్చింది. నిజానికి లోకేష్‌లో మార్పు లేకపోయి ఉంటే.. వైసీపీ నేతలు ఎందుకు స్పందించేవారు ? అనేది కీలక ప్రశ్న. సో.. మొత్తానికి చంద్రబాబు అక్కడే ఉన్నా.. టీడీపీలో ఊపు రావడం వెనుక ఏం జరిగిందనే విషయం ఆసక్తిగా మారింది. ఇదే విషయంపై టీడీపీ సీనియర్లు చర్చించారు. ఇందులో తేలిన విషయం.. పార్టీకి రాజగురువుగా ఉన్న రామోజీరావు.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును మరోసారి చేయి పట్టినడిపిస్తున్నారని… రామోజీ సలహా మేరకే.. చంద్రబాబు ఇల్లు విడిచి బయటకు రావడం లేదని అంటున్నారు.
అన్ని విషయాల్లో…..
కరోనా విషయంలో ప్రతి సలహా కూడా రామోజీరావు ఇస్తున్నారని. ఆయన చెప్పినట్టే చంద్రబాబు నడుస్తున్నారని అంటున్నారు. ఇక, అదే సమయంలో లోకేష్‌ను రంగంలోకి దింపడం వెనుక కూడా రామోజీ సూచనలే ఉన్నాయని చెబుతున్నారు. ఇదే సరైన సమయమని.. ఈ సమయంలో లోకేష్ పుంజుకుంటే.. ఇక తిరుగు ఉండదని.. రామోజీ బోధించినట్టే.. చంద్రబాబు లోకేష్‌ను క్షేత్రస్థాయికి పంపించారని అంటున్నారు. పార్టీలో ఏయే జిల్లాల్లో.. ఏయే నియోజకవర్గాల్లో నాయకులు యాక్టివ్‌గా ఉంటున్నారో ? కూడా ఆయన మీడియా ద్వారా నివేదికలు కొన్ని రెడీ చేయిస్తున్నారట. టీడీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వాన్ని ఓ రేంజ్లో భుజానకెత్తుకున్న రాజగురువు మీడియా ఇప్పుడు కాస్త న్యూట్రల్‌గా ఉంటోంది. ఇక ఇప్పుడు మళ్లీ టీడీపీకి రాజగురువు.. మరోసారి ఇలా అక్కరకు వచ్చారన్న మాట! అని టీడీపీ నేతలే చర్చించుకోవడం గమనార్హం.