బాబు ఆయనను తప్పించడం ఖాయమేనా?
చంద్రబాబుకు నమ్మకమైన నేతలు ఇప్పుడు కొరవడుతున్నారు. పిలిచి పదవి ఇచ్చినా సరే పార్టీని నష్టపర్చే విధంగా వ్యవహరించడం టీడీపీలో మామూలయిపోయింది. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన [more]
చంద్రబాబుకు నమ్మకమైన నేతలు ఇప్పుడు కొరవడుతున్నారు. పిలిచి పదవి ఇచ్చినా సరే పార్టీని నష్టపర్చే విధంగా వ్యవహరించడం టీడీపీలో మామూలయిపోయింది. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన [more]
చంద్రబాబుకు నమ్మకమైన నేతలు ఇప్పుడు కొరవడుతున్నారు. పిలిచి పదవి ఇచ్చినా సరే పార్టీని నష్టపర్చే విధంగా వ్యవహరించడం టీడీపీలో మామూలయిపోయింది. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది టీడీపీ నేతలు వైసీపీ నేతలతో రాజీ పడిపోయారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది. ఆ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి వైసీపీకి లాభం చేకూరేలా ప్రయత్నిస్తున్నారని చంద్రబాబుకు పలు చోట్ల నుంచి నివేదికలు అందుతున్నాయి.
వెస్ట్ నుంచి…..
ఇందులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో 2014లో గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలోకి వెళ్లిపోవడంతో చంద్రబాబు ఇక్కడ వైశ్యసామాజిక వర్గానికి చెందిన మద్దాలి గిరికి టిక్కెట్ ఇచ్చారు. అయితే మద్దాలిగిరి గెలిచినా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన టీడీపీని అనధికారికంగా వీడారు. దీంతో అక్కడ టీడీపీనేతను చంద్రబాబు నియమించాల్సి వచ్చింది.
నమ్మకమైన నేత అని….
అనేక తర్జన భర్జనల మధ్య చంద్రబాబు తనకు అత్యంత నమ్మకమైన కోవెల మూడి రవీంద్రకు ఇన్ ఛార్జి బాధ్యతలను అప్పగించారు. ఇన్ చార్జి అప్పగించి నెలలు కూడా కాకముందే కోవెలమూడి రవీంద్రపై చంద్రబాబుకు పుంఖాను పుంఖాలుగా ఫిర్యాదులు అందుతున్నాయి. కోవెలమూడి రవీంద్ర తన వ్యాపారాలను వైసీపీ నేతలతో కలసి చేస్తున్నారని, పార్టీ ప్రయోజనాలకు గండి కొడుతున్నారని చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయి.
వైసీపీ నేతలతో…..
ఇందులో వాస్తవముందని తేలడంతో చంద్రబాబు కోవెలమూడి రవీంద్రను తప్పించాలని డిసైడ్ అయ్యారంటున్నారు. ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ స్థానానికి కొమ్మాలపాటి శ్రీధర్ కు అప్పగిస్తారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ కోవెలమూడి రవీంద్ర వైసీపీ నేతలకు వత్తాసుగా నిలుస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ఆయనను చంద్రబాబు తప్పించడం ఖాయమయిందంటున్నారు.