చెడితే దూరాలనే.. చంద్రబాబు అనుకున్నదే నిజమవుతుందా?
టీడీపీ అధినేత చంద్రబాబు అనుకున్న ప్రకారమే జరుగుతుందా? ఆయన ఊహించింది నిజమవుతుందా? అంటే అవుననే చెప్పాలి. జగన్ తో బీజేపీ సంబంధాలను చెడిపోవాలని చంద్రబాబు ఎప్పటి నుంచో [more]
టీడీపీ అధినేత చంద్రబాబు అనుకున్న ప్రకారమే జరుగుతుందా? ఆయన ఊహించింది నిజమవుతుందా? అంటే అవుననే చెప్పాలి. జగన్ తో బీజేపీ సంబంధాలను చెడిపోవాలని చంద్రబాబు ఎప్పటి నుంచో [more]
టీడీపీ అధినేత చంద్రబాబు అనుకున్న ప్రకారమే జరుగుతుందా? ఆయన ఊహించింది నిజమవుతుందా? అంటే అవుననే చెప్పాలి. జగన్ తో బీజేపీ సంబంధాలను చెడిపోవాలని చంద్రబాబు ఎప్పటి నుంచో భావిస్తున్నారు. తాను బీజేపీకి చేరువవ్వాలంటే జగన్ బీజేపీకి దూరమవ్వాల్సి ఉంటుంది. కానీ జగన్ కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. రాజ్యసభ లో పెట్టే ప్రతి బిల్లుకు జగన్ మద్దతు పలుకుతున్నారు.
జగన్ కు, బీజేపీకి….
దీంతో పాటు జగన్ కు మోదీ అపాయింట్ మెంట్ లు కూడా తొందరగా దొరుకుతున్నాయి. అయితే తాజాగా పోలవరం వివాదం బీజేపీ, జగన్ కు మధ్య దూరం పెరుగుతుందని చంద్రబాబు గట్టిగా విశ్వసిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిధుల్లో కేంద్ర ప్రభుత్వం కోత విధించడంతో జగన్ ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సి ఉంటుంది. లేకుంటేే రాష్ట్రంలో జగన్ కు వ్యతిరేకత ఎదురవుతుంది.
పోలవరం ప్రాజెక్టుపై……
కేవలం లేఖలతో సరిపెట్టడమే కాకుండా నేరుగా యుద్ధాన్ని కేంద్ర ప్రభుత్వంతో జగన్ ప్రకటించాల్సి ఉంది. పోలవరం విషయంలో జగన్ కేంద్ర ప్రభుత్వంతో రాజీపడితే అది తనకు లాభమేనని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వినా అది కూడా తనకు ప్రయోజనమేనని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే పోలవరం ప్రాజెక్టుపై జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది.
అదే ఆశ……
అలాగని కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిని చంద్రబాబు తప్పుపట్టడం లేదు. దీంతో జగన్ కు, బీజేపీకి మధ్య దూరం పెరిగితే తాను మోదీ, అమిత్ షాలకు దగ్గరవ్వొచ్చు. దీనివల్ల వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమితో బరిలోకి దిగితే జగన్ ను చాలా వరకూ కంట్రోల్ చేయవచ్చు. అందుకే చంద్రబాబు పోలవరం విషయంలో జగన్ తప్పొప్పులను మాత్రమే ఎత్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ అనడం లేదు. వీలయినంత త్వరగా ఇద్దిరికి చెడితే దూరిపోవచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. పరిస్థితులను చూస్తే అది ఎంతో దూరం లేదనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.