నాయుడుగారి కుటుంబం… ఇరికించారుగా?
చంద్రబాబు నాయుడు ఏం చేసినా అంతే. తానొవ్వక..నొప్పించక.. అన్నట్లు చేస్తారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ కూడా అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల కంటే టీడీపీ [more]
చంద్రబాబు నాయుడు ఏం చేసినా అంతే. తానొవ్వక..నొప్పించక.. అన్నట్లు చేస్తారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ కూడా అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల కంటే టీడీపీ [more]
చంద్రబాబు నాయుడు ఏం చేసినా అంతే. తానొవ్వక..నొప్పించక.. అన్నట్లు చేస్తారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ కూడా అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల కంటే టీడీపీ రాష్ట్ర కమిటీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇటీవల చంద్రబాబు పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీలను ప్రకటించారు. అలాగే పొలిట్ బ్యూరోను కూడా ప్రకటించారు. దీంతో పదవులు దక్కని వారిలో అసంతృప్తి పెరిగింది. దీనిని సర్దుబాటు చేయాలని భావించిన చంద్రబాబు దాదాపు టీడీపీలో ఉన్న నేతలందరికీ రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించారు.
శాసనసభ్యుల కంటే?…
టీడీపీ లో రాష్ట్ర కమిటీ లో దాదాపు 219 మంది సభ్యులున్నారు. ఏపీలో శాసనసభ్యుల సంఖ్య 175 మాత్రమే. అంటే చంద్రబాబు దాదాపు అన్ని నియోజకవర్గాల నేతలందరికీ రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించారు. అంటే ఒక రాష్ట్ర కమిటీ సమావేశం జరిగితే అసెంబ్లీ సమావేశం జరిగినట్లేనన్న కామెంట్స్ టీడీపీ నుంచే విన్పిస్తున్నాయి. చంద్రబాబు ఇంత భారీ స్థాయిలో రాష్ట్ర కమిటీని ఎప్పుడు నియమించలేదు.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా…..
2019 ఎన్నికలలో ఓటమి పాలయిన తర్వాత చంద్రబాబు పార్టీని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేతల నుంచి పెద్దగా సహకారం లేదు. వైసీపీ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన నేతలు ముఖం చాటేయడం మొదలుపెట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిలో ఉత్తేజం నింపేందుకు ప్రయత్నించారు. కానీ కేసుల భయంతో నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇక చచ్చినట్లు పాల్గొనాల్సిందే…
అయితే పదవులతో చంద్రబాబు వారికి ఇప్పుడు పనికల్పించారనే చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయిన నేతలతో పాటు అసంతృప్తితో ఉన్న వారందరికీ రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారు. దీంతో అసంతృప్తిని తగ్గించడమే కాకుండా వారు ఇక యాక్టివ్ అవ్వాలనే చంద్రబాబు అందరీకి పదవులను ఇచ్చారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న నేతలకు పదవులిచ్చి వారిని ఇరికించారనే చెప్పాలి. చంద్రబాబు ఈ స్ట్రాటజీ మరి రానున్న రోజుల్లో ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.