బాబు ఆ డెసిషన్ కు రావాల్సిందే?
టీడీపీ అధినేత చంద్రబాబు మొత్తానికి పదవులను దాదాపుగా అన్నీ భర్తీ చేశారు. ఇక ఆయన చాలా నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను నియమించాల్సి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు మొత్తానికి పదవులను దాదాపుగా అన్నీ భర్తీ చేశారు. ఇక ఆయన చాలా నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను నియమించాల్సి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు మొత్తానికి పదవులను దాదాపుగా అన్నీ భర్తీ చేశారు. ఇక ఆయన చాలా నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను నియమించాల్సి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు యాక్టివ్ గా లేకపోవడం, మరికొందరు పార్టీనిక వీడి పోవడంతో అక్కడ ఇన్ ఛార్జి పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. గత ఎన్నికల్లో టిక్కెట్ పొంది ఓటమి పాలయి యాక్టివ్ గా లేని వారి స్థానంలో కూడా కొత్త ఇన్ ఛార్జులను నియమించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
యాక్టివ్ గా లేక….
రామచంద్రాపురం నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు పార్టీని వీడి వెళ్లిపోయారు. అక్కడ ఇన్ ఛార్జిని నియమించాల్సి ఉంది. అలాగే చింతలపూడి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన కర్రా రాజారావు యాక్టివ్ గా లేరు. ఆయన స్థానంలో మరొకరిని నియమించాలి. ఇక్కడ గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కని పీతల సుజాత యాక్టివ్ గా ఉన్నారు. చింతలపూడి నియోజకవర్గానికి పీతల పేరు పరిశీలనలో ఉంది.
పటిష్టమైన ఓటు బ్యాంకు…..
రాజాం నియోజకవర్గంలో కొండ్రుమురళి పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రాజాం నియోజకవర్గంలో టీడీపీకి పటిష్టమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ వరస ఓటములు పార్టీని ఇబ్బంది పెడతున్నాయి. ఇక్కడ ప్రతిభా భారతి, కళా వెంకట్రావు గ్రూపులు సహకరించకపోవడంతోనే కొండ్రు మురళి ఓటమి పాలయ్యారు. దీంతో కొండ్రు మురళి స్థానంలో మరొకొరిని ఇన్ ఛార్జిగా నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారు.
నియమిస్తేనే….?
విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు గెలిచారు. అయితే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక్కడ ఇన్ ఛార్జిని నియమించాలని పార్టీ క్యాడర్ నుంచి వత్తిడి వస్తుంది. గంటా శ్రీనివాసరావు పార్టీ లో ఉన్నదీ లేనిదీ తెలియడం లేదు. దీంతో ఆయన పార్టీ మారితే వేరొకరిని నియమించాలన్న ఉద్దేశ్యంలో చంద్రబాబు ఉన్నారు. ఇలా చంద్రబాబు దాదాపు ముప్ఫయి నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను నియమించాల్సి ఉంది.