అసలే కోలుకోలేకపోతుంటే….?
ఎందుకో తెలుగుదేశం పార్టీకి అసలు కలసి రావడం లేదు. అసలే ఓటమితో పదిహేను నెలలుగా కోలుకోలేకపోతున్న తెలుగుదేశం పార్టీని ఒక గాడిన పెట్టాలని చంద్రబాబు చేయని ప్రయత్నం [more]
ఎందుకో తెలుగుదేశం పార్టీకి అసలు కలసి రావడం లేదు. అసలే ఓటమితో పదిహేను నెలలుగా కోలుకోలేకపోతున్న తెలుగుదేశం పార్టీని ఒక గాడిన పెట్టాలని చంద్రబాబు చేయని ప్రయత్నం [more]
ఎందుకో తెలుగుదేశం పార్టీకి అసలు కలసి రావడం లేదు. అసలే ఓటమితో పదిహేను నెలలుగా కోలుకోలేకపోతున్న తెలుగుదేశం పార్టీని ఒక గాడిన పెట్టాలని చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అయినా నేతలు మాత్రం నాయకత్వంపై నమ్మకం లేక పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇది ఒక రకంగా చంద్రబాబు నాయకత్వానికి పరీక్ష వంటిదే. చంద్రబాబు గతంలో ఏనాడూ చూడని సంక్షోభాన్ని తొలిసారి చూస్తున్నారన్నది వాస్తవం.
టీడీపీలో రాజీనామాలు….
గత ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా కేవలం తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకే పరిమితమయింది. అందులో నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీని వీడిపోయారు. వారిలో ఇద్దరు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నేతలే. ఇక ఓటమి పాలయిన ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇది చంద్రబాబును కలవరపర్చే అంశమే. సీనియర్ నేతలే పార్టీని వీడి వెళుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
యాక్టివేట్ చేయాలని…..
పార్టీ నేతలను యాక్టివేట్ చేయడానికి చంద్రబాబు ఇటీవల పార్టీ పదవులను భర్తీ చేశారు. గత ఎన్నికల ఫలితాలను బట్టి ఆయన ఈసారి స్ట్రాటజీ మార్చారు. ఎక్కవగా బీసీ, ఎస్సీ లకే పార్టీ పదవుల్లో ప్రాధాన్యత కల్పించారు. ఇది కొన్ని సామాజికవర్గాలకు మింగుడు పడటం లేదు. తాను పదవులిచ్చిన బీసీ, ఎస్సీ నేతలు ఏమేరకు కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి తెస్తారో? లేదో? తెలియదు కాని దీర్ఘకాలంగా పార్టీని అంటిపెట్టుకున్న నేతలు మాత్రం తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లిపోతున్నారు.
అనుబంధాన్ని తెంచుకుని…..
ఎన్టీఆర్ వీరాభిమానిగా పార్టీలో మూడు దశాబ్దాలకు పైగానే ఉంటున్న తాళ్లపాక రమేష్ రెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పింది. రమేష్ రెడ్డి భార్య కొన్నేళ్ల నుంచి ఊపాధ్యక్షురాలిగా పార్టీలో ఉన్నారు. ఈసారి ఆమెకు ఏపదవి ఇవ్వకపోవడం తమను పక్కన పెట్టడమేనని భావించిన రమేష్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. అలగే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సోంబాబు రాజీనామా చేశారు. ఆయన ఇరవై ఏళ్లుగా పార్టీలో ఉన్నారు. ఇలా వరసబెట్టి నేతలు పార్టీ పదవులు భర్తీ చేసిన తర్వాత రాజీనామా లు చేయడం పార్టీలో కలకలం రేపుతుంది.